ఇకపై వారి సిమ్ కార్డులు కట్..!
TV9 Telugu
30 December
2024
నకిలీ కాల్స్, SMSలను అరికట్టడానికి, TRAI, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) కఠినమైన నిబంధనలను అమలు చేశాయి.
దీని కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్షలాది నకిలీ మొబైల్ నంబర్‌లు ప్రభుత్వం బ్లాక్ చేయడం జరిగింది.
టెలికమ్యూనికేషన్స్ విభాగం భవిష్యత్తులో SIM కార్డులు జారీ చేయడానికి వినియోగదారుల జాబితాను తయారు చేయడం ప్రారంభించింది.
సైబర్ నేరాలకు పాల్పడే వారిని సైబర్ భద్రతకు ముప్పుగా పరిగణిస్తూ వారిని TRAI అధికారులు ప్రత్యేక కేటగిరీలో ఉంచుతారు.
6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న వినియోగదారుల పేరుతో కొత్త సిమ్ కార్డ్‌లు జారీ చేయడం జరగదు.
ఇతరుల పేరుతో సిమ్ కార్డులు జారీ చేయడం, నకిలీ సందేశాలు పంపడం ఇప్పుడు శిక్షార్హమైన నేరాల కిందకు వస్తుంది.
2025 నుండి, బ్లాక్‌లిస్ట్ చేసిన వినియోగదారుల జాబితా అన్ని టెలికాం ఆపరేటర్‌లతో భాగస్వామ్యం చేయనుంది. తద్వారా వారి పేరు మీద కొత్త SIM ఇవ్వడం కుదరదు.
అటువంటి వినియోగదారులకు 7 రోజుల్లోగా ప్రత్యుత్తరం ఇవ్వమని నోటీసు పంపడం జరుగుతుంది. సమాధానం ఇవ్వకుంటే కఠిన చర్యలు తప్పవు.
ప్రజా ప్రయోజనాల విషయంలో నోటీసు ఇవ్వకుండా కూడా ప్రభుత్వం సిమ్ కార్డులను బ్లాక్ చేసి బ్లాక్ లిస్ట్ చేయవచ్చు.
సైబర్ భద్రతకు సంబంధించిన నియమాలు నవంబర్‌లో తెలియజేసింది కేంద్రం. సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తెలుగు రాష్ట్రాల్లో దొరికే ఈ డ్రింక్స్ ఒక్కసారైన టేస్ట్ చెయ్యాలి..
విశాఖ చరిత్రలో విలసిల్లిన మహారాజులు వీరే..
దెయ్యాల విక్రయించే నగరం గురించి విన్నారా.?