Windows 11: విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను వాడుతున్నారా.? అయితే ఈ అప్‌డేట్ మీకోసమే..
Windows 11: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో విండోస్ ముందు వరుసలో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో కూడిన లేటెస్ట్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను విడుదల చేస్తుండే విండోస్ తాజాగా విండోస్...
Windows 11: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో విండోస్ ముందు వరుసలో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో కూడిన లేటెస్ట్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను విడుదల చేస్తుండే విండోస్ తాజాగా విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌తో విండోస్ ఎన్నో రకాల ఫీచర్లను తీసుకొచ్చింది. అయితే ఫీచర్లను ఉపయోగించుకోవాలంటే కచ్చితంగా మీరు ఉపయోగిస్తున్న కంప్యూటర్లలో ప్రత్యేక ఫీచర్లు ఉండాలి.
అయితే ఇప్పటి వరకు ఇలాంటి ఫీచర్లు అందుబాటులో లేని వారికి కూడా విండోస్ 11 సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే తాజాగా విండోస్ తమ యూజర్లను అలర్ట్ చేసింది. విండోస్ 11 ఉపయోగిస్తున్న యూజర్లకు ఒక అలర్ట్ మెసేజ్‌ను జారీ చేసింది మైక్రోసాఫ్ట్. కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు లేని కంప్యూటర్లకు.. ‘విండోస్ 11తో పనిచేసేందుకు మీ సిస్టమ్ రిక్వైర్‌మెంట్స్ సరిపోవు’ అనే అలర్ట్‌ను చూపిస్తోంది.
మరి విండోస్ 11 ఉపయోగించాలంటే కంప్యూటర్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండాలనేగా మీ సందేహం. ఇందుకోసమే మైక్రోసాఫ్ట్ ‘లెర్న్ మోర్’ అనే లింక్‌ను అందించనుంది. దీనిని క్లిక్ చేయగానే వివరాలు తెలుసుకునేలా మైక్రోసాఫ్ట్ ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉంటే విండోస్ 11కు అవసరమైన ఫీచర్లు లేకుండా ఓఎస్‌ను ఉపయోగిస్తుంటే భవిషత్యుత్తో మైక్రోసాఫ్ట్ విడుదల చేసే అప్‌డేట్స్ ఆ సిస్టమ్‌కు సపోర్ట్ చేయవని, యూజర్ల డేటాకు సైబర్ దాడుల నుంచి రక్షణ ఉండదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది.
Also Read: Covid 19 Endemic: కోవిడ్ 19 ఎండెమిక్‌గా మారిపోయింది.. కేసులు తగ్గినా.. పూర్తిగా కనుమరుగైనట్లు కాదు
IPL 2022: ఈ 4 కోట్ల ఆల్‌రౌండర్‌పై ధోని ఎన్నో ఆశలు.. టీమిండియాలో చోటు లభిస్తుందా..?