NASA – Space Telescope: విశ్వ రహస్యాలను తెలిపే పవర్‌ఫుల్ టెలిస్కోప్.. అద్భుతం సృష్టించిన నాసా..!
NASA - Space Telescope: టైమ్ మిషన్.. ఎప్పటి నుంచో అందరిలో మెదులుతున్న ప్రశ్న.. నిజంగానే టైమ్ మిషన్‌ను ఉందా? ఉంటే.. దాని సాయంతో భూత, భవిష్యత్ కాలాలకు పయనించొచ్చా?
NASA – Space Telescope: టైమ్ మిషన్.. ఎప్పటి నుంచో అందరిలో మెదులుతున్న ప్రశ్న.. నిజంగానే టైమ్ మిషన్‌ను ఉందా? ఉంటే.. దాని సాయంతో భూత, భవిష్యత్ కాలాలకు పయనించొచ్చా? అనే సందేహాలు ప్రతీ ఒక్కరినీ తొలుస్తుంటాయి. ఈ టైమ్ మిషన్‌ను బేస్ చేసుకుని బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. సినీ నటుడు, నందమూరి బాలకృష్ణ నటించి ఆదిత్య 369 సినిమా కూడా ఆ టైమ్ మిషన్ ఆధారంగా రూపొందించినదే అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే, ఆ తరహాలనే ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ, అమెరికాకు చెందిన నాసా టైమ్ మిషన్‌ను తయారు చేసింది. అయితే, ఇది సినిమాల్లో మాదిరిగా కాకుండా.. ఈ అనంత విశ్వం పుట్టినప్పుడు ఎలా ఉందో చూపిస్తుందట. ఇది అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యయంగా చెప్పవచ్చు.
ఇంతకీ నాసా ఏం కనిపెట్టిందో తెలుసుకుందామా?.. అనంత విశ్వం గురించిన రహస్యాలను చేధించడానికి నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ను కనిపెట్టింది. ఇది ఒక టైమ్ ట్రావెల్ మిషన్ లాంటిది. ఈ టెలిస్కోప్‌ను నాసా 2021 డిసెంబర్ 18వ తేదీన లాంచ్ చేయనుంది. కాగా, నాసా దీన్ని తయారు చేయడం వెనుక చాలా ప్రయోజనాలే దాగున్నాయి. మరి ఆ ప్రయోజనాలు ఏంటి, ఏ పరిశోధనలకు ఇది ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. అత్యంత శక్తివంతమైన ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్.. టైమ్ మెషిన్‌లా పనిచేస్తుంది. వేల కోట్ల సంవత్సరాల కిందట.. బిగ్‌బ్యాంగ్ ద్వారా విశ్వం పుట్టినప్పుడు దూసుకొచ్చిన కాంతి ఇప్పుడు విశ్వంలో ఎక్కడ ఉన్నా దానిని ఇది చూపిస్తుంది. అంటే విశ్వంలో మనకు అత్యంత దూరంగా ఉన్న గెలాక్సీలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, అన్నింటినీ అత్యంత స్పష్టంగా ఈ టెలిస్కోప్ చూపిస్తుంది. ఈ టెలిస్కోప్ సాయంతో.. మన కంటికి కనిపించనంత దూరంలో ఉండే కాంతిని కూడా స్పష్టంగా చూడొచ్చు. అంతేకాదు…వందల కోట్ల సంవత్సరాల్లో గెలాక్సీలు ఎలా పుట్టాయి, ఎలా పెరిగాయి, ఎలా విస్తరించాయి, ఎలా ఢీకొట్టుకున్నాయి, ఎలా కలిసిపోయాయి, అనే అంశాలను సైతం ఈ టెలిస్కోప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఇలాంటివి చూపించడంలో హబుల్ టెలిస్కోప్ చాలా బాగా ఉపయోగపడింది. కానీ దాని కాలం అయిపోవడంతో దాని స్థానంలో ఈ కొత్త టెలిస్కోప్ తీసుకువచ్చారు సైంటిస్టులు.
ఇంకా చెప్పాలంటే.. ఇతక గ్రహాలపై వాతావరణం ఎలా ఉందో తెలుసుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ టెలిస్కోపును లాంచ్ చేశాక ఇది అంతరిక్షంలోకి వెళ్లి.. భూమికి లక్షల మైళ్ల అవతల సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది భూమికీ, చంద్రుడికీ మధ్య ఉన్న దూరం కంటే 4 రెట్లు ఎక్కువ. ఇక సూర్యుడి చుట్టూ తిరిగే సమయంలో వేడిని తట్టుకునేలా దీనికి హీట్ సెన్సిటివ్ విజన్ కూడా ఉంది. దీన్నే సన్ షీల్డ్ అంటారు. ఇది అతి వేడి, అతి చల్లదనం నుంచి టెలిస్కోప్‌ను కాపాడుతుంది. ఈ టెలిస్కోపుకి 18 సెగ్మెంట్ ప్రైమరీ మిర్రర్ ఉంటుంది. 6.5 మీటర్ల వ్యాసార్థంతో ఉండే ఈ మిర్రర్ ద్వారా ఈ టెలిస్కోప్ విశ్వ రహస్యాల్ని చూపిస్తుంది. ఈ టెలిస్కోప్‌ని 14 దేశాలు కలిసి తయారుచేసాయి. 1200 మంది సైంటిస్టులు, ఇంజనీర్లూ దీని నిర్మాణంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ టెలిస్కోప్‌ని స్పేస్‌క్రాఫ్ట్‌కి సెట్ చేస్తున్నారు. ఫైనల్ టెస్టింగ్ పూర్తయ్యాక.. ఫ్రెంచ్ గయానాకు తరలిస్తారు. అక్కడ డిసెంబర్ 18న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన అరియానే 5 రాకెట్ దాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది. అ తర్వాత టెలిస్కోప్ నుంచి కంటిన్యూగా ఫొటోలు.. నాసాకి వస్తూ ఉంటాయి. అదన్నమాట.. ఈ టైమ్ మిషన్ టెలిస్కోప్ కథ.
Also read:
Zodiac Signs: ఈ 6 రాశులవారు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు.! ఏయే రాశులంటే?
Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!