Redmi buds: AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో పాటు మరెన్నో ఫీచర్స్.. రెడ్‌మీ నుంచి కొత్త ఇయర్ బడ్స్
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం రెడ్‌మీ మార్కెట్లోకి కొత్త ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. రెడ్‌మీ బడ్స్ 6 సిరీస్ పేరుతో ఈ ఇయర్ బడ్స్‌ను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా రెడ్‌మి బడ్స్ 6 యాక్టివ్, రెడ్‌మి బడ్స్ 6 లైట్, రెడ్‌మి బడ్స్ 6 ప్లే పేర్లతో వీటిని మొదట్లో చైనా మార్కెట్లోకి తీసుకురాగా తాజాగా వీటిని గ్లోబల్ మార్కెట్‌లోకి తీసుకొచ్చారు...
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం రెడ్‌మీ మార్కెట్లోకి కొత్త ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. రెడ్‌మీ బడ్స్ 6 సిరీస్ పేరుతో ఈ ఇయర్ బడ్స్‌ను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా రెడ్‌మి బడ్స్ 6 యాక్టివ్, రెడ్‌మి బడ్స్ 6 లైట్, రెడ్‌మి బడ్స్ 6 ప్లే పేర్లతో వీటిని మొదట్లో చైనా మార్కెట్లోకి తీసుకురాగా తాజాగా వీటిని గ్లోబల్ మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఈ ఇయర్ బడ్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
రెడ్‌మీ బడ్స్ లైట్..
ఈ ఇయర్ బడ్స్‌లో 12.4ఎమ్‌ఎమ్ టైటానియం డయాఫ్రమ్ డ్రైవర్‌ను ఇచ్చారు. ఇది 40dB ANC వరకు నాయిస్‌ను తొలగిస్తుంది. దీంతో స్పష్టమైన సౌండ్‌ను ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా కాల్స్ మాట్లాడే వారికి క్రిస్టల్ క్లియర్ సౌండ్ క్వాలిటీ లభిస్తుంది. అలాగే ఇందులో AI నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను అందించారు. డ్యూయల్ మైక్రోఫోన్ ఈ బడ్స్ సొంతం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 గంటల పాటు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది. ఛార్జింగ్ కేస్ 38 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది.
రెడ్‌మీ బడ్స్ 6 ప్లే..
రెడ్‌మీ బడ్స్ 6 ప్లే ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 10mm డైనమిక్ డ్రైవర్‌ను అందించారు. ఏఐ నాయిస్ రిడక్షన్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఈ ఇయర్ బడ్స్ 36 గంటల బ్యాటరీని అందిస్తుంది. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 3 గంటల బ్యాటరీ లభిస్తుంది.
రెడ్‌మీ బడ్స్ 6 యాక్టివ్..
వీటి ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 14.2mm డైనమిక్ డ్రైవర్‌ను అందించారు. బెస్ట్ సౌండ్ క్వాలిటీ వీటి సొంతం. ఇందులో డ్యూయల్ మైక్, AI నాయిస్ క్యాన్సిలేషన్ వంటి ఫీచర్లను అందించారు. ఒక్కసారి చార్జ్ చేస్తే 30 గంటల ప్లేబ్యాక్ సమయాన్ పొందొచ్చు. బ్లూటూత్ 5.4, గూగుల్ ఫాస్ట్ పెయిర్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు.
ధర ఎలా ఉందంటే..
ధర విషయానికొస్తే.. రెడ్‌మీ బడ్స్ 6 యాక్టివ్ ధర రూ. 1250గా ఉండనుంది. ఇక రెడ్‌మీ లైట్ ధర విషయానికొస్తే రూ. 1653గా నిర్ణయించారు. ఇక రెడ్‌మీ బడ్స్ 6 ప్లే ధర విషయానికొస్తే రూ. 1380గా నిర్ణయించారు. అయితే భారత మార్కెట్లో వీటి ధరలో మార్పులు ఉండే అవకాశం ఉంది. వీటిని బ్లాక్, బ్లూ, వైట్ వంటి మూడు రంగుల్లో తీసుకొచ్చారు.
Press play with the #RedmiBuds6 Series!
Style, sound, and value – all in one series. Tune in to #YourBeatYourWay! 🎶✨ pic.twitter.com/cojQFF8oFy
— Xiaomi (@Xiaomi) September 2, 2024
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..