Best EV Cars: రూ.20 లక్షల లోపు అందుబాటులో ఉన్న ఈవీ కార్స్ ఇవే.. అదిరిపోయే ఫీచర్స్ వీటి సొంతం
ఎక్కువ మంది వినియోగదారులు కూడా ఈవీ వాహనాలపై ఆసక్తి చూపిస్తుండడంతో కంపెనీలు కూడా ఆ వాహనాలను మార్కెట్ రిలీజ్ చేస్తున్నాయి.
ప్రస్తుతం ఆటో మొబైల్ రంగంలో ఈవీ వాహనాల జోరు కనిపిస్తుంది. ఎక్కువ మంది వినియోగదారులు కూడా ఈవీ వాహనాలపై ఆసక్తి చూపిస్తుండడంతో కంపెనీలు కూడా ఆ వాహనాలను మార్కెట్ రిలీజ్ చేస్తున్నాయి. 2022లో అత్యధికంగా ఈవీ మార్కెట్ లో రిలీజ్ అయ్యాయంటే వాటి క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈవీ కార్ల విషయం వచ్చే సరికి ఏ రకం కారు అందుబాటులో ఉంది? అది ఏ రేట్ కు వస్తుందనే విషయంపై చాలా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పెట్రోల్, డిజీల్ తో నడిచే వాహనాలైతే అంతకు ముందు కొన్న వారి రివ్యూ తీసుకుని కొనుక్కోవచ్చు. అయితే ఈ కార్లు కొత్తవి కావడంతో వాటిని ఎలా ఏ నమ్మకంతో కొనాలని అనే విషయంలో వినియోగదారులు వెనకడుగు వేస్తున్నారు. మీరు ఈవీ కొనాలనుకుంటే మీ బడ్జెట్ రూ. 20 లక్షల లోపైతే ఈ కార్లపై ఓ లుక్కెయ్యండి
మహీంద్రా ఎస్ యూవీ 400
ఎలక్ట్రిక్ ఎస్ యూవీ బేస్ తో వచ్చే ఈ కార్ 34.5 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ కార్ ను ఓ సారి చార్జ్ చేస్తే 375 కిలో మీటర్ల మైలేజ్ వస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కార్ లో టాప్ ఎండ్ వెర్షన్ లో అయితే 39.4 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ వెర్షన్ లో అయితే ఓ సారి చార్జ్ చేస్తే 456 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కార్ ధర రూ.15.99 లక్షల నుంచి రూ.18.99 లక్షల ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈసీ, ఈఎల్ రెండూ ఫ్రంట్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ తో ఉంటుంది. ఇవి గరిష్టంగా 150 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 310 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కార్ 8.3 సెకన్లలోనే వంద కిలోమీటర్ల పరిధిని అందుకుంటుంది.
టాటా నెక్సాన్ ఈవీ
ఈ కార్ ప్రైమ్, మాక్స్ అనే రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంది. ప్రైమ్ లో 30.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, మాక్స్ లో 40.5 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ వస్తుంది. ప్రైమ్ ఓ సారి చార్జ్ చేస్తే 312 కిలో మీటర్ల మైలేజ్ వస్తే మాక్స్ 453 కిలో మీటర్ల మైలేజ్ వస్తుంది. ప్రైమ్ ధర రూ14.49 లక్షలు నుంచి రూ.17.49 లక్షల మధ్య ఉంటే మాక్స్ ధర రూ.16.49 లక్షల నుంచి రూ.18.99 లక్షల మధ్య ఉంది.
టాటా టిగోర్ ఈవీ
ఈ కార్ 26 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ కార్ ను ఓ సారి చార్జ్ చేస్తే 315 కిలో మీటర్ల మైలేజ్ వస్తుంది. ఈ కార్ లో ఉన్న డీసీ ఫాస్ట్ చార్జర్ ద్వారా 59 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకూ చార్జ్ చేయవచ్చు. అయితే 15 ఏ చార్జర్ తో అయితే 9 గంటలు చార్జ్ చేయాల్సి ఉంటుంది. ఈ కార్ ధర రూ.12.49 లక్షల నుంచి రూ.13.75 లక్షల మధ్య ఉంటుంది. ఈ కార్ కేవలం 5.7 సెకన్లలోనే 60 కిలోమీటర్ల స్పీడ్ ను అందుకుంటుంది.
టాటా టియాగో ఈవీ
ఈ కార్ కేవలం రూ.8.49 లక్షలతో మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటుంది. ఈ కార్ కూడా రెండు వెర్షన్లలో వస్తుంది. 19.2 లేదా 24 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ రెండు కార్లు ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీతో వస్తాయి. అలాగే 15 ఏ చార్జర్ తో అయితే చార్జ్ చేయడానికి సుమారు 5-6 గంటల సమయం పడుతుంది. ఈ కార్ ను కేవలం చిన్న ఫ్యామిలీలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..