Nokia 2780 Flip: నోకియా నుంచి అదిరిపోయే ఫ్లిప్‌ ఫోన్‌.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..

ఒకప్పుడు మొబైల్‌ మొబైల్‌ ఫోన్‌ మార్కెట్‌ను ఏలిన నోకియా ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఫీచర్‌ ఫోన్స్‌లో రారాజుగా ఎదిగిన నోకియా ఆ తర్వాత మాత్రం అనుకున్నంత మెప్పించలేక పోయింది. దీంతో అనివార్యంగా నోకియా కూడా..

Nokia 2780 Flip: నోకియా నుంచి అదిరిపోయే ఫ్లిప్‌ ఫోన్‌.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Nokia 2780 Flip
Follow us

|

Updated on: Nov 06, 2022 | 7:28 AM

ఒకప్పుడు మొబైల్‌ మొబైల్‌ ఫోన్‌ మార్కెట్‌ను ఏలిన నోకియా ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఫీచర్‌ ఫోన్స్‌లో రారాజుగా ఎదిగిన నోకియా ఆ తర్వాత మాత్రం అనుకున్నంత మెప్పించలేక పోయింది. దీంతో అనివార్యంగా నోకియా కూడా స్మార్ట్‌ మొబైల్‌ ఫోన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా నోకియా మళ్లీ ఫీచర్స్‌ ఫోన్‌ల తయారీకి పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తాజాగా నోకియా 2780 ఫ్లిప్‌ పేరుతో మరో ఫీచర్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది.

స్మార్ట్‌ఫోన్‌లు రాజ్యమేలుతోన్న తరుణంలో నోకియా మళ్లీ ఫీచర్‌ ఫోన్‌లను పరిచయం చేయనుండడం నిజంగానే సాహసోపేత నిర్ణయమని చెప్పాలి. క్వాల్కమ్‌ ప్రాసెసర్‌తో పని చేసే ఈ ఫోన్‌లో ఎఫ్‌ఎం రేడియో, వాట్సాప్‌, వైఫై సపోర్ట్‌ను ఇచ్చారు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 1.77 ఇంచెస్‌ TFT స్క్రీన్‌ను అందించారు. అలాగే 2.7 ఇంచెస్‌ TFT స్క్రీన్‌ను ఇచ్చారు. క్వాల్కమ్‌ 215 చిప్ సెట్ క్వాడ్ కోర్ సీపీయూ ఈ ఫోన్‌ సొంతం. T9 కీబోర్డ్‌ డిజైన్‌తో రూపొందించిన ఈ ఫోన్‌లో 1450 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో ఫిక్స్‌డ్‌ ఫోకస్‌తో కూడిన 5 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరాను అందించారు. అలాగే ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను సైతం అందించారు. 4జీబీ ర్యామ్‌, 512 ఎంబీ స్టోరేజ్‌ ఈ ఫోన్‌ సొంతం. ప్రస్తుతం అమెరికా మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌ను త్వరలోనే ఇతర దేశాల్లోనూ విడుదల చేయనున్నారు. ధర విషయానికొస్తే అమెరికాలో ఈ ఫోన్‌ ధర 89.99 డాలర్లుగా ఉంది. భారత మార్కెట్లో రూ. 7400గా ఉండొచ్చని అంచనా.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..