Motorola Flip Phones: ‘ఫ్లిప్’ హిప్ హుర్రే.. ఎదురుచూపులకు ఇక ఫుల్ స్టాప్.. మార్కెట్లోకి మోటోరోలా ఫ్లిప్ ఫోన్ల గ్రాండ్ ఎంట్రీ..

ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న మోటోరోలా ఫ్లిప్ ఫోన్లు మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాయి. మోటోరోలా రాజ్ఆర్ 40, రాజ్ఆర్ 40 అల్ట్రా పేర్లతో మన దేశంలో లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్లలో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

Motorola Flip Phones: ‘ఫ్లిప్’ హిప్ హుర్రే.. ఎదురుచూపులకు ఇక ఫుల్ స్టాప్.. మార్కెట్లోకి మోటోరోలా ఫ్లిప్ ఫోన్ల గ్రాండ్ ఎంట్రీ..
Motorola Razr 40
Follow us

|

Updated on: Jul 04, 2023 | 5:30 PM

ఫోల్డబుల్ ఫోన్లలో శామ్సంగ్ ఇప్పటికే తన ముద్ర వేసుకుంది. పలు రకాల మోడళ్లు మార్కెట్లో విస్తృతంగా అమ్ముడవుతున్నాయి. ఈ క్రమంలో మోటోరోలా ఈ సెక్షన్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న మోటోరోలా ఫ్లిప్ ఫోన్లు మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాయి. మోటోరోలా రాజ్ఆర్ 40, రాజ్ఆర్ 40 అల్ట్రా పేర్లతో మన దేశంలో లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్లలో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

లుక్ ఇలా..

మోటో రాజ్ఆర్ 40 అల్ట్రా ఫోన్ రెండు స్టన్నింగ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. వివా మాగ్నెట్, ఇన్ఫినెట్ బ్లాక్ రంగుల్లో లభ్యమవుతోంది. దీనిలో 30 వాట్ల టర్బో పవర్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. శక్తివంతమైన స్నాప్ డ్రాగన్ 8ప్లస్ జెన్ 1 ప్రాసెసర్ తో ఇది పనిచేస్తుంది. మరోవైపు మోటో రాజ్ ఆర్ 40 స్మార్ట్ ఫోన్ మూడు రంగులు సేజ్ గ్రీన్, వెనీలా క్రీమ్, సమ్మర్ లిలాక్ లలో లభ్యమవుతోంది. 8జీబీ ర్యామ్/256 స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్లలోని ఫ్లిప్ స్క్రీన్ వినియోగదారులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. సెల్ఫీలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫోన్ మొత్తం ఓపెన్ చేయకుండానే యాప్స్ అన్ని వాడుకోవచ్చు. మ్యూజిక్ లైబ్రెరీని కూడా ఒకేసారి వాడొచ్చు. బయట వైపు స్క్రీన్ తో ఇబ్బందిలేకుండా అన్ని టాస్క్ లు చూడొచ్చు.

మోటోరోలా రాజ్ఆర్ 40 అల్ట్రా స్పెసిఫికేషన్లు..

ఈ ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఆధారపడి పనిచేస్తుంది. ఇంటర్నెల్ స్టోరేజ్ 256జీబీ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ రీడర్ ఉంటుంది. ప్రాక్సిమిటీ ప్లస్ లైట్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సెలోమీటర్, గైరోస్కోప్, ఈకోంపాస్, హాల్ సెన్సార్ లు ఉంటాయి. దీనిలో స్నాప్ డ్రాగన్ 8ప్లస్ జెన్ 1 ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్ సైజ్ 8జీబీ ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ ఫింగర్ ప్రింట్ రీడర్, ఫేస్ అన్ లాక్ ఉంటుంది. ఇక బ్యాటరీ సామర్థ్యం చూస్తే 3800ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. 30వాట్ల టర్బో పవర్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. ఇక డిస్ ప్లే విషయానికి వస్తే ప్రధాన డిస్ ప్లే 6.9 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ పీ ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది. బయటవైపు స్క్రీన్ 3.6 పీఓఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది. ఫోన్ వెనుకవైపు రెండు కెమెరా 12ఎంపీ, 13ఎంపీతో ఉంటాయి. ముందు వైపు ప్రధాన డిస్ ప్లే వద్ద 32 ఎంపీ క్వాడ్ పిక్సల్ కెమెరా, బయట వైపు స్క్రీన్ వద్ద 12ఎంపీ, 13ఎంపీ కెమెరాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగే అలవాటుందా..? డేంజర్
ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగే అలవాటుందా..? డేంజర్
యూరిక్‌ యాసిడ్‌ సమస్య తగ్గాలంటే ప్రతి రోజూ ఈ పండ్లు తీసుకోవాలట..!
యూరిక్‌ యాసిడ్‌ సమస్య తగ్గాలంటే ప్రతి రోజూ ఈ పండ్లు తీసుకోవాలట..!
అమ్మబాబోయ్..!! ఈ హాట్ చాక్లెట్ .. ఈరోజుల్లో మూవీ హీరోయినా..!
అమ్మబాబోయ్..!! ఈ హాట్ చాక్లెట్ .. ఈరోజుల్లో మూవీ హీరోయినా..!
బాలయ్య రూట్లో నడుస్తున్న కోలీవుడ్‌ సీనియర్లు
బాలయ్య రూట్లో నడుస్తున్న కోలీవుడ్‌ సీనియర్లు
విద్యార్ధుల వింత ప్రవర్తన.. స్కూల్‌లోనే పూనకాలు, అరుపులు, కేకలు.!
విద్యార్ధుల వింత ప్రవర్తన.. స్కూల్‌లోనే పూనకాలు, అరుపులు, కేకలు.!
మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పక తీసుకోవాలి
మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పక తీసుకోవాలి
టాటాతో ఇషా అంబానీ పోటీ.. గంటలోనే సరుకుల డెలివరీ..కొత్త ప్రాజెక్ట్
టాటాతో ఇషా అంబానీ పోటీ.. గంటలోనే సరుకుల డెలివరీ..కొత్త ప్రాజెక్ట్
డేంజర్ బెల్స్ మోగిస్తున్న డయేరియా.. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ
డేంజర్ బెల్స్ మోగిస్తున్న డయేరియా.. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ
స్నేహితురాలి పెళ్లిలో రష్మిక.. చీరకట్టులో ఎంత క్యూట్‌గా ఉందో!!
స్నేహితురాలి పెళ్లిలో రష్మిక.. చీరకట్టులో ఎంత క్యూట్‌గా ఉందో!!
అన్నయ్యకు దక్కని గౌరవం తమ్ముడికి దక్కేనా
అన్నయ్యకు దక్కని గౌరవం తమ్ముడికి దక్కేనా
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై బీజేపీ ఎంపీ పురంధేశ్వరి స్పెషల్‌ ఫోకస్‌
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై బీజేపీ ఎంపీ పురంధేశ్వరి స్పెషల్‌ ఫోకస్‌
'ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. నన్ను క్షమించండి'.. వీడియో వైరల్..
'ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. నన్ను క్షమించండి'.. వీడియో వైరల్..
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!