Joker malware attack: మీ ఫోన్‌లో ఈ 50 యాప్స్‌లో ఒక్కటున్నా డిలీట్ చేయండి.. లేదంటే అంతే సంగతులు..!
Joker malware attack: టెక్నాలజీ దినదినాభివృద్ధి చెందుతోంది. అయితే, ఈ టెక్నాలజీ వల్ల మేలు జరిగేది సంగతి పక్కన పెడితే.. కీడు చేసే వారే ఎక్కువ అవుతున్నారు.

Joker malware attack: టెక్నాలజీ దినదినాభివృద్ధి చెందుతోంది. అయితే, ఈ టెక్నాలజీ వల్ల మేలు జరిగేది సంగతి పక్కన పెడితే.. కీడు చేసే వారే ఎక్కువ అవుతున్నారు. డెవలప్ చేస్తున్న టెక్నాలజీని అడ్డు పెట్టుకునే.. జనాలను రోడ్డు మీదకు ఈడుస్తున్నారు. హ్యాక్ చేయడం, అమాయకుల నుంచి డబ్బులు కాజేయడం చేస్తున్నారు కేటుగాళ్లు. ఇప్పటికే ఎన్నోరకాల మాల్వేర్లతో సతమతం అవుతుంటే.. తాజాగా జోకర్ మాల్వేర్ విజృంభిస్తోంది.
ఈ మాల్వేర్ బారిన పడిన కొన్ని యాప్‌లు Google Play Storeలో ఉన్నాయి. దీంతో చాలామందికి తెలియకుండానే ఇలాంటి ప్రమాదకరమైన యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్నారు. Zscaler Threatlabz ప్రకారం, జోకర్ Google Play Storeలో 50 యాప్‌లను ఇన్ఫెక్ట్ చేసింది. అయితే, గూగుల్ వెంటనే ఈ యాప్‌లను తన ప్లే స్టోర్ నుండి తొలగించింది. మీరు ఇప్పటికే మీ ఫోన్‌లో ఈ యాప్‌లలో దేనినైనా ఉపయోగిస్తుంటే.. వెంటనే వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. Threatlabz పరిశోధన బృందం ప్రకారం.. జోకర్, ఫేస్‌స్టెల్లర్, కాపర్ మాల్వేర్ ఫ్యామిలీ యాప్‌ల ద్వారా వ్యాప్తి చెందుతున్నట్లు ఇటీవల గుర్తించారు.
జోకర్ అనేది Android మొబైల్ ఫోన్స్ నుంచి డేటా మొత్తాన్ని లాగేసుకునే మాల్వేర్‌లలో ఒక భాగం. ఇది కొత్త మాల్వేర్ కాదు. చాలా పాతదే అయినప్పటికీ.. ఈ మాల్వేర్ ఎప్పటికప్పుడు దాని కోడింగ్ నిర్మాణాన్ని అప్‌డేట్ చేయడం ద్వారా Google యాప్ స్టోర్‌లోకి ప్రవేశించేలా చేస్తుంది. ఈ మాల్వేర్ ఉన్న యాప్‌లు స్మార్ట్ ఫోన్‌లో ఉంటే.. వారికి సంబంధించిన సమస్త సమాచారాన్ని లాగేస్తుంది.




జోకర్ మాల్వేర్ ఎఫెక్టెడ్ యాప్స్ ఇవే.. 1. Universal PDF Scanner – com.unpdf.scan.read.docscanuniver 2. Private Messenger – com.recollect.linkus 3. Premium SMS – com.premium.put.trustsms 4. Smart Messages – com.toukyoursms.timemessages 5. Text Emoji SMS – messenger.itext.emoji.mesenger 6. Blood Pressure Checker – com.bloodpressurechecker.tangjiang 7. Funny Keyboard – com.soundly.galaxykeyboard 8. Memory Silent Camera – com.silentmenory.timcamera 9. Custom Themed Keyboard – com.custom.keyboardthemes.galaxiy 10. Light Messages – com.lilysmspro.lighting 11. Themes Photo Keyboard – com.themes.bgphotokeyboard 12. Send SMS – exazth.message.send.text.sms 13. Themes Chat Messenger – com.relish.messengers 14. Instant Messenger – com.sbdlsms.crazymessager.mmsrec 15. Cool Keyboard – com.colate.gthemekeyboard 16. Fonts Emoji Keyboard – com.zemoji.fontskeyboard 17. Mini PDF Scanner – com.mnscan.minipdf 18. Smart SMS Messages – com.sms.mms.message.ffei.free 19. Creative Emoji Keyboard – com.whiteemojis.creativekeyboard.ledsloard 20. Fancy SMS – con.sms.fancy 21. Fonts Emoji Keyboard – com.symbol.fonts.emojikeyboards 22. Personal Message – com.crown.personalmessage 23. Funny Emoji Message – com.funie.messagremo 24. Magic Photo Editor – com.amagiczy.photo.editor 25. Professional Messages – com.adore.attached.message 26. All Photo Translator – myphotocom.allfasttranslate.transationtranslator 27. Chat SMS – com.maskteslary.messages 28. Smile Emoji – com.balapp.smilewall.emoji 29. Wow Translator – com.imgtop.camtranslator 30. All Language Translate – com.exclusivez.alltranslate 31. Cool Messages – com.learningz.app.cool.messages 32. Blood Pressure Diary- bloodhold.nypressure.mainheart.ratemy.mo.depulse.app.tracker.diary 33. Chat Text SMS – com.echatsms.messageos 34. Hi Text SMS – ismos.mmsyes.message.texthitext.bobpsms 35. Emoji Theme Keyboard – com.gobacktheme.lovelyemojikeyboard 36. iMessager – start.me.messager 37. Text SMS – com.ptx.textsms 38. Camera Translator – com.haixgoback.outsidetext.languagecameratransla 39. Come Messages – com.itextsms.messagecoming 40. Painting Photo Editor – com.painting.pointeditor.photo 41. Rich Theme Message – com.getmanytimes.richsmsthememessenge 42. Quick Talk Message – mesages.qtsms.messenger 43. Advanced SMS – com.fromamsms.atadvancedmmsopp 44. Professional Messenger – com.akl.smspro.messenger 45. Classic Game Messenger – com.classcolor.formessenger.sic 46. Style Message – com.istyle.messagesty 47. Private Game Messages – com.message.game.india 48. Timestamp Camera – allready.taken.photobeauty.camera.timestamp 49. Social Message – com.colorsocial.message 50. Simple Note Scanner – com.wuwan.pdfscan
దీనికి సంబంధించి యూజర్లకు ఏవైనా సందేహాలు ఉంటే.. ఈ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా మరింత సమాచారం తెలుసుకోవచ్చు.(https://www.zscaler.com/blogs/security-research/joker-facestealer-and-coper-banking-malwares-google-play-store.)
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..