Micro Plastics: తాగునీటిలో మైక్రోప్లాస్టిక్స్ కలకలం.. పర్యావరణానికే కాదు.. మానవాళికీ నేరుగా చేటు చేస్తున్న వైనం..

తాగేనీరు కలుషితం అయిపోతోంది అని ఎన్నో సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు మొత్తుకుంటూనే ఉన్నారు. అయినా, మన ప్రవర్తనతోనే నీటిని మరింత విషపూరితంగా చేసేస్తున్నాము. తాజా పరిశోధనల్లో తాగునీటి కాలుష్యం గురించి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

Micro Plastics: తాగునీటిలో మైక్రోప్లాస్టిక్స్ కలకలం.. పర్యావరణానికే కాదు.. మానవాళికీ నేరుగా చేటు చేస్తున్న వైనం..
Micro Plastics
Follow us

|

Updated on: Dec 23, 2021 | 9:27 AM

Micro Plastics: తాగేనీరు కలుషితం అయిపోతోంది అని ఎన్నో సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు మొత్తుకుంటూనే ఉన్నారు. అయినా, మన ప్రవర్తనతోనే నీటిని మరింత విషపూరితంగా చేసేస్తున్నాము. తాజా పరిశోధనల్లో తాగునీటి కాలుష్యం గురించి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. జర్నల్ ఆఫ్ హజార్డస్ మెటీరియల్స్‌లో ఇటీవల ప్రచురించిన పరిశోధన ప్రకారం, పర్యావరణంలో ఉన్న మైక్రోప్లాస్టిక్‌లు మానవ కణాలకు చాలా హాని కలిగిస్తున్నాయి. మైక్రోప్లాస్టిక్‌లను ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు అలర్జీలు, థైరాయిడ్, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్లాస్టిక్ కణాలు నీరు, ఉప్పు.. సముద్రపు ఆహారంలో ఎక్కువగా కనిపిస్తాయి.

మైక్రోప్లాస్టిక్ అంటే ఏమిటి?

నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, 5 మిల్లీమీటర్ల కంటే చిన్న ప్లాస్టిక్ కణాలను మైక్రోప్లాస్టిక్స్ అంటారు. వాటి పరిమాణం నువ్వుల గింజతో సమానంగా లేదా చిన్నదిగా ఉంటుంది. దీనివల్ల నీటిలో తేలికగా ప్రవహిస్తాయి. శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం.. సూర్యుడు, గాలి లేదా ఇతర కారణాల వల్ల ప్లాస్టిక్ పెద్ద కణాలు కూడా మైక్రోప్లాస్టిక్‌లుగా రూపాంతరం చెందుతాయి. ఇవి మన రోజువారీ జీవితంలోని ఉత్పత్తుల ద్వారా మాత్రమే పర్యావరణంలోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అమెరికన్ ప్లాస్టిక్ ఓషన్ ఎన్జీవో చెబుతున్న దాని ప్రకారం, సగటున, ఒక వ్యక్తి ప్రతి వారం 1,769 మైక్రోప్లాస్టిక్ కణాలను కేవలం త్రాగునీటి నుంచి శరీరం లోపలకు తీసుకుంటున్నాడు. జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక అధ్యయనం ప్రకారం ప్రజలు ప్రతి సంవత్సరం 39,000 నుండి 52,000 మైక్రోప్లాస్టిక్ కణాలను తీసుకుంటారు.

మైక్రోప్లాస్టిక్స్ మూలాలు..

మేకప్, టూత్‌పేస్ట్ వంటి రోజువారీ ఉపయోగంలో ఉన్న వస్తువులు మైక్రోప్లాస్టిక్‌లకు మూలం. ఇవే కాకుండా సింథటిక్ ఫ్యాబ్రిక్స్‌లో కూడా ఈ ప్లాస్టిక్ కణాలు ఉంటాయి. వీటిలో నైలాన్, స్పాండెక్స్, అసిటేట్, పాలిస్టర్, యాక్రిలిక్, రేయాన్ మొదలైనవి ఉన్నాయి.

