Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Robotic Scavengers: మ్యాన్‌ హోల్స్‌ ఇక ప్రాణాలు తీయలేవ్.. ప్రపంచంలోనే తొలిసారిగా వినూత్న ఆవిష్కరణ..

ఒక్కరో ఇద్దరో కాదు.. ప్రతిఏటా వందలమంది ప్రాణాలు హరిస్తున్నాయి మ్యాన్‌ హోల్స్‌.. మ్యాన్‌ హోల్‌లో పడి ప్రమాదవశాత్తూ మరణిస్తున్న వారు ఒక ఎత్తైతే.. శుభ్రపరిచేందుకు మ్యాన్‌హోల్‌ లో దిగి ప్రాణాలు కోల్పోతోన్న వారు అధిక సంఖ్యలోనే ఉన్నారు.

Robotic Scavengers: మ్యాన్‌ హోల్స్‌ ఇక ప్రాణాలు తీయలేవ్.. ప్రపంచంలోనే తొలిసారిగా వినూత్న ఆవిష్కరణ..
Robotic Scavengers
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 26, 2023 | 6:10 PM

ఒక్కరో ఇద్దరో కాదు.. ప్రతిఏటా వందలమంది ప్రాణాలు హరిస్తున్నాయి మ్యాన్‌ హోల్స్‌.. మ్యాన్‌ హోల్‌లో పడి ప్రమాదవశాత్తూ మరణిస్తున్న వారు ఒక ఎత్తైతే.. శుభ్రపరిచేందుకు మ్యాన్‌హోల్‌ లో దిగి ప్రాణాలు కోల్పోతోన్న వారు అధిక సంఖ్యలోనే ఉన్నారు. దేశవ్యాప్తంగా మ్యాన్‌హోల్‌ కిల్లింగ్స్‌కి కారణమౌతోంది మ్యాన్‌హోల్స్‌ని మనుషులే క్లీన్‌ చేసే అమానవీయ కార్యక్రమం. మ్యాన్‌హోల్‌ మరణాలకు శాశ్వత పరిష్కారాన్ని కనిపెట్టింది కేరళ ప్రభుత్వం. రోబోటిక్‌ స్కావెంజింగ్‌ వ్యవస్థకు శ్రీకారం చుట్టి.. ప్రపంచానికే తలమానికంగా నిలిచింది. మాన్యువల్‌ స్కావెంజింగ్‌ వ్యవస్థలో కేరళ వేసిన విప్లవాత్మక తొలి అడుగేంటో చూద్దాం..

వందల ఏళ్ళుగా మలమూత్రాలను చేతులతో శుభ్రంచేస్తూ.. మ్యాన్‌ హోల్స్‌లో పడి విషపు గాలులు పీల్చి.. మృత్యువు ఒడికి చేరుతోన్న దారుణఘటనలనేకం. ఏటా వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా సఫాయికర్మచారీలు పెద్ద ఉద్యమమే నిర్వహిస్తున్నారు. దీనికి బెజవాడ విల్సన్‌ సారథ్యం వహిస్తున్నారు. మానవ విసర్జితాలను చేతులతో ఎత్తివేయడమే కాదు.. నెత్తిన మోసే అమానవీయ కార్యక్రమాన్ని నిషేధించాలంటూ ఎలుగెత్తి చాటిన ఐఏఎస్‌ అధికారి ఎస్‌ఆర్‌.శంకరన్‌ కన్న కలలు సాకారమయ్యే సందర్భం సమీపించింది. ప్రపంచంలోనే తొలి అద్భుతాన్ని ఆవిష్కృతం చేసింది కేరళ రాష్ట్రం. ప్రపంచంలోనే తొలి రోబోటిక్‌ స్కావెంజర్‌ ని ఆవిష్కరించి శెభాష్‌ అనిపించుకుంది.

