AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lava Agni 3: లావా అరాచకం.. సెకండరీ డిస్‌ప్లేతో అదిరే ఫోన్‌.. బడ్జెట్‌ ధరలోనే

భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ తయారీ సంస్థ లావా తక్కువ బడ్జెట్‌లో అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు లావా తీసుకొచ్చిన ఫోన్లన్నీ ఇలా తక్కువ బడ్జెట్‌లో తీసుకొచ్చినవే. అయితే తాజాగా ఇదే క్రమంలో లావా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. సెకండరీ డిస్‌ప్లేతో కూడిన అధునాతన...

Lava Agni 3: లావా అరాచకం.. సెకండరీ డిస్‌ప్లేతో అదిరే ఫోన్‌.. బడ్జెట్‌ ధరలోనే
Lava Agni 3
Narender Vaitla
|

Updated on: Oct 04, 2024 | 4:00 PM

Share

భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ తయారీ సంస్థ లావా తక్కువ బడ్జెట్‌లో అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు లావా తీసుకొచ్చిన ఫోన్లన్నీ ఇలా తక్కువ బడ్జెట్‌లో తీసుకొచ్చినవే. అయితే తాజాగా ఇదే క్రమంలో లావా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. సెకండరీ డిస్‌ప్లేతో కూడిన అధునాతన ఫీచర్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. లావా అగ్ని 3 పేరుతో ఈ కొత్త 5జీ ఫోన్‌ను శుక్రవారం లాంచ్‌ చేసింది.

లావా అగ్నీ 3 స్మార్ట్‌ ఫోన్‌ను మొత్తం మూడు వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. వీటి ధర విషయానికొస్తే.. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 20,999కాగా, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 22,999 అలాగే 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధరను రూ. 24,999గా నిర్ణయించారు. లావా ఈ ఫోన్‌ను రెండు కలర్స్‌లో తీసుకొచ్చింది. వైటతో పాటు బ్లూ కలర్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

లాంచింగ్‌ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్స్‌ అన్ని వేరియంట్స్‌పై రూ. 2 వేలు డిస్కౌంట్స్‌ అందిస్తున్నారు. అలాగే ఛార్జర్‌ వద్దనుకుంటే.. మరో వెయ్యి రూపాయల డిస్కౌంట్స్‌ లభిస్తుంది. ప్రస్తుతం ప్రీ బుకింగ్స్‌ ప్రారంభమైన ఈ ఫోన్‌ ఫస్ట్ సేల్‌ ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఇక అగ్ని 2 ఫోన్‌ ఎక్స్ఛేంజ్‌పై రూ. 8 వేల, అగ్ని 1 ఫోన్‌ ఎక్స్ఛేంజ్‌పై రూ. 4 వేల డిస్కౌంట్‌ పొందొచ్చు.

ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు డిస్‌ప్లేలను అందించారు. 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ మెయిన్‌ డిస్‌ప్లేను అందించార. అలాగే వెనకాల కెమెరా సెటప్‌ పక్కన 1.74 ఇంచెస్‌తో కూడిన సెకండరీ డిస్‌ప్లేను ఇచ్చారు. సెకండరీ డిస్‌ప్లేలో మ్యూజిక్‌, స్టాప్‌వాచ్‌, అలారమ్‌ క్లాక్‌ వంటి ఆప్షన్స్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు. అంతేకాదు కాల్స్‌ లిఫ్ట్‌ చేయడంతో పాటు సెల్ఫీలు కూడా తీసుకోవవచ్చు. ఇక మెయిన్‌ డిస్‌ప్లేను 120Hz కర్వ్‌డ్‌ డిస్‌ప్లేతో తీసుకొస్తున్నారు.

ఈ స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. రెండేళ్లపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌ ఉచితంగా పొందొచచు. ఇక కెమెరా వియానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌, 8 ఎంపీ అల్ట్రావైడ్‌ కెమెరా, 8 ఎంపీ టెలిఫొటో లెన్స్‌తో కూడిన రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 66 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆ డైరెక్టర్ వల్లే నేను హ్యాండ్సమ్ విలన్ అయ్యా..
ఆ డైరెక్టర్ వల్లే నేను హ్యాండ్సమ్ విలన్ అయ్యా..
మీ పిల్లల జీవితాన్ని మార్చే 20 సెకన్ల మ్యాజిక్! ఈ పేరెంటింగ్ రూల్
మీ పిల్లల జీవితాన్ని మార్చే 20 సెకన్ల మ్యాజిక్! ఈ పేరెంటింగ్ రూల్
జ్యూస్ సెంటర్‌లో గొడవ.. గరిటతో యువకుడిపై దాడి.. ఆ తర్వాత ..
జ్యూస్ సెంటర్‌లో గొడవ.. గరిటతో యువకుడిపై దాడి.. ఆ తర్వాత ..
ఆధార్ కార్డులోని పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..
ఆధార్ కార్డులోని పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..
ప్లాప్ ప్రొడ్యూసర్ అనే ముద్ర తుడిచేసిన సినిమా అదే..
ప్లాప్ ప్రొడ్యూసర్ అనే ముద్ర తుడిచేసిన సినిమా అదే..
ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను..
ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను..
ప్రతిరోజూ రెండు కివీ పండ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
ప్రతిరోజూ రెండు కివీ పండ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
ఎండల్లో బెస్ట్ హెల్తీ డ్రింక్… బార్లీ నీళ్లు ఇలా చేస్తే టేస్ట్..
ఎండల్లో బెస్ట్ హెల్తీ డ్రింక్… బార్లీ నీళ్లు ఇలా చేస్తే టేస్ట్..
అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను..
అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను..
దంపుడు బియ్యం, సొరకాయ బూరలో నీళ్లు.. ఆదివాసీల ఆరోగ్య రహస్యం ఇదే
దంపుడు బియ్యం, సొరకాయ బూరలో నీళ్లు.. ఆదివాసీల ఆరోగ్య రహస్యం ఇదే