Jio Data Plans: జియో నుంచి సరికొత్త డేటా బూస్టర్ ప్లాన్స్.. రూ.19కే 1.5 జీబీ, రూ.29కే 2.5 జీబీ డేటా
రోజువారీ డేటా ప్లాన్ ఒక్కోసారి అయిపోతూ ఉంటుంది. ఇలాంటి వారి కోసం బూస్టర్ డేటా ప్లాన్‌లను జియో అందుబాటులోకి తెచ్చింది. అయితే వీటి ధర కాస్త ఎక్కువగా ఉండడంతో ఈ ప్లాన్‌లు పెద్దగా కస్టమర్లను ఆకట్టుకోలేదు. కానీ క్రమేపి డేటా వినియోగం పెరగడంతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు తక్కవ ధరలోనే డేటా బూస్టర్ ప్లాన్ రీలాంచ్ చేసింది.
జియో వినియోగదారుల కోసం సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తూ ఉంటుంది. జియో టాప్-అప్‌లు, వాల్యూ ప్లాన్‌లు, వార్షిక ప్లాన్‌లు, డేటా ప్యాక్‌లు, రోజువారీ పరిమితి ప్లాన్‌లు, ఇలా మరెన్నో మీ అన్ని అవసరాలకు చౌకైన ప్లాన్‌లను అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా టెలికాం రంగంలో జియో రాకతో డేటా ప్లాన్స్ సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయని అందరికీ తెలిసిన సత్యం. అయితే రోజువారీ డేటా ప్లాన్ ఒక్కోసారి అయిపోతూ ఉంటుంది. ఇలాంటి వారి కోసం బూస్టర్ డేటా ప్లాన్‌లను జియో అందుబాటులోకి తెచ్చింది. అయితే వీటి ధర కాస్త ఎక్కువగా ఉండడంతో ఈ ప్లాన్‌లు పెద్దగా కస్టమర్లను ఆకట్టుకోలేదు. కానీ క్రమేపి డేటా వినియోగం పెరగడంతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు తక్కవ ధరలోనే డేటా బూస్టర్ ప్లాన్ రీలాంచ్ చేసింది. రూ.19 నుంచే ఈ బూస్టర్ ప్లాన్‌లు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి జియో తక్కువ ధరకే అందించే బూస్టర్ ప్లాన్‌లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
జియో బూస్టర్ ప్లాన్స్ వివరాలివే
జియో రూ. 19, రూ. 29కి రెండు కొత్త డేటా బూస్టర్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఇవి వినియోగదారులకు 1.5 జీబీ, 2.5 జీబీ హై-స్పీడ్ 4జీ డేటాను అందిస్తాయి. వినియోగదారుడు పేర్కొన్న డేటా పరిమితిని పూర్తి చేసిన తర్వాత వారు 64 కేబీపీఎస్ వేగంతో అపరిమిత డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ కొత్త ప్లాన్స్‌తో జియో ఇప్పుడు కస్టమర్లు ఎంచుకోవడానికి ఏడు డేటా బూస్టర్ ప్యాక్‌లను కలిగి ఉంది. చౌకైన జియో డేటా బూస్టర్ ప్లాన్ ధర రూ. 15 ఇది 1 జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. అత్యంత ఖరీదైన జియో 4జీ డేటా బూస్టర్ ప్లాన్ విషయానికొస్తే దీని ధర రూ. 222, ఈ ప్లాన్ ద్వారా 50 జీబీ హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్స్ డేటా బూస్టర్ ప్లాన్‌లు కాబట్టి వినియోగదారులు హై-స్పీడ్ డేటా కనెక్టివిటీతో పాటు మరే ఇతర ప్రయోజనాలను పొందలేరు. ఈ ప్లాన్‌ల చెల్లుబాటు కూడా మీ యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్‌కు అనుగుణంగా ఉంటుంది. అంటే మీ ప్రస్తుత ప్లాన్‌లో మీకు 46 రోజులు మిగిలి ఉన్నాయని అనుకుందాం, ఆపై మీ డేటా బూస్టర్ ప్లాన్ కూడా అదే వ్యవధికి చెల్లుబాటు అవుతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..