New Dinosar: అమ్మో ఇది మహా డేంజర్.. ఇలాంటి డైనోసార్‌ను ఎన్నడూ చూడలేదంటున్న శాస్త్రవేత్తలు..!

New Dinosar: అమ్మో ఇది మహా డేంజర్.. ఇలాంటి డైనోసార్‌ను ఎన్నడూ చూడలేదంటున్న శాస్త్రవేత్తలు..!
Dinosar

New Dinosar : డైనోసార్.. ఇప్పుడు లేవు గానీ.. కొన్ని ఏళ్ల క్రితం భూమిపై జీవించేవి. భయంకరమైన ఆకారంలో.. భారీ కాయంతో మిగతా జీవులను హడలెత్తించేవి.

Shiva Prajapati

|

Dec 04, 2021 | 6:10 AM

New Dinosar : డైనోసార్.. ఇప్పుడు లేవు గానీ.. కొన్ని ఏళ్ల క్రితం భూమిపై జీవించేవి. భయంకరమైన ఆకారంలో.. భారీ కాయంతో మిగతా జీవులను హడలెత్తించేవి. డైనోసార్స్ ఆధారంగా ఎన్నో పిక్షన్ సినిమాలు రూపొందాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. అయితే డైనోసార్స్ ఆనవాళ్లపై ఏళ్ల తరబడి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వాటి మనుగడకు సంబంధించి సైంటిస్టులు అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా కొత్త రకం డైనోసార్ జాతిని గుర్తించారు శాస్త్రవేత్తలు. దీనికి సంబంధించిన అవశేషాలను దక్షిణ అమెరికాలోని చిలీ దేశంలో కనుగొన్నారు. దీని శరీరంపై గట్టి కవచం ఉండడంతో పాటు.. దీని తోక పదునైన ఆయుధంలా ఉండదేట. లభ్యమైన శిలాజాల ఆధారంగా దీని ఊహాచిత్రాన్ని గీశారు. అయితే, ఇలాంటి డైనోసార్ ను గతంలో ఎన్నడూ చూడలేదని పరిశోధకులు చెబుతున్నారు. రెండు మీటర్ల పొడవున్న ఈ డైనోసార్‌ 74.9 మిలియన్ల సంవత్సరాల నాటిదని భావిస్తున్నారు. చిలీలోని దక్షిణ ప్రాంతంలో దీని అవశేషాలు దొరికాయి. ఆంకిలోసారస్ జాతికి చెందిన ఇతర డైనోసార్ల మాదిరిగానే దీని తల కూడా సాధారణంగానే ఉందని, శరీరం, తోక మాత్రం విభిన్నంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

అయితే, 2018లోనే ఈ కొత్త డైనోసార్‌కు సంబంధించిన శిలాజాలు గుర్తించినప్పటికీ.. తాజాగా దీనిపై ఓ స్పష్టమైన అవగాహనకు వచ్చారు సైంటిస్టులు. కొత్త డైనోసార్‌ శరీరంపైన ఎముకలు పైకి నిక్కబొడుచుకొని వచ్చినట్టుగా పెరిగాయని, అందుకే దీని తోక అంత పదునుగా ఉందని తెలిపారు. అంతేకాదు, స్టెగోరస్ డైనోసార్ తోకను చూస్తే రాటిల్ స్నేక్ తోక, బల్లి తోకలా అనిపిస్తోందని తెలిపారు. భారీ ఆర్మడిల్లో జంతువుల్లోనూ ఇలాంటి నిర్మాణాలే ఉండేవని, అయితే అవి కూడా అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ కొత్త డైనోసార్ శిలాజాలు దొరికిన పెటగోనియా ప్రాంతం ప్రస్తుతం ఎంతో చల్లగా ఉంటుందని, అయితే కోట్లాది సంవత్సరాల కిందట అక్కడ అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా స్టెగోరస్ ఎలెన్ గాసెన్ డైనోసార్లు కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయని నిర్దిష్ట అభిప్రాయానికి వచ్చారు పరిశోధకులు. ఇక ఈ కొత్త డైనోసార్ కు ‘స్టెగోరస్ ఎలెన్ గాసెన్’ అని పేరు పెట్టారు. ‘స్టెగోరస్’ అంటే గ్రీకు భాషలో ‘చదునుగా ఉన్న తోక’ అని అర్థం.

Also read:

14 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 20 నిమిషాల్లో మ్యాచ్ ముగించాడు.. సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లకు దబిడి దిబిడే.!

Zodiac Signs: ఈ 6 రాశులవారు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు.! ఏయే రాశులంటే?

IPL 2022: సన్‌రైజర్స్ బిగ్ స్కెచ్.. వార్నర్‌ను రీప్లేస్ చేసేది టీమిండియా టీ20 స్పెషలిస్ట్.. ఎవరో తెలుసా?

Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu