AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

pTron Smartwatch: రూ. 2000లకే స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్.. సూపర్ ఫీచర్లు.. స్టన్నింగ్ సౌండ్ క్లారిటీ.. పూర్తి వివరాలు ఇవి..

ప్రీమియం మోడల్లో పీట్రాన్ ఏస్ స్మార్ట్ వాచ్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. దీంతో పాటు జెన్ బడ్స్ ఈవో ట్రూ వైర్ లెస్ ఇయర్ బడ్స్ ను కూడా కంపెనీ విడుదల చేసింది. ఈ రెండు కూడా ప్రీమియం ఫీచర్లతో పాటు అనువైన ధరలోనే అందుబాటులో ఉన్నాయి.

pTron Smartwatch: రూ. 2000లకే స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్.. సూపర్ ఫీచర్లు.. స్టన్నింగ్ సౌండ్ క్లారిటీ.. పూర్తి వివరాలు ఇవి..
Ptron Smartwacth And Earbuds
Madhu
|

Updated on: Jul 11, 2023 | 5:30 PM

Share

సమాజం స్మార్ట్ అడుగులు వేస్తోంది. మనిషికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అనంత సౌఖ్యాన్ని అందిస్తున్నాయి. అందివస్తున్న సాంకేతికతతో సర్వం మనిషి చేతిలో నిక్షిప్తం అయిపోతోంది. ఇటీవల కాలంలో స్మార్ట్ వాచ్ ల వినియోగం కూడా బాగా పెరిగింది. అందరూ తమ చేతికి స్మార్ట్ వాచ్ ఉండాలని కోరుకుంటున్నారు.  మీరు కూడా కొత్త స్మార్ట్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. ప్రీమియం మోడల్లో పీట్రాన్ ఏస్ స్మార్ట్ వాచ్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. దీంతో పాటు జెన్ బడ్స్ ఈవో ట్రూ వైర్ లెస్ ఇయర్ బడ్స్ ను కూడా కంపెనీ విడుదల చేసింది. ఈ రెండు కూడా ప్రీమియం ఫీచర్లతో పాటు అనువైన ధరలోనే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్ గురించిన స్పెసిఫికేషన్లు, పీచర్లు, ధర, లభ్యత వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

పీట్రాన్ స్మార్ట్ వాచ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

ఈ స్మార్ట్ వాచ్ లో 1.85 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. ప్రత్యేకంగా బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఇది ఇన్ డోర్, అవుట్ డోర్ లలోనూ అద్భుతమైన డిస్ ప్లే ను అందిస్తుంది. మంచి క్వాలిటీతో కూడిన పిక్చర్ ను అందిస్తుంది. ఐపీ68 రేటింగ్ తో వాటర్, డస్ట్ రెసిస్టెంట్ గా పనిచేస్తుంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి. ప్రతి రోజూ చేసే వ్యయామాలు, వాకింగ్ వంటి పర్యవేక్షణ ఉంటుంది. ఇందులో 120 స్పోర్ట్స్ మోడ్లు ఉంటాయి. ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్ చేసే వారికి సరిగ్గా సరిపోతుంది. అలాగే ఇన్ బిల్ట్ గేమ్స్ ఈ స్మార్ట వాచ్ లో ఉంటాయి.

జెన్ బడ్స్ ఇవో టీడబ్ల్యూఎస్ బడ్స్..

ఈ ఇయర్ బడ్స్ స్టైలిష్ లుక్ లో ఉంటాయి. దీనిలో ట్రూ టాక్ ఏఐ ఈఎన్సీ కాల్స్ టెక్నాలజీని వినియోగించారు. ఇది బ్యాగ్రౌండ్ నాయిస్ ను సమర్థవంతంగా తగ్గిస్తోంది. 32 గంటల ప్లే టైం ఉంటుంది. ఇందులో మూవీ లేదా మ్యూజిక్ మోడ్లు ఉంటాయి. దీనిలో ఎలక్ట్రో ప్లేటెడ్ టైప్ సీ ఫాస్ట్ చార్జింగ్ కేస్ ఉంటుంది. ఇది కూడా ఐపీఎక్స్5 రేటింగ్ తో వాటర్ రెసిస్టెన్స్ గా వస్తోంది.

ఇవి కూడా చదవండి

ధర, లభ్యత..

పీట్రాన్ ఏస్ స్మార్ట్ వాచ్ జూలై పదో తేదీ నుంచి కొనుగోలుదారులకు అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ. 1299గా ఉంది. అలాగే పీట్రాన్ ఇయర్ బడ్స్ ధర రూ. 899గా ఉంది. ఇది జూలై 11 నుంచి ఆన్ లైన్లో అందుబాటులోకి రానుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

Follow Us
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే