Smart TV: రూ. 26 వేలకే 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. ఫీచర్స్ తెలిస్తే వెంటనే కొనేస్తారు..
ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌తో పాటు, టీవీలపై కూడా భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే కొడాక్ కంపెనీపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. కొడాక్ సీఏ సిరీస్ టీవీపై కళ్లు చెదిరేలా తగ్గింపు ధర ప్రకటించింది. ఇంతకీ టీవీపై ఎలాంటి ఆఫర్ లభిస్తోంది.? ఫీచర్లు ఎలా ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పండుగ సీజన్‌ను టార్గెట్ చేసుకొని తీసుకొచ్చిన ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు గృహోపకరణాల వరకు భారీ ఆఫర్లను ప్రకటిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటించారు.
ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌తో పాటు, టీవీలపై కూడా భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే కొడాక్ కంపెనీపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. కొడాక్ సీఏ సిరీస్ టీవీపై కళ్లు చెదిరేలా తగ్గింపు ధర ప్రకటించింది. ఇంతకీ టీవీపై ఎలాంటి ఆఫర్ లభిస్తోంది.? ఫీచర్లు ఎలా ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా 55 ఇంచెస్ టీవీ కొనుగోలు చేయాలంటే తక్కువలో తక్కువగా రూ. 50 వేలు పెట్టాల్సిందే. అయితే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ ఆఫర్ లభిస్తోంది. కొడాక్ సీఏ సిరీస్ 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 47,999కాగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా ఏకంగా 41 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ టీవీని కేవలం రూ. 27,999కి సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. అదే విధంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 1000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఈ లెక్కన ఈ టీవీని రూ. 26 వేలకే సొంతం చేసుకోవచ్చు.
ధర తక్కువ అని ఫీచర్ల విషయంలో రాజీ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ టీవీలో కళ్లు చెదిరే ఫీచర్లు ఉన్నాయి. కొడాక్ స్మార్ట్ టీవీలో 3840 x 2160 పిక్సెల్స్‌తో కూడిన అల్ట్రా హెచ్‌డీ 4కే రిజల్యూషన్ స్క్రీన్‌ను అందించారు. 55 ఇంచెస్‌తో కూడిన ఈ స్క్రీన్‌కు 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను ఇచ్చారు. ఇక ఈ ఈవీ నెట్‌ఫ్లెక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ టీవీ పనిచేస్తుంది. ఇక ఈ టీవీలో మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కంపెనిసేషన్ వంటి టెక్నాలజీలను అందించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..