AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio TV: జియో టీవీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌.. 14 ఓటీటీ యాప్స్‌..

జియో ఈ ప్లాన్స్‌ను నెలవారీ, మూడు నెలలు, ఏడాది ప్లాన్స్‌గా తీసుకొచ్చింది. ప్రారంభ రీఛార్జ్ రూ. 398గా ప్రకటించారు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకున్న వారికి అన్‌లిమిటెడ్‌ డేటా, వాయిస్‌తో పాటు ఎస్‌ఎమ్‌ఎస్‌లను కూడా పొందొచ్చు. ఇక వీటితో పాటు యూజర్లు డిస్నీ+ హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, సోనీ లివ్‌, జీ5తో పాటు మరికొన్ని యాప్స్‌ను పొందొచ్చు. డిసెంబర్ 15వ తేదీ నుంచి ఈ ప్లాన్స్‌ అందుబాటులోకి వచ్చింది...

Jio TV: జియో టీవీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌.. 14 ఓటీటీ యాప్స్‌..
Jio Tv
Narender Vaitla
|

Updated on: Dec 15, 2023 | 4:26 PM

Share

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో టీవీ సేవలను విస్తరిస్తోంది. ఇప్పటి వరకు ఉచిత సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన జియో.. తాజాగా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ప్రారంభించింది. జియో తీసుకొచ్చిన ఈ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌తో 14 ఓటీటీ యాప్స్‌ను సింగిల్‌ ప్లాన్‌లోనే పొందే అవకాశం కల్పించారు.

జియో ఈ ప్లాన్స్‌ను నెలవారీ, మూడు నెలలు, ఏడాది ప్లాన్స్‌గా తీసుకొచ్చింది. ప్రారంభ రీఛార్జ్ రూ. 398గా ప్రకటించారు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకున్న వారికి అన్‌లిమిటెడ్‌ డేటా, వాయిస్‌తో పాటు ఎస్‌ఎమ్‌ఎస్‌లను కూడా పొందొచ్చు. ఇక వీటితో పాటు యూజర్లు డిస్నీ+ హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, సోనీ లివ్‌, జీ5తో పాటు మరికొన్ని యాప్స్‌ను పొందొచ్చు. డిసెంబర్ 15వ తేదీ నుంచి ఈ ప్లాన్స్‌ అందుబాటులోకి వచ్చింది.

జియోటీవీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ కోసం మొత్తం మూడు ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. 28 రోజులు, 84 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్స్‌ను పరిచయం చేసింది. ఇక వీటి ధరల విషయానికొస్తే.. 28 రోజుల ప్యాకేజీ రూ. 398, 84 రోజుల ప్యాకేజీ రూ. 1198, 365 రోజుల ప్యాకేజీ రూ. 4,498గా నిర్ణయించారు. ఈ ప్లాన్స్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే.. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్‌ ఈ ప్లాన్స్‌ను పొందొచ్చు.

ఈ ప్లాన్స్‌ కేవలం జియో యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఇక రూ. 398తో రీఛార్జ్‌ చేసుకుంటే.. 12 ఓటీటీ యాప్స్‌ పొందొచ్చు. అలాగే.. రూ.1198, రూ.44978 ప్లాన్స్‌తో రీచార్జ్‌ చేసుకుంటే 14 ఓటీటీ యాప్స్‌ను యాక్సెస్ చేయొచ్చు. ఏడాది ప్లాన్‌ తీసుకోవాలంటే ఈఎంఐ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. జియో మొబైల్‌ నెంబర్‌తో జియో టీవీ ప్రీమియం ఓటీటీ కంటెంట్‌ను పొందొచ్చు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో.. సబ్‌స్క్రిప్షన్‌ను మైజియో యాప్‌ ద్వారా యాక్సెస్‌ చేయొచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్‌ను వినియోగించాలంటే నేరుగా జియో నంబర్‌తో లాగిన్‌ అవ్వొచ్చు. మై జియో యాప్‌లో కూపన్‌ సెక్షన్‌లోకి వెళ్లి జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చని తెలిపారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..