Oppo 5G Smartphone: 4కే కెమెరా క్వాలిటీతో ఒప్పో కొత్త ఫోన్.. టాప్ రేటెడ్ ఫీచర్లు.. హై క్లాస్ డిజైన్‌తో అందుబాటులోకి..
ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 64ఎంపీ టెలిఫొటో పోర్ట్ రైట్ ఓఐఎస్, 8ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటాయి. ముందు వైపు సెల్ఫీల కోసం 32ఎంపీ కెమెరా ఉంటుంది. వెనుకవైపు కెమెరాతో 4కే రిజల్యూషన్ వీడియోలు తీయొచ్చు.
టెక్ మార్కెట్లో 5జీ ట్రెండ్ వేగంగా అలవడుతోంది. అన్ని కంపెనీలు 5జీ వేరియంట్లో కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో నుంచి కొత్త 5జీ ఫోన్ మార్కెట్లోకి విడుదలైంది. రెనో సిరీస్ లో రెనో 10 5జీ, రెనో 10 ప్రో మోడళ్లకు అప్ గ్రేడ్ వెర్షన్ గా ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ 5జీ ను గ్రాండ్ గా లాంచ్ చేసింది. దీనిలో స్నాప్ డ్రాగన్ 8ప్లస్ జెన్ 1 చిప్ సెట్ ఉంటుంది. అలాగే 64ఎంపీ ఆప్టికల్ జూమ్ లెన్స్ తో ఈ ఫోన్ వస్తోంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బస్ట్ పోర్ట్ రైట్ ఫోన్ అని ఒప్పో ప్రకటించుకుంది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు..
ఈ ప్రీమియం కర్వడ్ స్మార్ట్ ఫోన్ లో 6.74 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ 10 బిట్ అమోల్డ్ ప్యానల్ ఉంటుంది. 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఈ ఫోన్ బరువు 194గ్రాములుంటుంది. మందం 8.28ఎంఎం ఉంటుంది. అధిక పనితీరు కోసం స్నాప్ డ్రాగన్ 8ప్లస్ జెన్ 1 ఎస్ఓసీ, అడ్రెనో 730 జీపీయూ ఉంటుంది. 12జీబీ ర్యామ్, 256 ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తోంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ 4,600ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. 100 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు చేస్తుంది.
ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ ఫీచర్లు..
ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 64ఎంపీ టెలిఫొటో పోర్ట్ రైట్ ఓఐఎస్, 8ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటాయి. ముందు వైపు సెల్ఫీల కోసం 32ఎంపీ కెమెరా ఉంటుంది. వెనుకవైపు కెమెరాతో 4కే రిజల్యూషన్ వీడియోలు తీయొచ్చు. సెకనులో 60 ఫ్రేమ్స్ తీయొచ్చు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ ఫోన్ వైఫై6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్బీ టైఫ్ సీ చార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ రీడర్, ఫేస్ అన్ లాక్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి.
ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ ధర, డిస్కౌంట్లు..
ఈ ప్రీమియం రెనో 10 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ. 54,999గా ఉంది. ఇది జూలై 13 నుంచి ఒప్పో అధికారిక వెబ్ సైట్ తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ లో కూడా అందుబాటులో ఉంటుంది. సిల్వర్, గ్రే, గ్లోసీ పర్పల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ప్రీ ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. పలు బ్యాంకు కార్డులను వినియోగించి పదిశాతం వరకూ తగ్గింపును పొందవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..