AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Microsoft Copilot Pro: దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్.. అడ్వాన్స్‌డ్ ఏఐ టూల్స్‌తో కోపైలట్ ప్రో ఆవిష్కరణ

మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టూల్స్ పెయిడ్ వెర్షన్ కోపైలట్ ప్రో విడుదలైంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో భాగంగా అనేక ప్రత్యేకతలతో దీన్ని రూపొందించారు. మనదేశంతో పాటు ప్రపంచంలోని 222 దేశాల్లో విడుదలైంది. నెలకు రూ.2 వేలు చెల్లించి దీనిని ఉపయోగించుకోవచ్చు. దీని ఏఐ టూల్స్ ను ఉపయోగించి అనేక అద్భుతాలు చేయవచ్చు.

Microsoft Copilot Pro: దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్.. అడ్వాన్స్‌డ్ ఏఐ టూల్స్‌తో కోపైలట్ ప్రో ఆవిష్కరణ
Microsoft Copilot Pro
Madhu
|

Updated on: Mar 19, 2024 | 7:54 AM

Share

ఆధునిక కాలంలో సాంకేతికత బాగా పెరిగిపోయింది. అన్ని రంగాల్లో దీని వినియోగం ఎక్కువైంది. గతంలో ఎంతో కష్టంగా అనిపించే పనులు నూతన సాంకేతిక విధానంతో చాలా సులువుగా చేయగలుగుతున్నాం. ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ). దీని ద్వారా ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. కేవలం మన దగ్గర ఉన్న ఒక్క ఫోటోతో అందమైన చిత్రాలను రూపొందించవచ్చు. వ్యక్తిగతంగా, ఉద్యోగ పరంగా నైపుణ్యాలను పెంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో అనేక కంపెనీలు ఏఐ టూల్స్ ను ఉపయోగించుకుందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ సంస్థ కోపైలట్ ప్రోను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ధర, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.

కోపైలట్ ప్రో ఒక నెల ఉచిత ట్రయల్..

మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టూల్స్ పెయిడ్ వెర్షన్ కోపైలట్ ప్రో విడుదలైంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో భాగంగా అనేక ప్రత్యేకతలతో దీన్ని రూపొందించారు. మనదేశంతో పాటు ప్రపంచంలోని 222 దేశాల్లో విడుదలైంది. నెలకు రూ.2 వేలు చెల్లించి దీనిని ఉపయోగించుకోవచ్చు. దీని ఏఐ టూల్స్ ను ఉపయోగించి అనేక అద్భుతాలు చేయవచ్చు. పరిశీలించాలనుకునే వారు ఒక నెల ఉచిత ట్రయల్‌ తీసుకోవచ్చు. ఇది మైక్రోసాఫ్ట్ కోపైలట్ కు అడ్వాన్స్ వెర్షన్ గా భావించాలి.

లేటెస్ట్ వెర్షన్..

కోపైలట్ ప్రో అనేది మైక్రోసాఫ్ట్ అధునాతన వెర్షన్. ఈ కంపెనీ కొన్ని నెలల క్రితం బింగ్ ఏఐని తీసుకువచ్చింది. దాని ద్వారా వినియోగదారులకు ఏఐ సేవలను అందించింది. ఇప్పుడు కొత్తగా తీసుకువచ్చిన కోపైలట్ ప్రో మరిన్ని ప్రత్యేకతలను కలిగి ఉంది. కోపైలట్ సబ్‌స్క్రైబర్లు మైక్రోసాఫ్ట్ వెబ్ యాప్ ల నుంచి దీనిని పొందవచ్చు. వారు మైక్రోసాఫ్ట్ 365ను సబ్ స్క్రిప్షన్ చేసుకోవాల్సి అవసరం లేదు.

ఇవి కూడా చదవండి

ప్రత్యేకతలు..

కోపైలట్ ప్రో వెర్షన్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దీనిలోని ఏఐ టూల్స్ ను ఉపయోగించుకుని వ్యక్తిగతంగా, ఉద్యోగ పరంగా నైపుణ్యాలను పెంచుకోవచ్చు. అనేక అద్భుతమైన చిత్రాలను రూపొందించవచ్చు. వివిధ ఆర్టికల్స్ రాయవచ్చు. మన రైటింగ్ స్కిల్స్ ను మెరుగుపరుకోవచ్చు. ఇంకా అనేక రకాలుగా మనకు కోపైలట్ ప్రో వెర్షన్ ఉపయోగపడుతుంది. దేశంలోని వినియోగదారులకు మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్రో ధరను నెలకు రూ. 2 వేలుగా నిర్ణయించారు. ఆసక్తి కలవారు డబ్బులు చెల్లించి సభ్యత్వం పొందవచ్చు. ముందుగా ఒక నెల ఉచితం ట్రయల్ అవకాశం కూడా ఉంది.

సబ్‌స్క్రిప్షన్ చేసుకునే విధానం..

  • ముందుగా మైక్రోసాఫ్ట్ స్టోర్ కోపైలట్ ప్రో పేజీకి వెళ్లండి.
  • మీ మైక్రోసాఫ్ట్ ఖాతాకు లాగిన్ అవ్వండి.
  • కో పైలట్ ప్రో పేజీలోకి వెళ్లి.. గెట్ కోపైలట్ పై క్లిక్ చేయండి.
  • క్రెడిట్ కార్డు, యూపీఐ తదితర మీ చెల్లింపు పద్ధతిని ఎంచుకోండి.
  • అనంతరం క్లిక్ చేయండి, చెల్లింపు ప్రాసెస్ చేసిన తర్వాత స్టార్ట్ పై క్లిక్ చేయండి.
  • మీ కోపైలట్ ప్రో సభ్యత్వం యాక్టివేట్ అవుతుంది.

అనేక ప్రయోజనాలు..

  • మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్రో వెర్షన్ ను ఉపయోగించి వినియోగదారులు లేటెస్ట్ ఏఐ టూల్స్ ద్వారా సరికొత్తగా చిత్రాలను రూపొందించవచ్చు. వ్యక్తిగతంగా,వృత్తిపరంగా పనిలో మరింత సామర్థ్యం పెంచుకోవచ్చు.
  • పీసీ, మ్యాక్, ఐప్యాడ్ లలో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, అవుట్ లుక్, వన్ నోట్ తదితర వాటికన్నింటికీ కోపైలట్ యాక్సెస్ ఉంది. వీటన్నింటిలోనూ ఏఐ టూల్స్ ను ఉపయోగించి నైపుణ్యాలను పెంచుకోవచ్చు. కోపైలట్ ప్రో, మైక్రోసాఫ్ట్ 365 సబ్ స్క్రైబర్లకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
  • సబ్‌స్క్రైబర్లు తమ అవసరాలు, ఇష్టాలకు అనుగుణంగా కోపైలట్ జీపీటీలను రూపొందించడానికి మైక్రోసాఫ్ట్ కోపైలట్ జీపీటీ బిల్డర్ సాధనాన్ని వినియోగించుకోవచ్చు. కెరీర్ కౌన్సెలింగ్, స్కిల్ లెర్నింగ్ వంటి వివిధ పనులలో సహాయం చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
  • ఎడిటింగ్ సామర్థ్యాలను పెంచుకోవడానికి, మెరుగైన చిత్రాలను రూపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
  • కోపైలట్ ప్రో సామర్థ్యం తెలుసుకోవాలనుకునే వినియోగదారులు ఐ ఓఎస్ లేదా ఆండ్రాయిడ్ లో కోపైలట్ మొబైల్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని ఒక నెల ఉచితంగా ఉపయోగించవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..