- Telugu News Photo Gallery Technology photos Flipkart big billion days huge discount on Samsung Galaxy S23 FE, check here for full details
Flipkart: ఇలాంటి ఆఫర్ ఎప్పుడూ చూసి ఉండరు.. ఏకంగా రూ. 70 వేల డిస్కౌంట్..
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు అన్ని రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్స్ అందిస్తున్నారు. కొన్ని రకాల స్మార్ట్ ఫోన్స్‌పై అయితే ఊహకందని డీల్స్ లభిస్తున్నాయి. అలాంటి ఒక బెస్ట్ డీల్ గురించి ఈరోజు తెలుసుకుందాం..
Updated on: Oct 05, 2024 | 8:00 AM

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా సామ్‌సంగ్ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్23 ఎఫ్‌ఈ స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా రూ. 70 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుండడం విశేషం. ఇంతకీ ఈ ఆఫర్‌ను ఎలా సొంతం చేసుకోవాలి.? ఫీచర్లు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్23 ఎఫ్‌ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 79,999కాగా సేల్‌లో భాగంగా ఏకంగా 62 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 29,999కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

అంటే అదనంగా మరో రూ. 1500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే డిస్కౌంట్ ఇక్కడితో ఆగలేదు. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ కేసుకోవడం ద్వారా కూడా డిస్కౌంట్ పొందొచ్చు. ఓల్డ్ ఫోన్ కండిషన్ ఆధారంగా రూ. 19,800 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 10 వేలకే సొంతం చేసుకోవచ్చన్నమాట.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీషర్ల విషయానికొస్తే. ఇందులో 6.4 ఇంచెస్‌తో కూడి ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇంచ్చారు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్ సామ్‌సంగ్ ఎక్సోనోస్ 2200 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్, 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. కాగా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 10 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.




