అక్కడ కూలి పనులు కోసం రోబోలు..
TV9 Telugu
28 October 2024
ప్రపంచవ్యాప్తంగా చాల చోట్ల కూల్చివేత నుండి ఇంటి నిర్మాణం వరకు కూలీలు మాత్రమే చేస్తారని అందరికీ తెలిసిందే.
రోబోలు కార్మికులు, మెకానిక్‌ల పనిని చేయడం ప్రారంభిస్తే ఏమి జరుగుతుందో ఊహించండి? ఈరోజు దీని గురించి తెలుసుకుందాం.
ప్రస్తుతం రోబోలు కార్మికులు పని చేస్తున్న వీడియో ఒకటి కొన్ని రోజులగా సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.
వాస్తవానికి, వీడియోలో, రోబోట్ సుత్తితో ఇంటిని పడగొట్టి, ఆపై గోడకు ప్లాస్టరింగ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.
రోబోట్ చాలా త్వరగా గోడను ఎలా పగలగొడుతుందో, చాలా త్వరగా గోడను ఎలా ప్లాస్టరింగ్ చేస్తుందో అందులో చూడవచ్చు.
ఈ షాకింగ్ వీడియోను @thebestvolkan అనే IDతో దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో షేర్ చేశారు ఓ వ్యక్తి.
వీడియో చూస్తుంటే 'ఇప్పుడు కార్మికుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి' అని ఒకరు, 'రోబోలు వాడేటపుడు కూడా జాగ్రత్త అవసరం' అని అంటున్నారు.
అయితే ఇలాంటి రోబోలు కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి వస్తే మొత్తం కార్మిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి