AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart Phones: ఫిబ్రవరిలో మార్కెట్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ల జాతర.. ఫీచర్లతో పాటు ధరల వివరాలు తెలిస్తే షాక్‌..!

ముఖ్యంగా యువత చేతిలో స్మార్ట్‌ఫోన్‌ లేకపోతే ఏదో వెలితిగా ఫీలవుతున్నారు. గతంలో కేవలం మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌కు మాత్రమే వినియోగించే ఫోన్లు పెరిగిన టెక్నాలజీతో ప్రతి చిన్న అవసరానికి తప్పనిసరయ్యాయి. ఈ నేపథ్యంలో అనూహ్య డిమాండ్‌ నేపథ్యంలో స్టార్టప్‌ కంపెనీల దగ్గర నుంచి టాప్‌ కంపెనీల ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్స్‌ రిలీజ్‌ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్‌లో వచ్చే అధునాత కెమెరాలను యువత ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు.

Smart Phones: ఫిబ్రవరిలో మార్కెట్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ల జాతర.. ఫీచర్లతో పాటు ధరల వివరాలు తెలిస్తే షాక్‌..!
Smartphones
Nikhil
|

Updated on: Feb 01, 2024 | 7:00 AM

Share

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా స్మార్ట్‌ఫోన్‌ అనేది మనకు తప్పనిసరి అవసరంగా మారింది. ఓ రకంగా ఇటీవల రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ అనేది నిత్యావసర వస్తువుగా మారింది. ముఖ్యంగా యువత చేతిలో స్మార్ట్‌ఫోన్‌ లేకపోతే ఏదో వెలితిగా ఫీలవుతున్నారు. గతంలో కేవలం మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌కు మాత్రమే వినియోగించే ఫోన్లు పెరిగిన టెక్నాలజీతో ప్రతి చిన్న అవసరానికి తప్పనిసరయ్యాయి. ఈ నేపథ్యంలో అనూహ్య డిమాండ్‌ నేపథ్యంలో స్టార్టప్‌ కంపెనీల దగ్గర నుంచి టాప్‌ కంపెనీల ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్స్‌ రిలీజ్‌ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్‌లో వచ్చే అధునాత కెమెరాలను యువత ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో అన్ని కంపెనీలు ఆ దిశగా కెమెరాలపై సరికొత్త అప్‌డేట్స్‌ను ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో మార్కెట్‌ను  ముంచెత్తనున్న స్మార్ట్‌ఫోన్లపై ఓ లుక్కేద్దాం.

ఐక్యూ నియో 9 ప్రో

ఐక్యూ తన కొత్త ఫ్లాగ్‌షిప్-స్థాయి స్మార్ట్‌ఫోన్ ఐక్యూ నియో9ను ఫిబ్రవరి 22, 2024న భారతదేశంలో పరిచయం చేయడానికి సిద్ధంగా ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. స్నాప్ డ్రాగన్ 8 జెన్‌ 3 మొబైల్ ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్‌ డ్యూయల్ టోన్ వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఐక్యూ నియో 9 గరిష్టంగా 12జీబీ+512జీబీ వేరియంట్‌లో లభించే అవకాశం ఉంది. అలాగే 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో 144హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేటుతో వచ్చే ఈ స్మార్ట్‌ రూ.40 వేల లోపు రిలీజయ్యే అవకాశం ఉంది. 

హానర్‌ ఎక్స్‌ 9బి

హానర్‌ భారతదేశంలో దాని కొత్త హానర్‌ ఎక్స్‌ 9బీతో తిరిగి లాంచ్‌ కానుంది. ముఖ్యంగా ఈ ఫోన్‌లో 108 ఎంపీ ప్రైమరీ కెమెరా, 5,800 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 6.78 అంగుళాల కర్వ్ ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 13 ఆధారిత మ్యాజిక్‌ ఓఎస్‌ 7.2, స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 1 ఎస్‌ఓసీ ద్వారా పని చేస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ భారతదేశంలో రూ.30 వేల లోపు రిలీజయ్యే అవకాశం ఉంది. 

ఇవి కూడా చదవండి

నథింగ్ ఫోన్ 2ఏ

నథింగ్ ఫోన్ 2(ఏ) స్మార్ట్‌ఫోన్‌ ప్రియులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మోడల్‌. ఈ స్మార్ట్‌ఫోన్‌ నథింగ్‌ కంపెనీ ఫిబ్రవరి 26 నుంచి 29 వరకు షెడ్యూల్ చేసిన ఎండబ్ల్యూసీ 2024 ఈవెంట్లో లాంచ్‌ చేస్తారని చాలా మంది భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇందులో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 120 హెచ్‌జెడ్‌ ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో పాటు 32 ఎంపీ లేదా 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా వచ్చే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర దాదాపు రూ.33 వేలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ స్మార్ట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌ ద్వారా పని చేస్తుందని అంచనా వేస్తున్నారు. 

వివో వీ 30 5 జీ 

వివో తన కొత్త వివో వీ 30 5జీ గ్లోబల్ వేరియంట్‌స్నాప్ డ్రాగన్ 7 జెన్‌ 3, 3డీ కర్వ్ డిస్‌ప్లేతో లాంచ్‌ చేస్తున్నారు. 12 జీబీ + 12 జీబీ వర్చువల్ ర్యామ్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్‌ రెండు కలర్ ఆప్షన్లతో త్వరలో పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. ఎలిగెంట్ బ్లాక్‌తో పాటు ఓషన్ బ్లూ ఆధారంగా ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుంది. ఈ ఫోన్‌ చైనాలో ప్రారంభించిన వివో ఎస్‌ 15 సిరీస్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?