Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chat GPT: శంకర్ రోబో సినిమా నిజం కానుందా? చాట్ జీపీటీతో స్వయంగా ఆలోచించే రోబోలు వస్తాయా? మైక్రోసాఫ్ట్ చెబుతోందేంటి?

ఇటీవల అందుబాటులోకి వచ్చిన చాట్ జీపీటీ సాయంతో రోబోలను కంట్రోల్ చేసే సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో కొన్ని సానుకూల ఫలితాలు కూడా వచ్చాయని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.

Chat GPT: శంకర్ రోబో సినిమా నిజం కానుందా? చాట్ జీపీటీతో స్వయంగా ఆలోచించే రోబోలు వస్తాయా? మైక్రోసాఫ్ట్ చెబుతోందేంటి?
Chatgpt Robot
Follow us
Madhu

| Edited By: Team Veegam

Updated on: Feb 26, 2023 | 10:06 PM

శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో సిరీస్ సినిమాలు అందరూ చూసే ఉంటారు. అందులో అత్యంత అడ్వాన్స్డ్ రోబోను హీరో తయారు చేస్తాడు. ఎంతంటే తనంతట తనే ఆలోచించి నిర్ణయాలు తీసుకునేంతగా అది ఉంటుంది. అది సినిమా మాత్రమే. ప్రస్తుతం అది నిజం చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో వస్తున్న క‌ృత్రిమ మేథతో ఇది సాధ్యమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దీనిపైనే మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందిన పరిశోధకులు పనిచేస్తున్నారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన చాట్ జీపీటీ సాయంతో రోబోలను కంట్రోల్ చేసే సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో కొన్ని సానుకూల ఫలితాలు కూడా వచ్చాయని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎక్కడ విన్నా చాట్ జీపీటీ..

ప్రస్తుతం ఇంటర్ నెట్ లో అంతా చాట్ జీపీటీ గురించి చర్చ నడుస్తోంది. టెక్ రంగంలో ఇప్పుడు ఇదొక సంచలనం. ఈ ఓపెన్ ఏఐ చాట్ బాట్ తో సంభాషించేందుకు చాలా మంది ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ చాట్ జీపీటీతో అంతకుమించి అనేంతగా ప్రయోగాలు ప్రారంభించింది. మాటలు ఎంతకాలం చెబుతాం.. నెక్ట్స్ లెవెల్ తీసుకెళ్దాం అని మైక్రోసాఫ్ట్ సంకల్పించింది.

రోబోలను కంట్రోల్ చేయొచ్చు..

చాట్ జీపీటీతో రోబోలు, డ్రోన్లను కంట్రోల్ చేసేలా టెస్టులు ప్రారంభించింది. ప్రస్తుతానికి వాటిలో మెరుగైన ఫలితాలు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. ఒక రోబో చేతిని కంట్రోల్ చేసేలా చాట్ జీపీటీకి సూచనలు చేయగా.. మైక్రోసాఫ్ట్ లోగోని అది సెట్ చేసిందంట. అలాగే చాట్ జీపీటీకి సుదీర్ఘంగా కోడ్ రాయగల సత్తా ఉంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ డిటెక్షన్, ఆబ్జక్ట్ డిస్టన్స్ డేటాకు అనుమతులు ఇచ్చి దాని సామర్థ్యాన్ని పరీక్షించారు. అప్పుడు చాట్ జీపీటీ ఎంతో సమర్థంగా కోడ్ జనరేట్ చేసిందంట. రోబోలను కంట్రోల్ చేసేందుకు ముఖ్యంగా పైథాన్ లో కోడ్ రాస్తున్నట్లు చెప్పారు. చాట్ జీపీటీ పనితనాన్ని శాస్త్రవేత్తలు మెచ్చుకుంటున్నారు. తమ పరీక్షల్లో చాట్ జీపీటీ ఎంతో మెరుగ్గా ఫలితాలిస్తున్నట్లు చెబుతున్నారు. చాట్ జీపీటీ పర్ఫెక్ట్ అయినటప్పటికీ దానికి మనిషి సాయం అవసరం ఉంటుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..