- Telugu News Photo Gallery Technology photos Amazfit launches new smart watch with AI Feature Amazfit active watch features and price
Amazfit active: మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్.. అధునాతన ఏఐ ఫీచర్లతో
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం అమెజ్‌ఫిట్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. మొన్నటి వరకు బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని స్మార్ట్ వాచ్‌లను తీసుకొచ్చిన ఈ కంపెనీ తాజాగా మిడ్ రేంజ్ ప్రీమియం స్మార్ట్ వాచ్‌ను తీసుకొచ్చింది. అమేజ్‌ఫిట్ యాక్టివ్ పేరుతో ఈ వాచ్‌ను లాంచ్ చేశారు. ఇంతకీ స్మార్ట్ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.?
Updated on: Feb 08, 2024 | 9:04 PM

ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ కంపెనీ అమేజ్‌ఫిట్ భారత మార్కెట్లోకి కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. అమేజ్ ఫిట్ యాక్టివ్ పేరుతో లాంచ్ చేసిన ఈ వాచ్ అమ్మకాలు ఫిబ్రవరి 10వ తేదీన ప్రారంభంకానున్నాయి. అమెజాన్‌తో పాటు, అమేజ్ ఫిట్ అధికారిక వెబ్‌సైట్‌లోకి అందుబాటులోకి రానున్నాయి.

లావెండర్ పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్, పింక్ కలర్స్‌లో అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.12,999గా నిర్ణయించారు. కొనుగోలు సమయంలో ఎంపిక చేసిన కొన్ని బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ లభించనుంది.

ఈ వాచ్‌లో ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఫీచర్లను అందిస్తున్నారు. ఇక ఈ వాచ్‌లో 1.75 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌డీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 390 x 450 పిక్సెల్‌ల రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం.

ఇక ఈ వాచ్‌లో పిక్సెల్ డెన్సిటీ 341 ppi. GPS, బ్లూటూత్ కనెక్టివిటీ, ముందే ఇన్‌స్టాల్ చేసిన అమెజాన్ అలెక్సాను స్మార్ట్ అసిస్టెంట్ వంటి ఫీచర్లను అందించారు.

హెల్త్ కోసం ఫిజికల్ ఫిట్‌నెస్, వ్యాయామ ట్రాకింగ్, 24x7 హృదయ స్పందన రేటు, ఎస్‌పీఓ2, ఒత్తిడి మానిటర్ వంటి ఫీచర్స్‌ను అందించారు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 14 రోజులు పనిచేస్తుంది.




