AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: వార్తలు చదువుతోంది లిసా.. ఈమె నిజమైన యాంకర్‌ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే..

పైన ఫొటో చూడగానే ఎవరో యాంకర్‌ వార్తలు చదువుతున్నట్లు కనిపిస్తోంది కదూ! మీరు చూసింది నిజమే ఆ యాంకర్‌ వార్తలు చదువుతోంది. కానీ ఆ ఫొటోలో ఉన్న మహిళ నిజమైన యాంకర్‌ కాదు. అవును మీరు చదివింది నిజమే. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో వార్తలు చెబుతోన్న ఏఐ న్యూస్‌ యాంకర్‌. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సాంకేతిక రంగంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో...

Viral: వార్తలు చదువుతోంది లిసా.. ఈమె నిజమైన యాంకర్‌ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే..
Viral News
Narender Vaitla
|

Updated on: Jul 11, 2023 | 3:04 PM

Share

పైన ఫొటో చూడగానే ఎవరో యాంకర్‌ వార్తలు చదువుతున్నట్లు కనిపిస్తోంది కదూ! మీరు చూసింది నిజమే ఆ యాంకర్‌ వార్తలు చదువుతోంది. కానీ ఆ ఫొటోలో ఉన్న మహిళ నిజమైన యాంకర్‌ కాదు. అవును మీరు చదివింది నిజమే. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో వార్తలు చెబుతోన్న ఏఐ న్యూస్‌ యాంకర్‌. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సాంకేతిక రంగంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు అన్ని రంగాల్లో కృత్రిమ మేథ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మీడియా రంగంలోకి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ ఉపయోగం వచ్చేసింది.

తాజాగా ఒడిశాకు చెందిన ఓటీవీ దేశంలోని తొలిసారి ఏఐ న్యూస్‌ యాంకర్‌తో వార్తలు చదివించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. చీర కట్టులో ఉన్న ఈ ఏఐ న్యూస్‌ యాంకర్‌ ఇంగ్లిష్‌లో వార్తలు చకచకా చదివేస్తోంది. అచ్చంగా మనిషి ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడుతోంది. లిప్‌ సింక్‌ కూడా పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్‌ కావడం ప్రత్యేకతగా చెప్పొచ్చు.

ఈ ఏఐ న్యూస్‌ యాంకర్‌గా లిసాగా నామకరణం చేశారు. ఈ యాంకర్‌.. టీవీతో పాటు, డిజిటల్ ప్లాట్‌ ఫామ్స్‌లోనూ ప్రధాన యాంకర్‌గా వ్యవహరిస్తుందని ఓటీవీ యాజమాన్యం తెలిపింది. టీవీ బ్రాడ్‌ కాస్టింగ్, జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఈ యాంకర్‌ను తీసుకొచ్చామని టీవీ యాజమాన్యం తెలిపింది. లిసా భవిష్యత్తులో ప్రాంతీయ భాషల్లోనూ మాట్లాడుతుందని చెప్పుకొచ్చారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలు కోల్పోవడం ఖాయమనే చర్చ జరుగుతోన్న తురణంలో ఇలాంటి సంఘటనలు వార్తలకు ఊతమిచ్చినట్లవుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే