New Smartphone: 200ఎంపీ కెమెరా, 19జీబీ ర్యామ్‌.. హానర్‌ నుంచి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ మామూలుగా లేదుగా.. పూర్తి వివరాలు ఇవి..

ఓ కొత్త స్మార్ట్‌ ఫోన్‌ హానర్‌ కంపెనీ లాంచ్‌ చేసింఇ. అక్కడ మంచి రెస్పాన్స్‌ రావడంతో దీనిని మన దేశంలో కూడా లాంచ్‌ చేస్తోంది. ఈ ఫోన్‌ పేరు హానర్‌ 90 5జీ. మన దేశంలో హెచ్‌టెక్‌ ఇండియా ఈ స్మార్ట్‌ ఫోన్లను విక్రయించనుంది. దీనిలో క్వాల్‌ కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 1 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ ఉంటుంది. 5000ఎంఏహెచ్‌ బ్యాటరీతో పాటు 66వాట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్టు ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

New Smartphone: 200ఎంపీ కెమెరా, 19జీబీ ర్యామ్‌.. హానర్‌ నుంచి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ మామూలుగా లేదుగా.. పూర్తి వివరాలు ఇవి..
Honor 90 5g Smartphone
Follow us
Madhu

|

Updated on: Sep 14, 2023 | 12:31 PM

హానర్‌ స్మార్ట్‌ ఫోన్లకు మన దేశంలో మంచి డిమాండే ఉంటుంది. ఈ కంపెనీ నుంచి ఏ కొత్త మోడల్‌ విడుదలైనా సెల్‌ఫోన్‌ ప్రియుల్లో అమితాసక్తి ఉంటుంది. కొన్ని నెలల కిందట చైనాలో విడుదల ఓ కొత్త స్మార్ట్‌ ఫోన్‌ హానర్‌ కంపెనీ లాంచ్‌ చేసింఇ. అక్కడ మంచి రెస్పాన్స్‌ రావడంతో దీనిని మన దేశంలో కూడా లాంచ్‌ చేస్తోంది. ఈ ఫోన్‌ పేరు హానర్‌ 90 5జీ. మన దేశంలో హెచ్‌టెక్‌ ఇండియా ఈ స్మార్ట్‌ ఫోన్లను విక్రయించనుంది. దీనిలో క్వాల్‌ కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 1 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ ఉంటుంది. 5000ఎంఏహెచ్‌ బ్యాటరీతో పాటు 66వాట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్టు ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర, లభ్యత గురించి తెలుసుకుందాం..

హానర్ 90 5జీ ర్యామ్ సైజ్ ఇది..

ఈ హానర్‌ 90 5జీ ఫోన్‌ డైమండ్ సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లాక్, పీకాక్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. ప్రముఖ ఈకామర్స్‌ ప్లాట్‌ఫారం అమెజాన్‌ లిస్టింగ్‌ ప్రకారం ఈ ఫోన్‌ ఏకంగా 19జీబీ ర్యామ్‌, 512జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో వస్తుంది. 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ వేరియంట్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. దీనికి అదనంగా 7జీబీ వర్చువల్‌ ర్యామ్‌ కూడా అందబాటులో ఉంటుంది. అంటే టాప్‌ వేరియంట్‌ 12జీబీకి ఈ వర్చువల్‌ ర్యామ్‌ యాడ్‌ అయితే మొత్తం 19జీబీ ర్యామ్‌ అవుతుంది.

హానర్‌ 90 5జీ స్పెసిఫికేషన్లు ఇవి..

ఈ స్మార్ట్‌ ఫోన్‌లో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌1 ఎస్‌ఓసీ ద్వారా శక్తిపొందుతుంది. ఇది ఆండ్రాయిడ్‌ 13 ఆధారంగా పనిచేసే మ్యాజిక్‌ ఓఎస్‌ 7.1 అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌పై ఇది రన్‌ అవుతుంది. ఫోన్ 1.5కే (2664 x 1200 పిక్సెల్‌లు) రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల అమోల్డ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120హెర్జ్‌ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1,600 నిట్‌ల పీక్‌ బ్రైట్‌నెస్‌ అదిస్తుంది.

ఇవి కూడా చదవండి

కెమెరా, బ్యాటరీ సామర్థ్యం ఇది..

ఇక కెమెరా సెటప్‌ ను పరిశీలిస్తే వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంటుంది. 200ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 12ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 2ఎంపీ మాక్రో లెన్స్‌ ఉంటుంది. ముందు వైపు 50ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. యూఎస్‌బీ టైప్‌ సీ పోర్టు ఉంటుంది. 66వాట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్టుతో కూడిని 5000ఎంఏహెచ్‌ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, బ్లూటూత్‌ 5.2, జీపీఎస్‌ కనెక్టివిటీ ఉంటుంది. దీని ధర రూ. 35,000 ఉండే అవకాశం ఉంది. కాస్త ప్రీమియం ధరలో హై కెమెరా క్వాలిటీతో పాటు మంచి పనితీరు ఆశించే వారికి ఇది బెస్ట్ ఎంపిక.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..