New Smart Phones: సెప్టెంబర్‌లో మార్కెట్‌లో నయా స్మార్ట్ ఫోన్ల జాతర.. ఆకట్టుకునేలా టాప్ ఫీచర్లు

భారతదేశంలో స్మార్ట్ ఫోన్ రంగంలో పండుగల సీజన్‌లో కొత్త స్మార్ట్ ఫోన్ల లాంచింగ్ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏడాది ప్రారంభంలో కొన్ని మోడల్స్ రిలీజ్ అయితే పండుగ సీజన్‌లోనే ఎక్కువగా స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో హిందువులు ఎక్కువగా చేసుకునే వినాయక చవితి, దసరా పండుగలు రానున్నాయి. కాబట్టి కంపెనీలు ఈ సీజన్‌లో నయా ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి.

New Smart Phones: సెప్టెంబర్‌లో మార్కెట్‌లో నయా స్మార్ట్ ఫోన్ల జాతర.. ఆకట్టుకునేలా టాప్ ఫీచర్లు
Smart Phones
Follow us

|

Updated on: Sep 03, 2024 | 4:30 PM

భారతదేశంలో స్మార్ట్ ఫోన్ రంగంలో పండుగల సీజన్‌లో కొత్త స్మార్ట్ ఫోన్ల లాంచింగ్ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏడాది ప్రారంభంలో కొన్ని మోడల్స్ రిలీజ్ అయితే పండుగ సీజన్‌లోనే ఎక్కువగా స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో హిందువులు ఎక్కువగా చేసుకునే వినాయక చవితి, దసరా పండుగలు రానున్నాయి. కాబట్టి కంపెనీలు ఈ సీజన్‌లో నయా ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. మధ్య తరగతి, ఉన్నత వర్గాల వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని మార్కెట్‌లో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌లో లాంచ్ చేసే అవకాశం ఉన్న టాప్ స్మార్ట్ ఫోన్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఐఫోన్ 16 సిరీస్ 

యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను సెప్టెంబర్ 9న ఆవిష్కరించే అవకాశం ఉంది. ఐఫోన్‌లతో పాటు బ్రాండ్ వాచ్ సిరీస్ 10, 4వ జనరేషన్ ఎయిర్‌పాడ్‌లను ప్రకటించే అవకాశం ఉంది. రాబోయే ఐఫోన్ 16 సిరీస్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో పేరుతో నాలుగు మోడల్స్ లాంచ్ చేసే అవకాశం ఉంది. 

ఎంఐ మిక్స్ ఫ్లిప్ 

ఎంఐ భారతదేశంతో సహా ప్రపంచ మార్కెట్లలో వచ్చే నెలలో మిక్స్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెలలోనే విడుదల చేయవచ్చు. ఎంఐ మిక్స్ ఫ్లిప్ ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 3, లైకా-బ్యాక్డ్ ఆప్టిక్స్, 67 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది.

ఇవి కూడా చదవండి

మోటోరోలా రాజర్ 50

మోటోరోలా సెప్టెంబర్ 9న భారతదేశంలో రాజర్ 50ని ఆవిష్కరించే అవకాశం ఉంది. భారతదేశంలో ఫోల్డబుల్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా మోటోరోలా ఈ ఫోన్‌ను లాంచ్ చేస్తుంది. అయితే ఈ ఫోన్ గురించి ప్రస్తుతానికి ఎలాంటి వివరాలు అందుబాటులో లేవు. 

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 24 ఎఫ్ఈ

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఈకు సక్సెసర్‌‌గా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 24 ఎఫ్ఈను ఈ నెలలోనే గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేయనుంది. సామ్‌సంగ్ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ ఈ ఫోన్ ఇటీవల యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమీషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. 

టెక్నో ఫాంటమ్ 

టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ 2, ఫాంటమ్ వీ ఫ్లిప్ 2 ఫోన్లను సెప్టెంబర్‌లో ఆవిష్కరించే అవకాశం ఉంది. కచ్చితమైన విడుదల తేదీ అధికారికంగా ప్రకటించనప్పటికీ ఈ ఫోన్ ప్రీ ఆర్డరు ఇప్పటికే కంపెనీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. 

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి