5G Services : ఎయిర్‌టెల్ కంటే జియోనే టాప్… 5జీ సేవల్లో తెలుగు రాష్ట్రాల్లో ముందంజ
ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో ద్వారా మాత్రమే 5జీ సేవలు పౌరులకు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్‌కు పోటీగా జియో మరిన్ని నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకుని రావడానికి ప్రయత్నాలు చేస్తుంది.

భారతదేశంలో 5జీ సేవలను ప్రారంభించి దాదాపు ఆరు నెలలైంది. అక్టోబర్ 1, 2022న ఇండియా మొబైల్ కాంగ్రెస్ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త తరం నెట్‌వర్క్ కనెక్టివిటీని ప్రారంభించారు. ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో ద్వారా మాత్రమే 5జీ సేవలు పౌరులకు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్‌కు పోటీగా జియో మరిన్ని నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకుని రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. జియో ప్రస్తుతం 406 నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఎయిర్‌టెల్ మాత్రం 500 పైగా నగరాల్లో 5జీ సేవలను అందిస్తుంది. ఎయిర్‌టెల్ అర్హత ఉన్న వినియోగదారులకు అన్‌లిమిటెడ్ 5జీ సేవలను అందిస్తుంది. ముఖ్యంగా 2023 చివరినాటికి భారతదేశంలోని అన్ని నగరాల్లో 5జీ సేవలను విస్తరించాలని రెండు టెలికాం నెట్‌వర్క్‌లు పోటీ పడుతున్నాయి. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు 5 జీ సర్వీస్ అందిస్తున్నారో ఓ సారి చూద్దాం.
జియో 5 జీ సేవలు అందించే నగరాలు ఇవీ
ఆంధ్రప్రదేశ్
చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుమల, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హిందూపూర్, మదనపల్లె, ప్రొద్దుటూరు, అనంతపురము, భీమవరం, నంద్యాల, తెనాలి, అనకాపల్లి, మచిలీపట్నం, తాడిపత్రి, అమలాపురం, ధర్మవరం, కావలి, తణుకు, తుని, వినుకొండ, ఆదోని, బద్వేల్, చిలకలూరిపేట, గుడివాడ, కదిరి, నరసాపురం, రాయచోటి, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం నగరాల్లో జియో 5 జీ సేవలు అందుబాటులో ఉన్నాయి.
తెలంగాణ
హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, మంచిర్యాల, ఆదిలాబాద్, రామగుండం, మహబూబ్ నగర్, సిద్దిపేట, సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, కోదాడ, తాండూరు, జహీరాబాద్, నిర్మల్, సూర్యాపేట నగరాల్లో 5 జీ సేవలను జియో అందిస్తుంది.
ఎయిర్‌టెల్ 5 జీ సేవలు అందించే నగరాలు ఇవీ
ఆంధ్రప్రదేశ్
కడప, ఒంగోలు, ఏలూరు, విజయనగరం, నెల్లూరు, అనంతపురం, వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి, అనకాపల్లి, తాడేపల్లిగూడెం, ఆదోని, చిలకలూరిపేట, కదిరి, అచ్చితాపురం, తాడేపల్లి, గద్వాల, కండ్లూరు, తాడిపత్రి, గద్వాల నగరాల్లో ఎయిర్‌టెల్ 5 జీ సేవలను అందిస్తుంది.
తెలంగాణ
నిజామాబాద్, ఖమ్మం, రామగుండం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, సంగారెడ్డి, యెల్లందు, కామారెడ్డి, పెద్దపల్లె, మేడ్చల్, వికారాబాద్ నగరాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని టెక్నాలజి వార్తల కోసం చూడండి..