- Telugu News Photo Gallery Technology photos Whatsapp soon introducing new features with this feature users can use filters while doing video calls
WhatsApp: వాట్సాప్ యూజర్లు ఎగిరి గంతెయ్యాల్సిందే.. అదిరిపోయే కొత్త ఫీచర్
ప్రతీ ఒక్క స్మార్ట్ ఫోన్‌లో కచ్చితంగా ఉండే యాప్స్‌లో వాట్సాప్ ఒకటిన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అధునాతన ఫీచర్లతో ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకుంటోంది కాబట్టే వాట్సాప్‌కు అంతటి క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇంతకీ ఏంటా కొత్త ఫీచర్.? అందులో ఉన్నప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Oct 04, 2024 | 9:24 PM

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారు ఫిల్టర్స్‌ను ఎక్కువగా వాడుతున్నారు. సాధారణంగా ఫిల్టర్స్‌ను ఫొటోలను అందంగా దిగేందుకు ఉపయోగిస్తుంటాం. రకరకాల ఫ్రేమ్స్, కలర్ షేడ్స్‌తో ఫొటోలను దిగేందుకు ఈ ఫిల్టర్స్ ఉపయోగపడుతాయి.

అయితే వాట్సాప్ తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్ సహయంతో సహాయంతో వీడియో కాల్స్‌లో కూడా ఫిల్లర్స్‌ను ఉపయోగించే అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం కొత్త కెమెరా ఫిల్టర్‌లు, బ్యాక్‌గ్రౌండ్ వంటి కొత్త ఆప్షన్‌లను తీసుకొచ్చింది

దీంతో యూజర్లు తమ బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చుకోవడంతో పాటు వీడియో కాల్ సమయంలో ఫిల్టర్‌ని యాడ్ చేసుకోవచ్చు. వీడియో కాల్స్ కోసం ఫిల్టర్ ఎఫెక్ట్ కోసం వార్మ్, కూల్, బ్లాక్ అండ్ వైట్, డ్రీమీ వంటి మొత్తం 10 రకాల ఫిల్లర్‌లు అందుబాటులో ఉన్నాయి.

దీంతో మీరు అవతలి వ్యక్తితో వీడియోకాల్స్ మాట్లాడే సమయంలో మీకు నచ్చిన మూడ్‌ని ఫిల్టర్‌లను సెలక్ట్ చేసుకోవచ్చు. వీడియో కాల్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ క్రియేట్ చేసేందుకు ఈ ఫీచర్ అద్భుతంగా పని చేస్తుంది.

వీడియో కాల్ మాట్లాడుతోన్న సమయంలో బ్యాగ్రౌండ్‌ను కూడా మార్చుకోవచ్చు. మీరున్న చోటుతో సంబంధం లేకుండా సరికొత్త లొకేషన్‌ను యాడ్ చేసుకోవచ్చు. బ్లర్ ఎఫెక్ట్ ద్వారా మీ వెనకాల ఉన్న వస్తువులు కనిపించకుండా చేసుకోవచ్చు. టచ్ అప్ ఫీచర్‌తో మీ రూపాన్ని మరింత అట్రాక్టివ్‌గా మార్చుకోవచ్చు.




