Fire Boltt Pristine Smart Watch: మహిళల కోసం ఫైర్ బోల్ట్ నుంచి సరికొత్త స్మార్ట్ వాచ్.. ఫీచర్లు చూస్తే షాకవుతారంతే..
ప్రస్తుతం ఫైర్ బోల్ట్ కంపెనీ ప్రత్యేకంగా మహిళల కోసం ఓ స్మార్ట్ వాచ్‌ను రిలీజ్ చేసింది. ఫైర్ బోల్ట్ ప్రిస్టైన్ పేరుతో రిలీజ్ చేసిన ఈ వాచ్ కచ్చితంగా మహిళల మనస్సులను గెలుచుకుంటుందని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ప్రస్తుతం యువత ఎక్కువగా స్మార్ట్ ఫోన్లకు అనుసంధానించేలా ఉండే స్మార్ట్ యాక్ససరీస్‌ను ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ వాచ్‌లను ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కొంతకాలం వాచ్‌లను పెద్దగా పట్టించుకోని యువత స్మార్ట్ వాచ్‌లు వచ్చాక వాటికి అధికంగా వాడుతున్నారు. కంపెనీలు కూడా యువత అభిరుచికి తగినట్లుగా వివిధ రకాల స్మార్ట్ వాచ్‌లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, నోటిఫికేషన్లు వంటి అధునాతన ఫీచర్లతో కొత్త కొత్త మోడల్స్‌లో స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటి వరకూ అన్ని కంపెనీ యువతీ, యువకులు పెట్టుకునే మోడల్స్‌లోనే స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఫైర్ బోల్ట్ కంపెనీ ప్రత్యేకంగా మహిళల కోసం ఓ స్మార్ట్ వాచ్‌ను రిలీజ్ చేసింది. ఫైర్ బోల్ట్ ప్రిస్టైన్ పేరుతో రిలీజ్ చేసిన ఈ వాచ్ కచ్చితంగా మహిళల మనస్సులను గెలుచుకుంటుందని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. చిన్న డిస్‌ప్లేతో మహిళల చేతికి అందంగా కనిపించేలా ఈ వాచ్‌ను స్టైలిష్‌గా డిజైన్ చేశారు. ఈ వాచ్ మహిళల కోసం ప్రత్యేకంగా రిలీజ్ చేసినప్పటికీ కంపెనీకు చెందిన ఎల్‌యూఎక్స్ఈలో మొదటి మోడల్ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఫైర్‌బోల్ట్ ప్రిస్టైన్ వాచ్ ఫీచర్లు ఇతర వివరాలపై ఓ లుక్కేద్దాం.
ఫైర్‌బోల్ట్ ప్రిస్టైన్ వాచ్ ఫీచర్లు ఇవే
ఫైర్-బోల్ట్ ప్రిస్టైన్ స్మార్ట్‌వాచ్ 360×360 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 1.32 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. 43 ఎంఎం డయల్ కాన్ఫిగరేషన్‌తో త్రీడి కర్వ్డ్ గ్లాస్ ఈ వాచ్ ప్రత్యేకత. బ్లూటూత్ కాలింగ్, 60 విభిన్న స్పోర్ట్స్ మోడ్‌లు, రిమోట్ కెమెరా కంట్రోల్ వంటి ఎన్నో ఫీచర్లతో ఇది వినియోగదారులను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా మహిళల రుతచక్రం, నిద్రపోయే సమయం, హృదయ స్పందన రేటు, ఎస్‌పీఓ2 స్థాయిలను పర్యవేక్షించడానికి చాలా వీలుగా ఉంటుంది. ఫైర్-బోల్ట్ ప్రిస్టైన్‌లో రెండు విభిన్న మెనూ డిజైన్‌లు, క్లాసీ వాచ్ ఫేస్‌ల ఎంపికలు ఉన్నాయి. అలాగే రిమోట్ కెమెరా కంట్రోల్, 210 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.
ధర, లభ్యత
ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 2,999గా ఉంటుంది. ఫైర్-బోల్ట్ ప్రిస్టైన్ సిలికాన్, సిరామిక్ రెండు రకాల స్ట్రాప్‌లతో వస్తుంది. సిలికాన్ స్ట్రాప్ వేరియంట్ గోల్డ్, సిల్వర్, పింక్‌తో సహా మూడు రంగు ఎంపికల్లో ఆకట్టుకుంటుంది. అలాగే సిరామిక్ వేరియంట్ గోల్డ్ డయల్‌తో పర్ల్-వైట్ కలర్ ఆప్షన్‌లో వస్తుంది. ఈ వాచ్ వినియోగదారులకు ఫ్లిప్ కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం