Smart phone: మీ ఫోన్‌ను రిపేర్‌కు ఇస్తున్నారా.? అయితే ఈ విషయాలు మర్చిపోకండి..
ఇక స్మార్ట్ ఫోన్‌లో వ్యక్తిగత ఫొటోలు, బ్యాంకింగ్ వివరాలతో పాటు మరెన్నో పర్సనల్ డేటాను సేవ్ చేసుకుంటున్నారు. అయితే స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించే క్రమంలో ఏదో ఒక రోజు కచ్చితంగా రిపేర్ అవుతుంది. దీంతో రిపేర్ సెంటర్‌లో ఫోన్‌ను ఇస్తుంటారు. అయితే ఎన్నో పర్సనల్ విషయాలకు కేరాఫ్‌గా నిలిచే స్మార్ట్ ఫోన్‌ను రిపేర్‌కు ఇచ్చేప్పుడు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు...

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం అనివార్యంగా మారింది. ఇదొక నిత్యవసర వస్తువుగా మారింది. ఇక స్మార్ట్ ఫోన్ అనేది కేవలం కాల్స్ మాట్లాడుకోవడానికి ఉపయోగించే గ్యాడ్జెట్‌గా మాత్రమే కాకుండా.. బ్యాంకింగ్ మొదలు ఎన్నో పనులకు స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు.
ఇక స్మార్ట్ ఫోన్‌లో వ్యక్తిగత ఫొటోలు, బ్యాంకింగ్ వివరాలతో పాటు మరెన్నో పర్సనల్ డేటాను సేవ్ చేసుకుంటున్నారు. అయితే స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించే క్రమంలో ఏదో ఒక రోజు కచ్చితంగా రిపేర్ అవుతుంది. దీంతో రిపేర్ సెంటర్‌లో ఫోన్‌ను ఇస్తుంటారు. అయితే ఎన్నో పర్సనల్ విషయాలకు కేరాఫ్‌గా నిలిచే స్మార్ట్ ఫోన్‌ను రిపేర్‌కు ఇచ్చేప్పుడు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ విషయాలు ఏంటంటే..
* మీ మొబైల్‌లో బ్యాంకింగ్ యాప్‌లు ఏవైనా ఉంటే ముందుగా వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. యాప్స్‌ను తొలగించే ముందు పాస్‌వర్డ్, యూజర్ నేమ్‌లను ఒక పేపర్‌పై నోట్ చేసుకుంటే బెటర్.
* ఇక స్మార్ట్ ఫోన్‌లోని నోట్ ప్యాడ్‌లో పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత వివరాలను నోట్ చేసుకోవడం సర్వసాధారణమైన విషయం. అయితే ఫోన్‌ను ఎవరికైనా ఇచ్చేప్పుడు నోట్స్‌ను డిలీట్ చేయడం మర్చిపోకూడదు.
* ప్రస్తుతం సోషల్ మీడియాను ఉపయోగించని వారు లేరనడంలో ఎలాంటి సందేహం లేదు. మీ సోషల్ మీడియా అకౌంట్ మిస్ యూజ్ కాకూడదంటే అన్ని అకౌంట్స్‌ను లాగవుట్ చేసిన తర్వాతే ఫోన్‌ను రిపేర్ సెంటర్‌కు ఇవ్వాలి.
* ఇక జీమెయిల్ అకౌంట్ కూడా లాగవుట్ అయిన తర్వాతే ఫోన్‌ను రిపేర్ సెంటర్‌కు ఇవ్వాలి. జీమెయిల్ అకౌంట్‌కు సంబంధించి అన్ని వివరాల్లో గోప్యత పాటించడమే చాలా అవసరం.
* ఫోన్ గ్యాలరీలో ఏవైనా వ్యక్తిగత ఫొటోలు ఉంటే డిలీట్ చేసిన తర్వాతే వాటిని రిపేర్ సెంటర్లకు ఇవ్వాలి. ఒకవేళ ఫొటోలు కోల్పోకుండా ఉండాలంటే వాటిని ఒక మెమొరీ కార్డ్ లేదా, పెన్‌డ్రైవ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. లేదా డ్రైవ్‌లో సేవ్‌లో చేసుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..