Women Health: ఈ 6 కారణాలు మహిళల్లో లేట్ పీరియడ్స్ సమస్యను తెస్తాయి.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..

ప్రతి స్త్రీకి ఒక నిర్ణీత సమయంలో పీరియడ్స్ వస్తుంది. ఒక నెలలో పీరియడ్స్ వచ్చే తేదీ ఋతు చక్రం మీద ఆధారపడి ఉంటుంది. కానీ కొన్నిసార్లు పీరియడ్స్ మిస్ అవుతాయి.

Women Health: ఈ 6 కారణాలు మహిళల్లో లేట్ పీరియడ్స్ సమస్యను తెస్తాయి.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..
Delayed Periods
Follow us

|

Updated on: Nov 05, 2022 | 6:42 AM

ప్రతి స్త్రీకి ఒక నిర్ణీత సమయంలో పీరియడ్స్ వస్తుంది. ఒక నెలలో పీరియడ్స్ వచ్చే తేదీ ఋతు చక్రం మీద ఆధారపడి ఉంటుంది. కానీ కొన్నిసార్లు పీరియడ్స్ మిస్ అవుతాయి. లేదా సమయానికి రావు. అలాంటప్పుడు మొదటి ఆలోచన గర్భం వైపు వెళుతుంది. కానీ, అది తప్పుడు ఆలోచన. ఈ మధ్య కాలంలో ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గుతున్నాయి. పీరియడ్స్ లేట్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా PCOS లేదా PCOD కారణాలు కూడా కావొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇదేకాకుండా.. అనేక ఇతర కారణాల వల్ల కూడా పీరియడ్స్ ఆలస్యం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణాలను విస్మరించొద్దని, ఒకవేళ నిర్లక్ష్యం చేసినట్లయితే.. అవి పెద్ద సమస్యలకు దారి తీస్తాయంటున్నారు. మరి పీరియడ్స్‌ ఆలస్యంగా రావడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తీవ్రమైన ఒత్తిడి..

నిపుణుల ప్రకారం.. శరీరంలో ఒత్తిడి స్థాయి పెరిగినప్పుడు, హార్మోన్ల స్థాయి స్వయంచాలకంగా క్షీణిస్తుంది. ఒత్తిడి కారణంగా పీరియడ్స్ ఆలస్యం అవుతాయి. అంతేకాదు.. ఎక్కువ ఒత్తిడికి గురయ్యే స్త్రీలు.. ఎక్కువ ఇబ్బందిని కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందన్నారు.

ఆకస్మికంగా బరువు తగ్గడం..

అధిక బరువు తగ్గడం, ఆకస్మిక బరువు తగ్గడం వల్ల కూడా పీరియడ్స్ ఆలస్యం కావచ్చు. దీని కారణంగా, అవసరమైన హార్మోన్ల ఉత్పత్తి ఆగిపోతుంది. పీరియడ్స్ టైమ్ కూడా మారుతుంది.

శరీర బరువు..

శరీర బరువు తగ్గడం, బరువు పెరగడం కూడా క్రమరహిత పీరియడ్స్‌కు కారణమవుతుంది. అకస్మాత్తుగా బరువు పెరగడం వల్ల శరీరంలోని ఈస్ట్రోజెన్ ఎక్కువగా ప్రభావితమవుతుంది. దీని వల్ల పీరియడ్స్ కూడా క్రమరహితంగా వస్తాయి.

ప్రీమెనోపాజ్..

మెనోపాజ్ ఎక్కువగా 50, 52 సంవత్సరాల వయస్సులో సంభవిస్తుంది. అయితే చాలా మంది మహిళలు మెనోపాజ్‌కు 10 నుండి 15 సంవత్సరాల ముందు కూడా సంకేతాలను అనుభవించవచ్చు. దీన్నే ప్రీమెనోపాజ్ అంటారు. దీని కారణంగా, ఈస్ట్రోజెన్ స్థాయి హెచ్చుతగ్గులకు గురవుతుంది. దీని కారణంగా పీరియడ్స్ ఆలస్యం అవుతాయి.

గర్భనిరోధక మాత్రలు..

చాలా మంది మహిళలు గర్భనిరోధక మాత్రలు తీసుకుంటారు. దీని కారణంగా పీరియడ్స్ ఆలస్యం లేదా మిస్ అవుతాయి. ఈ పరిస్థితిలో భయపడటం కంటే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

రక్తహీనత, ఐరన్ లోపం..

మహిళల్లో రక్తహీనత, ఐరణ్ లోపం కారణంగా పీరియడ్స్ ఆలస్యం కావచ్చు. స్త్రీకి ఐరణ్ లోపం ఉంటే ఈ సమస్యను ఎదుర్కోవచ్చు.

హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..