- Telugu News Photo Gallery Technology photos Amazfit Launches Amazfit band in indian market have a look on features and price details Telugu Tech news
Amazfit Band 7: మార్కెట్లోకి అమేజ్‌ఫిట్ బ్యాండ్ 7.. బడ్జెట్ ధరలో ప్రత్యేక ఫీచర్లు..
అమేజ్‌ఫిట్ తాజాగా మార్కెట్లోకి కొత్త బ్యాండ్‌ను తీసుకొచ్చింది. అమేజ్‌ఫిట్ బ్యాండ్ 7 పేరుతో ఈ నెల 8న లాంచ్ చేయనున్న ఈ బ్యాండ్‌ను బడ్జెట్ ధరలో అధునాతన ఫీచర్లను అందించారు.
Updated on: Nov 05, 2022 | 12:34 PM

ప్రముఖ గ్యాడ్జెట్ కంపెనీ అమేజ్‌ఫిట్ మరో ఫిట్‌నెస్ బ్యాండ్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తోంది. అమేజ్‌ఫిట్ బ్యాండ్ 7 పేరుతో తీసుకొచ్చిన ఈ బ్యాండ్ ఏకంగా 18 రోజుల బ్యాటరీ లైఫ్ ఇవ్వనుండడం విశేషం.

ఇందులో మొత్తం 120 స్పోర్ట్స్ మోడ్స్, వైడ్ డిస్‌ప్లేతోను అందించనున్నారు. ఈ నెల 8న అందుబాటులోకి రానున్న ఈ బ్యాండ్ ప్రారంభ ధర రూ. 2999గా ఉండనుంది.

ఇక ఫీచర్ల విషయానికొస్తే అమేజ్‌ఫిట్ బ్యాండ్ 7లో 1.47 ఇంచ్ హెచ్‌డీ అమోల్డ్ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. దీని బరవుకు కేవలం 28 గ్రాములు మాత్రమే ఉండడం విశేషం.

వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ఉండటంతో స్విమ్మింగ్, బాతింగ్ సమయంలోనూ బ్యాండ్‌ను ధరించవచ్చు. ఈ బ్యాండ్ అమెజాన్‌తో పాటు, అమేజ్‌ఫిట్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనుంది.

ఇక అమేజ్‌ఫిట్ బ్యాండ్ 7లో ఎస్ఓపీ, హార్ట్‌రేట్, స్ట్రెస్ లెవెల్స్ ట్రాకింగ్ వంటి పలు హెల్త్ ఫీచర్లను అందించనున్నారు.





























