AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp Safety Feature: వాట్సాప్‌లో కొత్త సేఫ్టీ ఫీచర్‌.. యూజర్స్‌కు ఇక ఆ తలనొప్పి తగ్గినట్టే!

కొన్ని సార్లు మన అనుమతి లేకుండానే కొందరు మనను ఏవేవో వాట్సాప్‌ గ్రూప్‌లలో యాడ్‌ చేస్తూ ఉంటారు. అలాంటి గ్రూప్‌లతో వచ్చే మెసేజ్‌లతో మనం విసిగిపోతూ ఉంటాం. అయితే ఇలా ఇబ్బంది పడేవారికి కోసమే మెటా కొత్త సేఫ్టీ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ అద్భుతమైన ఫీచర్‌తో మీరు ఇకపై మోసపూరిత గ్రూపుల నుంచి భద్రత పొందవచ్చు. ఎవరైనా మిమ్మల్ని గ్రూప్‌లలో యాడ్‌ చేయాలనుకుంటే.. అందుకు సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్‌ మీకు ముందే తెలియజేస్తుంది. అప్పుడు మీరు గ్రూప్‌లో చేరవద్దనుకుంటే దాన్ని రిజెక్ట్‌ చేయవచ్చు.

WhatsApp Safety Feature: వాట్సాప్‌లో కొత్త సేఫ్టీ ఫీచర్‌.. యూజర్స్‌కు ఇక ఆ తలనొప్పి తగ్గినట్టే!
Whatsapp
Anand T
|

Updated on: Aug 06, 2025 | 5:29 PM

Share

మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సాప్, తన వినియోగదారుల కోసం సేఫ్టీ ఓవర్‌వ్యూ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది వాట్సాప్‌ గ్రూప్‌ స్కామ్‌ల నుండి వినియోగదారులను రక్షించడం, గ్రూప్ గురించి వారికి కీలక సమాచారాన్ని అందించడం, ఫిషింగ్, ఇతర మెసేజింగ్ స్కామ్‌ల నుండి సురక్షితంగా ఉండటానికి రూపొందించబడింది. ఈ సేఫ్టీ ఓవర్‌ ఫీచర్‌ తెలియని గ్రూపుల సమాచారాన్ని, దానిపై పూర్తి నియంత్రణను వినియోగదారుడి చేతికే అందిస్తుంది. మీ కాంటాక్ట్స్‌లో లేని వ్యక్తి ఎవరైనా మిమ్మల్ని తమ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసినప్పుడు ఈ కొత్త యాంటీ-స్కామ్ టూల్ ఆటోమేటిక్‌గా ఎనేబుల్ అవుతుంది. వెంటనే ఆ గ్రూప్‌ పూర్తి వివరాలను మీకు పంపిస్తుంది. ఆ గ్రూప్‌ను ఎవరు క్రియేట్‌ చేశారు, మిమ్మల్ని ఎవరు యాడ్‌ చేశారు. అందులో ఎంతమంది సభ్యులున్నారు, ఎప్పుడు క్రియేట్ చేశారు. అనే అన్ని వివరాలు మీకు వస్తాయి. దాన్ని బట్టి మీరు అవసరమైతే అందులో జాయిన్ అవ్వవచ్చే లేదా రిజెక్ట్‌ చేయవచ్చు.

మెటా ప్రకారం వివరాలన్ని పరిశీలించిన తర్వాత గ్రూప్‌లో జాయిన్ అవ్వాల, లేదా అనేది పూర్తిగా మీ నిర్ణయానికే వదిలేస్తుంది. మీకు ఆ వాట్సాప్‌ గురించి తెలియకపోతే, ఆ గ్రూప్‌ మీకు సెక్యూర్‌గా అనిపించకపోతే గ్రూప్‌లోని సందేశాలను పరిశీలించకుండానే మీరు గ్రూప్ నుండి ఎగ్జిట్‌ కావచ్చు. అలా కాదని మీరు గ్రూప్‌లో కొనసాగాలనుకుంటే, చెక్‌మార్క్‌ అనే ఆపక్షన్‌ను క్లిక్ చేస్తే.. మీరు నిర్ణయం తీసుకునే వరకు ఆ గ్రూప్ నుంచి మీకు నోటిఫికేషన్లు రాకుండా మ్యూట్‌లో ఉంటాయి. స్టాక్‌ మార్కెట్స్‌, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ వంటి గ్రూప్‌ మోసాల నుంచి వినియోగదారులను రక్షించాలనే ఉద్దేశంలో వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది.

గుర్తుతెలియని వ్యక్తులు మీతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే.. వాళ్లను అడ్డుకొని, ప్రశ్నించి, వారి గురించి తెలుసుకోవాలని వాట్సాప్‌ తమ వినియోగదారులకు స్పష్టంగా చెబుతోంది.

పాజ్: తెలియని వ్యక్తుల మెసేజ్‌లకు రిప్లే ఇచ్చే ముందు వినియోగదారులు కాస్త సమయం తీసుకొని ఆలోచించాలని వాట్సాఫ్‌ చెబుతోంది.

ప్రశ్న: గుర్తుతెలియని వ్యక్తి చేసిన మెసేజ్‌ ప్రయోజనకరమైనదా కాదా అని పరిశీలించుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని డబ్బు, బహుమతి కార్డులు, మీ ATM పిన్ పంపమని అడిగితే లేదా ఫేక్‌ ఆఫర్స్‌ను మీకు రెఫర్ చేసినా, తక్కువ పనికి ఎక్కువ జీతం లాంటి మేజెజ్‌లు వచ్చినా యూజర్స్‌ జాగ్రత్తగా ఉండాలని వాట్సాప్ చెబుతోంది.

ధృవీకరించండి: మీకు మెసేజ్ చేసి వ్యక్తి మీ ఫ్రెండ్‌, లేదా ఫ్యామిలీ మెంబర్‌ అని చెప్పుకుంటే, వినియోగదారులు వారిని నేరుగా సంప్రదించాలని వాట్సాప్ సిఫార్సు చేస్తుంది. అయితే వారిని వాట్సాప్‌లో కాకుండా మరేదైనా కమ్యూనికేషన్‌ను ఉపయోగించడం మంచిదని వాట్సాప్‌ చెబుతోంది.

మరిన్ని టెక్‌వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.