దీంతో గత కొన్ని దశాబ్దాలుగా మాన్యువల్‌ స్కావెంజింగ్‌ విధానానికి వ్యతిరేకంగా జరుగుతోన్న వీరి పోరాటం ఫలించినట్టేనని భావించాలి. మనుషుల ప్రాణాలు హరించే అమానవీయ వ్యవస్థకు ఇక కాలం చెల్లినట్టేనని నిరూపించింది కేరళ ప్రభుత్వం. దీంతో మాన్యువల్‌ స్కావెంజింగ్‌ వ్యవస్థకు శాశ్వత పరిష్కారం దొరికింది. శతాబ్దాల అకృత్యానికి తెరదించి… దేశానికే తలమానికంగా నిలిచింది కేరళ రాష్ట్రం. అమానవీయ మాన్యువల్‌ స్కావెంజింగ్‌ వ్యవస్థకు ఫుల్‌స్టాప్‌ పెట్టే కార్యక్రమంలో భాగంగా కేరళలోని గురవాయూర్‌ లో రొబోటిక్‌ స్కావెంజర్‌ ని ఆవిష్కరించింది. మాన్యువల్‌ స్కావెంజింగ్‌ స్థానంలో రోబోటిక్‌ స్కావెంజర్ బండికూట్‌ని ప్రవేశ పెట్టి శెభాష్‌ అనిపించుకుంది కేరళ రాష్ట్రం. ఈ ఆవిష్కరణతో కేరళలో మాన్యువల్‌ స్కావెంజింగ్‌ వ్యవస్థకి తెరపడిందన్నారు… స్టేట్‌ వాటర్‌ రీసోర్సెస్‌ మినిస్టర్‌ రోషి ఆగస్టిన్‌.

ఇవి కూడా చదవండి

ఈ నూతన రోబో తో మ్యాన్‌హోల్స్‌లో కి మనుషులు దిగి ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి తప్పుతుంది. మెషిన్‌ని మ్యాన్‌హోల్‌లోకి పంపి ఎంతటి కఠినమైన పరిస్థితుల్లోనైనా మురికిని శుభ్రపరచొచ్చు. మురికి కాల్వల్లోని చెత్తా చెదారాన్ని అవలీలగా తొలగించొచ్చు. కేరళలోని టెక్నోపార్క్‌ బేస్డ్‌ కంపెనీ జెనరోబొటిక్స్‌ అభివృద్ధిపరిచిన రొబోటిక్‌ స్కావెంజర్‌ ప్రపంచంలోనే ప్రప్రథమ ఆవిష్కరణ కావడం విశేషం. బండికూట్‌గా పిలుచుకునే ఈ క్లీనింగ్‌ మెషిన్‌ ద్వారా డ్రైనేజీలను, మురుగునీటి కాల్వలను శుభ్రపరుస్తారు. ప్రాణాంతక మ్యాన్‌ హోల్స్‌లోకి మనుషులు దిగే పనిలేకుండా ఈ రోబోటిక్‌ స్కావెంజర్‌తో వాటినిక్లీన్‌ చేస్తారు.

రోబోటిక్‌ స్కావెంజర్స్‌ని ప్రవేశ పెట్టిన తొలి రాష్ట్రంగా కేరళ రికార్డు సాధించింది. దీంతో దేశంలో శతాబ్దాల అకృత్యానికి తెరపడింది. దశాబ్దాల సఫాయికర్మచారీల డిమాండ్‌ నెరవేరింది. దీంతో ఇకపై మృత్యుకుహరాలుగా మారిన మ్యాన్‌ హోల్స్‌ మరణాలకు శాశ్వత పరిష్కారం దొరికినట్టయ్యింది. 100 డే యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం త్రిసూర్‌ జిల్లాలోని గురువాయూర్‌లో మురుగునీటి శుద్ధి ప్రాజెక్టు కార్యక్రమంలో భాగంగా ఈ రోబోటిక్‌ స్కావెంజర్‌ను ఆవిష్కరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..