- Telugu News Photo Gallery Technology photos Amazon great indian festival best water geysers under RS 5000
Water Geyser: గీజర్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 5వేలలో బెస్ట్ డీల్స్ ఇవే..
చలికాలం ప్రారంభమవుతోంది. దీంతో చాలా మంది వాటర్ గీజర్స్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటారు. మీరు కూడా అదే ఆలోచనతో ఉన్నారా.? అయితే అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా గీజర్‌లపై మంచి డిస్కౌంట్ లభిస్తోంది. వాటిలో కొన్ని బెస్ట్ డీల్స్ ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Oct 28, 2024 | 9:31 PM

AO Smith EWS: 5 లీటర్ల కెపాసిటీతో కూడిన ఈ వాటర్ గీజర్ అసలు ధర రూ. 6490 కాగా 38 శాతం డిస్కౌంట్‌తో రూ. 3999కి లభిస్తోంది. ఈ గీజర్ 3కేడబ్ల్యూకి సపోర్ట్ చేస్తుంది. 5 లెవల్స్ సేఫ్టీ షీల్డ్‌ను ఇచ్చారు. రస్ట్ ప్రూఫ్, హైవాటర్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లను అందించారు.

Crompton Arno Neo: క్రాంప్టన్ కంపెనీకి చెందిన ఈ ఈ 10 లీటర్ల వాటర్ గీజర్ అసలు ధర రూ. 9,200కాగా, 46 శాతం డిస్కౌంట్‌తో రూ. 4999కే లభిస్తోంది. ఇందులో 3 లెవల్ సేఫ్టీ ఫీచర్‌ను ఇచ్చారు. ఫాస్ట్ హీటింగ్‌తో తీసుకొచ్చిన ఈ గీజర్‌లో 2000 వాట్స్ కెపాసిటీ అందించారు.

Crompton Gracee: 5 లీటర్ల కెపాసిటీ గల ఈ వాటర్ గీజర్ అసలు ధర రూ. 7299కాగా ఏకంగా 55 శాతం డిస్కౌంట్‌తో రూ. 3299కి లభిస్తోంది. ఈ గీజర్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 3000 వాట్స్‌కు సపోర్ట్ చేస్తుంది. 4 లెవల్ సేఫ్టీతో డిజైన్ చేసిన ఈ గీజర్‌ను రస్ట్ ప్రూఫ్‌తో తయారు చేశారు. ఈ గీజర్ బరువు 3.46 కిలోగ్రాములుగా ఉంటుంది.

Orient Electric Aura Rapid Pro: రూ. 5వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ వాటర్ గీజర్లలో ఇదీ ఒకటి. 5.9 లీటర్ల కెపాసిటీల ఈ గీజర్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ గీజర్ అసలు ధర రూ. 79990కాగా ఏకంగా 62 శాతం డిస్కౌంట్‌తో రూ. 2999కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్, షాక్‌ప్రూఫ్ టెక్నాలజీని అందించారు.

V-Guard Zio Instant: విగార్డ్ కంపెనీకి చెందిన ఈ వాటర్ గీజర్ అసలు ధర రూ. 6300కాగా 48 శాతం డిస్కౌంట్‌తో ర. 3299కి లభిస్తోంది. 5 లీటర్ల కెపాసిటీ ఈ గీజర్ సొంతం. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్ లభిస్తోంది. స్టెయిన్‌లెస్ స్టీల్, కాపర్‌తో ఈ గీజర్‌ను రూపొందించార 2.9 కిలోగ్రాముల బరువు ఉంటుంది.