పరిశోధన ఏం చెబుతోంది

జర్నల్ ఆఫ్ హజార్డస్ మెటీరియల్స్‌లో ప్రచురించిన యూనివర్శిటీ ఆఫ్ హల్ పరిశోధన ప్రకారం.. పెద్ద మొత్తంలో మైక్రోప్లాస్టిక్‌లను తీసుకోవడం మన శరీరంలోని కణాలను దెబ్బతీస్తుంది, ఇది భవిష్యత్తులో అనేక ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. పరిశోధనలో, కణాలపై మైక్రోప్లాస్టిక్స్ ఈ 5 ప్రభావాలు చూపిస్తాయని స్పష్టం అయింది.

1. మైక్రోప్లాస్టిక్స్ వల్ల కణాలు చనిపోతాయి.

2. శరీరంలోని కణాల రోగనిరోధక ప్రతిస్పందన తగ్గింది.

3. మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోని కణాల గోడను విచ్ఛిన్నం చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి.

4. కణానికి కలిగే ఇతర నష్టాలు.

5. శరీర కణం జన్యు నిర్మాణంలో మార్పులు.

పరిశోధన తర్వాత, మైక్రోప్లాస్టిక్స్ కణాలపై మొదటి 4 ప్రభావాలను కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అలాగే, ప్రభావం ఎంత శక్తివంతమైనది అనేది మైక్రోప్లాస్టిక్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. సక్రమంగా ఆకారంలో ఉన్న ప్లాస్టిక్ కణాల వల్ల కణానికి ఎక్కువ నష్టం జరుగుతుంది. మరొక పరిశోధన ప్రకారం, కణాలు దెబ్బతినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో పాటు న్యూరోలాజికల్ డిజార్డర్స్, థైరాయిడ్, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది.

మైక్రోప్లాస్టిక్‌లు ఏ ఆహార పదార్థాల్లో కనిపిస్తాయి?

1. సముద్ర ఆహారం

రాయల్ మెల్‌బోర్న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైనాన్ యూనివర్శిటీ చేసిన పరిశోధన ప్రకారం, 12.5% చిన్న ప్లాస్టిక్ కణాలను చేపలు ఆహారంగా మింగేస్తాయి. తాబేళ్లు , ఇతర సముద్ర జీవులు కూడా దీని బారిన పడవు. ఇలాంటి కలుషితమైన సముద్రపు ఆహారాన్ని మానవులు తిన్నప్పుడు, వారు పరోక్షంగా మైక్రోప్లాస్టిక్‌లను వినియోగిస్తున్నారు.

2. ఉప్పు

సముద్రపు ఉప్పు, రాతి ఉప్పు, సరస్సు ఉప్పు, బావి ఉప్పు వంటి లవణాలు కూడా మైక్రోప్లాస్టిక్‌లను కలిగి ఉంటాయి. అయినప్పటికీ, వాటిలో ప్లాస్టిక్ కణాల పరిమాణం దాని మూలంపై ఆధారపడి ఉంటుంది.

3. నీరు

ట్యాప్, బాటిల్ వాటర్‌లో మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నాయని చాలా పరిశోధనలలో కనుగొన్నారు. మనం ఎంత కలుషిత నీరు తాగితే అంత మైక్రోప్లాస్టిక్ మన శరీరంలోకి చేరుతుంది.

ఇవి కూడా చదవండి: Pushpa: The Rise: హిందీలోనూ తగ్గేదే లే అంటున్న ‘పుష్ప’రాజ్.. భారీ వసూళ్లు దిశగా..

Viral Video: చలికాలం అవస్థలు.. కింద మంట పైన స్నానం.. వీడియో చూస్తే షాక్‌..

Viral Video: ఈ భారతీయుడి డ్యాన్స్‌ చూస్తే ప్రభుదేవా కూడా ఫిదా అవుతాడు..!

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో