AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MYBYK Electric: ఇది స్కూటర్ లాంటి సైకిల్.. డబుల్ బెనిఫిట్స్.. అస్సలు మిస్ చేసుకోవద్దు..

మైబైక్ ఎలక్ట్రిక్ సైకిల్ సాధారణ పౌరులు, టూరిస్టుల కోసం డిజైన్ చేసిందయితే.. మైబైక్ ఎలక్ట్రిక్ కార్గో గిగ్ వర్కర్ల డెలివరీ కష్టాలు తీర్చేందుకు తీసుకొచ్చింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

MYBYK Electric: ఇది స్కూటర్ లాంటి సైకిల్.. డబుల్ బెనిఫిట్స్.. అస్సలు మిస్ చేసుకోవద్దు..
MYBYK Electric
Madhu
|

Updated on: Mar 30, 2023 | 4:00 PM

Share

విద్యుత్ శ్రేణిలో బస్సులు, కార్లు, బైక్లు, స్కూటర్లే కాదు.. సైకిళ్లు కూడా పెద్ద సంఖ్యలో మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి. తక్కువ దూరాలకు, వ్యాయామ పరమైన వాటికి ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లను వినియోగిస్తున్నారు. ఆరోగ్యంతో పాటు సౌకర్యాన్ని కూడా అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో వీటి వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో మైబైక్(MYBYK) అనే కంపెనీ రెండు కొత్త ఎలక్ట్రిక్ సైకిళ్లను మన దేశంలో లాంచ్ చేసింది. ఈ కంపెనీ స్టేషన్ ఆధారిత సైకిల్ షేరింగ్, రెటింగ్ సర్వీస్ లను నిర్వహిస్తుంటుంది. ఇప్పడు ఇది మన దేశ మార్కెట్లో అడుగు పెట్టింది. మైబైక్ ఎలక్ట్రిక్(MYBYK Electric), మైబైక్ ఎలక్ట్రిక్ కార్గో(MYBYK Electric Cargo) పేర్లతో రెండు సైకిళ్లను ఆవిష్కరించింది. మైబైక్ ఎలక్ట్రిక్ సైకిల్ సాధారణ పౌరులు, టూరిస్టుల కోసం డిజైన్ చేసిందయితే.. మైబైక్ ఎలక్ట్రిక్ కార్గో గిగ్ వర్కర్ల డెలివరీ కష్టాలు తీర్చేందుకు తీసుకొచ్చింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఫీచర్ల ఇవి..

మైబైక్ అనే సంస్థ ఇప్పటికే మన దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో 10,000 కంటే ఎక్కువ పెడల్ సైకిల్ ఆధారిత పబ్లిక్ బైక్ షేరింగ్ సిస్టమ్‌ను నిర్వహిస్తోంది. ఇప్పుడు ఇది అంతర్గతంగా అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ సైకిళ్లతో ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి ప్రవేశిస్తోంది. ఈ సైకిల్ MYBYK యాప్‌ సాయంతో పనిచేస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. కీలెస్ సైకిల్ అన్‌లాకింగ్, కీలెస్ బ్యాటరీ అన్‌లాకింగ్ సదుపాయాలు ఉంటాయి. పరిస్థితులను బట్టి 80-100 కిమీల పరిధిని అందిస్తుంది. దీనిలో 0.54 KwH సామర్థ్యం గల స్వాపబుల్ బ్యాటరీ ఉంటుంది.

ఆరోగ్యం.. సౌకర్యం..

MYBYK వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన అర్జిత్ సోనీ మాట్లాడుతూ, MYBYK ఎలక్ట్రిక్‌తో వినియోగదారులకు ఆరోగ్యంతో పాటు దూర ప్రయాణాలు కూడా చేయగలరన్నారు. ఇది ఆరోగ్యం కోసం పెడల్ చేయవచ్చు.. అలాగే దూరం వెళ్లడానికి స్కూటర్ లా కూడా వినియోగించుకోవచ్చని వివరించారు. సాధారణ సైకిల్ పెడల్ చేయడం ద్వారా వినియోగదారులకు ఆరోగ్యాన్ని ఇస్తుందని.. అలాగే ప్రయాణ ప్రయోజనాల కోసం తక్కువ వేగంతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్‌లానూ ఇది ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. అలాగే దీనిలో ‘పవర్ పెడల్’ మోడ్‌ వినియోగదారుకు సహాయం చేస్తుందని వివరించారు. వినియోగదారుడు పెడల్ చేసినప్పుడు.. వారి కష్టాన్ని 80 శాతం వరకు తగ్గిస్తుందని వివరించారు. దీని ధర ఎంత ఉంటుంది అనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..