శామ్సంగ్ గెలాక్సీ ఎం35.. ఈ ఫోన్ ధర రూ. 14,999గా ఉంది. ఇది 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ తో వస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడితే దీనిని కేవలం రూ. 13,749కే కొనుగోలు చేయొచ్చు. ఇది 6.6 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ ప్లేతో వస్తుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ ను కలిగి ఉంటుంది. శామ్సంగ్ సొంత ఎక్సినోస్ 1380చిప్ సెట్ ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ 2ఎంపీ మాక్రో కెమెరాలు ఉంటాయి.