WhatsApp: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. ఇకనుంచి తప్పులు సరిచేసుకునేలా అందుబాటులోకి ఎడిట్ ఆప్షన్
వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్ వచ్చేసింది. ఇతరులకు పంపే మెసెజ్‌లలో ఏమైన తప్పులు సరిచేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్‌ను అంగుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు మెసెజ్ పంపేటప్పుడు అక్షర దోషాలు తప్పుగా టైప్ చేయడం వల్ల ఆ మెసేజ్ అర్థం మారిపోయేది.

వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్ వచ్చేసింది. ఇతరులకు పంపే మెసెజ్‌లలో ఏమైన తప్పులు సరిచేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్‌ను అంగుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు మెసెజ్ పంపేటప్పుడు అక్షర దోషాలు తప్పుగా టైప్ చేయడం వల్ల ఆ మెసేజ్ అర్థం మారిపోయేది. దీంతో దాన్ని డిలీట్ చేయడం తప్ప మరో దారి ఉండేది కాదు. అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఫెస్‌బుక్‌లో వెల్లడించారు. ప్రస్తుతం కొంతమంది యూజర్లకు మాత్రమే ఈ ఎడిట్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ వారంలో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ తెలిపింది.
అయితే ఈ ఎడిట్ ఆప్షన్ ఎలా పనిచేస్తుందంటే సాధారణంగా వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్ పంపుతాము. దాన్ని సెలెక్ట్ చేస్తే copy, forward వంటి ఆప్షన్లు కన్పిస్తాయి. ఇక నుంచి వాటితోపాటు ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పంపిన మెసేజ్‌లో తప్పులు, అక్షర దోషాలను సరిచేసుకోవచ్చు. అయితే మెసేజ్ పంపిన 15 నిమిషాలలోపు ఎడిట్ ఎన్నిసార్లయినా ఎడిట్ చేసుకోవచ్చని జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు. అయితే ఇంకెందుకు ఆలస్యం మీ వాట్సప్‌ను ప్లెస్టోర్‌లో అప్‌డెట్ చేసుకొని ఈ ఎడిట్ సదుపాయాన్ని పొందండి.




మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..