Elon Musk: ఎలోన్‌ మస్క్‌కు గట్టి దెబ్బ.. ట్విట్టర్‌ నిషేధం.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

ఎలాన్‌ మస్క్‌కు కష్టాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ట్విట్టర్‌ విషయంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఇంకా పూర్తిగా తప్పడం లేదు. గతంలో ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ విషయంలో ఎన్నో చిక్కులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. తాజాగా ఎక్స్‌ (ట్విట్టర్‌)ను నిషేధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. అయితే ఈ తీర్పు మన దేశంలో..

Elon Musk: ఎలోన్‌ మస్క్‌కు గట్టి దెబ్బ.. ట్విట్టర్‌ నిషేధం.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు!
Elon Musk
Follow us
Subhash Goud

|

Updated on: Sep 03, 2024 | 11:59 AM

ఎలాన్‌ మస్క్‌కు కష్టాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ట్విట్టర్‌ విషయంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఇంకా పూర్తిగా తప్పడం లేదు. గతంలో ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ విషయంలో ఎన్నో చిక్కులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. తాజాగా ఎక్స్‌ (ట్విట్టర్‌)ను నిషేధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. అయితే ఈ తీర్పు మన దేశంలో అనుకుంటే పొరపాటే బ్రెజిల్‌ దేశంలో. ఎందుకంటే ఇప్పుడు  బ్రెజిల్‌లో కూడా ఎలాన్ మస్క్ కష్టాలు ఎక్కువయ్యాయి. బ్రెజిల్‌లో ఎక్స్‌ను (ట్విట్టర్‌) సుప్రీం కోర్టు నిషేధం విధించింది. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు ఎక్స్‌ని డౌన్‌లోడ్ చేస్తే భారీ జరిమానా విధిస్తామని ప్రకటించింది. అదే సమయంలో ఎవరైనా VPN సహాయంతో ఈ యాప్‌ను ఉపయోగిస్తే వారికి భారీ జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.

వాస్తవానికి నకిలీ వార్తల విషయంలో Xపై ఈ చర్య తీసుకుంది కోర్టు. అంటే X ప్లాట్‌ఫారమ్‌లో చాలా నకిలీ వార్తలు ఉన్నాయని, ఇది వినియోగదారులను చాలా ఇబ్బందులకు గురిచేస్తుందని కోర్టు తెలిపింది. చాలా వీడియోలు కూడా ఎలాంటి ధృవీకరణ లేకుండానే వైరల్ అవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని బ్రెజిల్ సుప్రీంకోర్టు ఈ కఠిన నిర్ణయం తీసుకుని దేశంలో ఎక్స్‌ని నిషేధించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: క్రెడిట్‌ కార్డును అన్‌బ్లాక్‌ చేసేందుకు ప్రయత్నించి రూ.72 లక్షలు పోగొట్టుకున్న వృద్ధురాలు!

ఈమేరకు ఈ ప్లాట్‌ఫారమ్‌ను నిషేధించాలని కోర్టు ఆదేశించినట్లు బ్రెజిల్ న్యాయమూర్తి డి మోరిస్ తెలిపారు. ఇంతకుముందు కోర్టు ఎలోన్ మస్క్‌కి 24 గంటల సమయం ఇచ్చిందని, అందులో కంపెనీ తరపున లీగల్ ఆఫీసర్‌ను నియమించమని కోరినట్లు తెలిపారు. కానీ X ఈ ఆదేశాన్ని పాటించలేదని కోర్టు తెలిపింది.

జరిమానా ఎంత?

బ్రెజిల్‌లోని సుప్రీం ఫెడరల్ కోర్ట్ ఎక్స్‌పై కఠినమైన తీర్పును ఇచ్చింది. అలాగే మొత్తం దేశంలో X ని నిషేధిస్తున్నట్లు తెలిపింది. నివేదిక ప్రకారం, ఎవరైనా X ఉపయోగిస్తే, ఆ వ్యక్తికి 50,000 రియాస్ (భారత కరెన్సీలో రూ.7 లక్షలు) జరిమానా విధించనున్నట్లు తెలిపింది. ఇది కాకుండా, VPN ఉపయోగించి లేదా రహస్యంగా ఈ యాప్‌ని ఉపయోగిస్తుంటే ఈ భారీ జరిమానాను విధించనున్నట్లు కోర్టు తెలిపింది. అటువంటి పరిస్థితిలో బ్రెజిల్‌లో X పూర్తిగా నిషేధంలో ఉండనుంది. ఇప్పుడు అక్కడి ప్రజలు ఈ యాప్‌ను ఉపయోగించలేరు.

కొన్ని నెలలుగా వివాదం..

ఎలోన్ మస్క్ X కి సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలెగ్జాండర్ డి మోరిస్ తో వివాదంలో ఉన్నారు. బ్రెజిలియన్ జస్టిస్ డి మోరిస్ గత బుధవారం ఎలోన్ ముక్స్ X కంపెనీని 24 గంటల్లో లీగల్ అధికారిని నియమించాలని ఆదేశించారు. కానీ మస్క్‌ అలాంటివేమి చేయలేదు. దీని తర్వాత, బ్రెజిల్‌లోని సుప్రీం ఫెడరల్ కోర్ట్ (STF) దేశం మొత్తం మీద X ని నిషేధించాలని ఆదేశాలు జారీ చేసింది. 18 మిలియన్ రియాల్స్ (దాదాపు రూ. 40 కోట్లు) జరిమానా కూడా విధించింది.

నిషేధంపై స్పందించిన మస్క్‌

ఈ మేరకు ట్విట్టర్‌ నిషేధంపై ఎలాన్‌ మస్క్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. న్యాయమూర్తి అలెగ్జాండ్రే బ్రెజిల్ చివరి అధ్యక్ష ఎన్నికలలో తీవ్రమైన ఉద్దేశపూర్వకంగా జోక్యానికి పాల్పడ్డారని, బ్రెజిలియన్ చట్టం ప్రకారం, 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధింపు ఉంటుందని పేర్కొన్నారు. అలా చేయడంలో కొంతమంది మాజీ ట్విటర్ ఉద్యోగులు కూడా సహకరించినట్లు కనిపిస్తోందని, ఇందుకు తనను క్షమించాలని కోరారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి