AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతీసారి ల్యాప్‌టాప్ షట్ డౌన్ చేయకండి.. ఈ తప్పులు చేస్తే లాస్ అవ్వడం గ్యారంటీ..

ఇటీవల రిమోట్, వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు ఎక్కువగా చేస్తున్న క్రమంలో ల్యాప్‌టాప్ వినియోగం పెరుగుతోంది. కొన్ని మిస్డేక్స్ వల్ల మీ ల్యాప్‌టాప్ లైఫ్ టైమ్ తగ్గిపోవచ్చు. కొన్ని టిప్స్ పాటించడం వల్ల ల్యాప్‌టాప్ మెరుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా షట్ డౌన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రతీసారి ల్యాప్‌టాప్ షట్ డౌన్ చేయకండి.. ఈ తప్పులు చేస్తే లాస్ అవ్వడం గ్యారంటీ..
Laptop Charging
Venkatrao Lella
|

Updated on: Oct 04, 2026 | 9:26 PM

Share

సాధారణంగా చాలామంది యూజర్లు తమ ల్యాప్‌టాప్ లేదా పీసీని షట్‌డౌన్ చేస్తే అది పూర్తిగా ఆగిపోయిందని భావిస్తారు. అయితే మీరు చేసే షట్‌డౌన్ విధానం ద్వారా మీ కంప్యూటర్ పూర్తిగా ఆఫ్ అవ్వకపోవచ్చు. ముఖ్యంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉండే ఫాస్ట్ స్టార్టప్ ఫీచర్ కారణంగా సిస్టమ్ పూర్తిగా పవర్ ఆఫ్ అవ్వకుండా ఒక రకమైన హైబర్నేట్ స్థితిలోకి వెళ్తుంది. దీనివల్ల సిస్టమ్ వేగంగా స్టార్ట్ అయినప్పటికీ.. కొన్ని సమయాల్లో పనితీరు మందగించడం లేదా అప్‌డేట్‌లు సరిగ్గా ఇన్‌స్టాల్ అవ్వకపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. మీరు మీ సిస్టమ్ నిజంగా పూర్తిగా ఆగిపోయిందో లేదో తెలుసుకోవాలంటే.. కంట్రోల్ + షిఫ్ట్ + ఎస్కేప్ నొక్కి టాస్క్ మేనేజర్‌ను తెరవండి. అక్కడ పర్ఫార్మెన్స్ ట్యాబ్‌లోకి వెళ్తే.. అప్‌టైమ్ విభాగంలో మీ ల్యాప్‌టాప్ లేదా పీసీ ఎన్ని రోజులు, గంటల నుండి ఆన్‌లో ఉందో చూడవచ్చు. మీరు షట్‌డౌన్ చేసినప్పటికీ అప్‌టైమ్ ఎక్కువ ఉన్నట్లయితే మీ సిస్టమ్ పూర్తిగా ఆఫ్ అవ్వడం లేదని అర్థం.

ల్యాప్‌టాప్‌లో మూడు ఆప్షన్లు ఉంటాయి. అవే Sleep, Hibernate, Shutdown. ల్యాప్‌టాప్ కొద్ది సేపు ఉపయోగించకపోతే ఆటోమేటిక్‌గా స్లీప్ మోడ్‌లోకి వెళుతుంది. మీరు కొద్దిసేపు మాత్రమే ల్యాప్‌టాప్ ఆఫ్ చేయాలనుకుంటే స్లీప్ మోడ్ ఉపయోగించడం బెటర్. స్లీప్ మోడ్‌లో ఉండటం వల్ల మీ ఫైల్స్, బ్రౌజర్ ట్యాబ్స్ అలాగే ఉంటాయి. మళ్లీ ల్యాప్‌టాప్ స్టార్టింగ్ నుంచి తెరవాల్సిన పని ఉండదు. మీరు పని మధ్యలో బ్రేక్ తీసుకుంటున్నప్పుడు ల్యాప్‌టాప్ షట్ డౌన్ చేయకపోవడమే మంచిది. ఇక ల్యాప్‌టాప్ ఎక్కువ సేపు ఉపయోగించకూడదని అనుకున్నప్పుడు Hibernate మోడ్ ఉపయోగించాలి. కానీ కొన్ని ల్యాప్‌టాప్‌లలో ఈ ఆప్షన్ అందుబాటలో ఉండదు. ఈ ఆప్షన్ వల్ల స్లీప్ మోడ్ తరహాలోనే ఎక్కడ పని ఆపారో అక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఈ మోడ్ వల్ల కరెంట్ ఎక్కువ ఆదా అవుతుంది.

మీ పని మొత్తం పూర్తయిన తర్వాత ల్యాప్‌టాప్‌తో అవసరం లేదనకుంటే షట్ డౌన్ చేయాలి. ఎక్కువ గంటల పాటు ల్యాప్‌టాప్ ఉపయోగించనప్పుడు ఈ మోడ్ ఉపయోగించుకోవాలి. ఇక చార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు స్లీప్‌లో ఉంచడం కంటే షట్ డౌన్ చేయడం మంచిది. స్లీప్ మోడ్ వల్ల కొంత విద్యుత్ ఆదా అయితే.. Hibernate మోడ్ వల్ల మరింత పవర్ ఆదా అవుతుంది. పది నిమిషాలు లేదా అరగంట బ్రేక్ తీసుకున్న సమయంలో స్లీప్ మోడ్ ఆన్ చేసుకోవాలి. ఎక్కువసేపు బ్రేక్ తీసుకుంటే Hibernate  ఆప్షన్ వాడాలి. మొత్తం పని అయ్యాక షట్ డౌన్ ఆప్షన్ ఉపయోగించాలి.

Follow Us