AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asus Chromebook CM14: ఆసస్ నుంచి నయా ల్యాప్‌టాప్ లాంచ్… వారే అసలు టార్గెట్..!

ల్యాప్‌టాప్ ధరలు సగటు సామాన్యుడిని భయపెట్టడంతో వారికి అందుబాటులో ఉండే ధరల్లో ల్యాప్‌టాప్‌లను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా సరసమైన ధరల్లో ల్యాప్‌టాప్‌లను అందించే ఆసస్ భారతీయ మార్కెట్‌లోకి మరో కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. ముఖ్యంగా ఆసస్ మొదటిసారిగా మీడియాటెక్ కొంపనియో 520 ప్రాసెసర్-ఆధారిత క్రోమ్ బుక్ సీఎం 14ని రూ. 26,990 ధరలో విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. క్రోమ్ ఓఎస్ ద్వారా ఆధారితమైన 14 అంగుళాల 1080 పిక్సెఎల్ డిస్‌ప్లేతో కూడిన కాంపాక్ట్ ల్యాప్‌టాప్ అమెజాన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Asus Chromebook CM14: ఆసస్ నుంచి నయా ల్యాప్‌టాప్ లాంచ్… వారే అసలు టార్గెట్..!
Asus Chrome Book Cm 14
Nikhil
|

Updated on: Feb 09, 2024 | 8:30 AM

Share

భారతదేశంలో కరోనా మహమ్మారి దెబ్బకు ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ ఉత్పత్తులు తప్పనిసరయ్యాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్‌లు అనేవి ప్రతి ఇంట్లో కచ్చితంగా వాడే ఉపకరణాలుగా మారాయి. వర్క్‌ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరగడంతో పాటు విద్యార్థులకు అవసరమైన ప్రాజెక్టు వర్క్స్ చేసుకోవడానికి ల్యాప్‌టాప్ వాడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ల్యాప్‌టాప్ ధరలు సగటు సామాన్యుడిని భయపెట్టడంతో వారికి అందుబాటులో ఉండే ధరల్లో ల్యాప్‌టాప్‌లను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా సరసమైన ధరల్లో ల్యాప్‌టాప్‌లను అందించే ఆసస్ భారతీయ మార్కెట్‌లోకి మరో కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. ముఖ్యంగా ఆసస్ మొదటిసారిగా మీడియాటెక్ కొంపనియో 520 ప్రాసెసర్-ఆధారిత క్రోమ్ బుక్ సీఎం 14ని రూ. 26,990 ధరలో విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. క్రోమ్ ఓఎస్ ద్వారా ఆధారితమైన 14 అంగుళాల 1080 పిక్సెఎల్ డిస్‌ప్లేతో కూడిన కాంపాక్ట్ ల్యాప్‌టాప్ అమెజాన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ ఫీచర్స్‌తో పాటు ఇతర వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

ఆసస్ క్రోమ్ బుక్ సీఎం 14 8 జీబీ + 128 జీబీ వేరియంట్‌లో మీడియా టెక్ కొంపనియో 520 ప్రాసెసర్‌తో ఆధారంగా పని చేస్తుంది. ఇతర ఆసస్ క్రోమ్ బుక్ వెర్షన్స్‌తో పోలిస్తే ఈ ల్యాప్‌టాప్ రెట్టింపు స్పేస్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో అదనపు నిల్వ విస్తరణ కోసం ప్రత్యేక మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ కూడా ఉంది. ఆసస్ 12 నెలల పాటు 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్‌తో కాంప్లిమెంటరీ గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది కొంపనియో 520 అనేది ఆర్మ్ మాలి జీ 50 ఎంసీ2 2ఈఈ జీపీయూతో పాటు ఆక్టా-కోర్ సీపీయూ క్లస్టర్‌తో క్రోమ్ బుక్స్ కోసం మీడియాటెక్ ప్రత్యేకంగా రూపొందించిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ వైఫై 6, బ్లూటూత్ 5.3 వంటి తాజా వైర్‌లెస్ సాంకేతికతలను కూడా ప్రారంభిస్తుంది. చాలా ఆర్మ్ ఆధారిత ప్రాసెసర్‌ల మాదిరిగానే కొంపనియో 520 మెరుగైన బ్యాటరీ జీవితాన్ని అందించడానికి క్రోమ్ బుక్ సీఎం 14కి అనుబంధంగా పని చేస్తుంది. ఆసస్ క్రోమ్ బుక్ సీఎం 14లో అప్‌గ్రేడ్ చేసిన 720 వెబ్ కెమెరాను జోడించారు. అదనపు గోప్యత మరియు ముఖం ఆటో-ఎక్స్‌పోజర్ కోసం ఫిజికల్ షట్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి

ఈ ఫీచర్ ద్వారా ఆటో బ్రైట్‌నెస్ ద్వారా డిస్ ప్లే నాణ్యతను పెంచుతుంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ల్యాప్‌టాప్ ఆండ్రాయిడ్ యాప్‌లకు మద్దతునిస్తుంది. క్రోమ్ ఓఎస్ తాజా వెర్షన్ ఆధారం ఈ ల్యాప్‌‌టాప్ పని చేయడం ద్వారా ఎంఐఎల్-ఎస్‌టీడీ 810హెచ్‌యూఎస్ మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను కూడా కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లోని 42 డబ్ల్యూహెచ్ బ్యాటరీ ఈ ల్యాప్‌టాప్‌కు శక్తినిస్తుంది. ఈ బ్యాటరీ ద్వారా ఇది ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 15 గంటల బ్యాటరీ టైమ్‌ను అందిస్తుంది. యూఎస్‌బీ సీ పోర్ట్ ద్వారా 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..