AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar: మీకు తెలియకుండా మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులున్నాయో తెలుసా? ఇలా చేస్తే వెంటనే బ్లాక్ చేయొచ్చు.

ఒక ఆధార్‌పై ఎన్ని సిమ్‌ కార్డులు తీసుకోవచ్చు. అసలు అలాంటి పరిమితి ఏదైనా ఉందా? ప్రభుత్వ నిబంధనలు ఏం చెబుతున్నాయి? మీ ఆధార్‌ నంబర్‌తో ఎవరైనా దొంగతనంగా సిమ్‌ వినియోగిస్తే? అప్పుడు ఏం చేయాలి? తెలుసుకుందాం రండి..

Aadhaar: మీకు తెలియకుండా మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులున్నాయో తెలుసా? ఇలా చేస్తే వెంటనే బ్లాక్ చేయొచ్చు.
Aadhaar Card
Madhu
|

Updated on: May 23, 2023 | 6:00 AM

Share

ఆధార్‌ కార్డు ప్రతి భారతీయ పౌరుడికి ఒక ఐడెంటిటి. అది లేకపోతే మన దేశంలో మనుగడ సాధించడం కష్టం. అన్నింటికీ ఆధారే ఆధారం. బ్యాంకు ఖాతా తెరవాలన్నా.. కేవైసీ పూర్తి చేయాలన్నా, రేషన్‌ కార్డు కావాలన్నా, డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందేందుకు, లేదా ఏదైనా ప్రభుత్వ పథకం స్వీకరించడానికి ఇలా ఏదైనా ఆధార్‌ కార్డు ఉండాల్సిందే. అలాగే మీరూ రోజూ వినియోగించే సిమ్‌ కార్డుకు ఆధార్‌ ఉండాల్సిందే. ప్రూఫ్‌ కింద ఆధార్‌ చూపిస్తేనే సిమ్‌ కార్డు మంజూరవుతుంది. అయితే ఒక ఆధార్‌పై ఎన్ని సిమ్‌ కార్డులు తీసుకోవచ్చు. అసలు అలాంటి పరిమితి ఏదైనా ఉందా? ప్రభుత్వ నిబంధనలు ఏం చెబుతున్నాయి? మీ ఆధార్‌ నంబర్‌తో ఎవరైనా దొంగతనంగా సిమ్‌ వినియోగిస్తే? అప్పుడు ఏం చేయాలి? తెలుసుకుందాం రండి..

ఒక ఆధార్‌ కార్డుపై తొమ్మిది సిమ్‌ కార్డులు..

ఒక ఆధార్‌ నంబర్‌ మీద ఎన్ని సిమ్‌ కార్డులు తీసుకోవచ్చు అనే అంశంలో చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అయితే టెలికాం డిపార్ట్‌మెంట్ విధించిన నిబంధనల ప్రకారం ఒక ఆధార్‌ నంబర్‌పై మొత్తం తొమ్మిది సిమ్‌లను తీసుకోవచ్చు. అయితే అవన్నీ ఒకే ఆపరేటర్‌ నుంచే తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అందువల్ల ఒకే ఆధార్‌ నంబర్‌ పై అనేక సిమ్‌ కార్డులు తీసుకొంటూ ఉంటారు. సాధారణంగా ఉమ్మడి కుటుంబాలలో ఒకే వ్యక్తి ఆధార్‌ మీద అందరికీ సిమ్‌ లు తీసుకొని వివిధ వ్యక్తులు వినియోగిస్తుంటారు.

దుర్వినియోగం చేయొచ్చు..

అయితే ఇలా ఒకే ఆధార్‌ నంబర్‌ పై పలు రకాల సిమ్‌ లు తీసుకొనే వీలుండటంతో ఆ సిమ్‌ కార్డులు దుర్వినియోగం చెందే అవకాశం కూడా ఉంటుంది. ఆ సిమ్‌ కార్డు ద్వారా అవాంఛనీయ చర్యలకు పాల్పడే అవకాశమూ ఉంది. అటువంటి సమయంలో ఏం చేయాలి? దానికి కూడా ప్రభుత్వం ఓ పరిష్కారాన్ని అందిస్తోంది. ఎవరైనా అనధికార వ్యక్తి మీ ఆధార్‌తో లింక్ చేయబడిన సిమ్‌ కార్డ్‌ని ఉపయోగిస్తున్నారా అని మీరు తెలుసుకొనే వీలుంది. అంతేకాక ఆ నంబర్‌ ను శాశ్వతంగా బ్లాక్‌ చేసే అవకాశం కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

ప్రత్యేకమైన పోర్టల్‌..

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) దీని కోసం కొత్త వెబ్‌పేజీని తీసుకొచ్చింది. tafcop.dgtelecom.gov.in పోర్టల్‌ను ప్రారంభించింది. ఎవరైనా తమ ఆధార్ కార్డు ద్వారా ఎన్ని సిమ్ కార్డులు వాడుకలో ఉన్నాయో చూసేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. అదనంగా, మీరు అనధికార సిమ్‌ని బ్లాక్‌ కూడా చేయవచ్చు. మీరు ఇకపై ఉపయోగించకూడదనుకునే మీ లేదా మీ కుటుంబ సభ్యుల యొక్క ఏదైనా సిమ్‌ని కూడా మీరు బ్లాక్ చేయవచ్చు.

  • ముందుగా, మీరు https://tafcop.dgtelecom.gov.in/ లోకి వెళ్లాలి.
  • దీని తర్వాత, మీరు వెబ్‌సైట్‌లో ఇచ్చిన కాలమ్‌లో ఆధార్‌తో లింక్‌ అయ్యి ఉన్న మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
  • ఇప్పుడు, మొబైల్ నంబర్‌పై ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీని నమోదు చేసిన తర్వాత, మీరు ‘యాక్షన్’ బటన్‌పై క్లిక్ చేయాలి.
  • ఈ బటన్‌ని క్లిక్ చేయడం ద్వారా, మీ ఆధార్ కార్డ్‌కి లింక్ చేయబడిన అన్ని నంబర్‌లు మీ ముందు కనిపిస్తాయి.
  • ఏదైనా నంబర్‌ని బ్లాక్ చేసే ఆప్షన్‌లు కూడా కనిపిస్తాయి.
  • దానిని బట్టి మీరు ఆప్షన్‌ ఎంపిక చేసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us