AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato Harvest Robot: పిచ్చెక్కిస్తున్న జపాన్‌ టెక్నాలజీ.. టామాటాలు తెంచేందుకు రోబోలు.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే..

Tomato Harvest Robot: వ్యవసాయ సాగులో రోజుకో కొత్త విప్లవం వస్తోంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా కొద్ది.. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ఎక్కువైపోతోంది.

Tomato Harvest Robot: పిచ్చెక్కిస్తున్న జపాన్‌ టెక్నాలజీ.. టామాటాలు తెంచేందుకు రోబోలు.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే..
Tomato
Shiva Prajapati
|

Updated on: Oct 26, 2021 | 4:55 PM

Share

Tomato Harvest Robot: వ్యవసాయ సాగులో రోజుకో కొత్త విప్లవం వస్తోంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా కొద్ది.. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ఎక్కువైపోతోంది. తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ ఉత్పత్తి, లాభం వచ్చే విధంగా సరికొత్త ఆవిష్కరణలకు తెర తీస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ కొన్ని దేశాల్లో మానవాధారిత వ్యవసాయంపై ఆధారపడి సాగు చేస్తున్నారు. ఈ విధానంలో మనుషులే కీలకం. విత్తనం విత్తింది మొదలు.. పంట చేతికి వచ్చే వరకు మనుషులపైనే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే, సాంకేతిక విప్లవానికి కేరాఫ్ అయిన జపాన్‌.. తాజాగా వ్యవసాయంలో మరో ఆద్భుత ఆవిష్కరణ తీసుకువచ్చింది. టమాటా సాగు కోసం రోబోలను తయారు చేశారు. ఆ రోబోల సాయంతో టమాటాలు కోశారు. యూరప్‌లోని ఇనాహో కంపెనీ ఈ రోబోట్‌ ను రూపొందించింది. జపనీస్ కంపెనీ ఇనాహోకు ఇది అనుబంధం కంపెనీ.

తాజాగా డచ్‌లో రోబోట్ సాయంతో టమాటా పంట కోత చేపట్టారు. ‘‘టమాటా హార్వెస్టింగ్ రోబోట్’’ వీక్షించేందుకు సందర్శకులను కూడా ఆహ్వానించారు ఇనాహో కంపెనీ వారు. రోబోట్ సాయంతో వ్యవసాయం సాగు చేసే విధంగా ఔత్సాహికులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే ఈ రోబోట్ కల్టివేషన్‌ను ప్రదర్శించడం జరుగుతుందని ఇనాహో యూరోప్ మేనేజింగ్ డైరెక్టర్ తకాహిటో షిమిజు తెలిపారు. ‘‘రోబోట్‌ల పనితీరు, వాటి వినియోగం పెంచడానికి, వాటి పనీతీరులో ఏవైనా మార్పులు చేయాల్సి ఉంటే.. వ్యవసాయ సాగుదారుల నుంచి అభిప్రాయలను సేకరించడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని చెప్పారు.

నెదర్లాండ్స్‌లోని వెస్ట్‌ల్యాండ్‌లో గల సమాచార, విద్యా కేంద్రంలోని గ్రీన్‌హౌస్‌లో స్నాక్ టమాటాలు పండిస్తున్నారు. అయితే, ఈ టమాటాల కోత కోసం ఆటోమేటిక్ పరికరమైన రోబోట్‌ను వినియోగించడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గోరిథం టెక్నాలజీ సాయంతో పని చేసే ఈ రోబోట్‌లు.. పండిన టమాటా పండ్లను రంగు, పరిమాణం ఆధారంగా గుర్తించి వాటిని కోస్తుంది. ఇనాహో కంపెనీ వారు ఈ రోబోట్‌లను ఇప్పటికే జపాన్‌లో ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించింది. అక్కడ సక్సెస్ సాధించింది. మనుషులపై 16 శాతం పనిభారాన్ని తగ్గించిందని కంపెనీ పేర్కొంది. అయితే, డచ్ వ్యవసాయదారుల సాగు భిన్నంగా ఉందని, పంట వేయడం మొదలు కోత వరకు రకరకాల విధానాలు పాటిస్తున్నారని ఇనాహో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే.. డచ్ సాగులో వినూత్న మార్పులు తీసుకురావాలని, డచ్ వ్యవసాయ విధానంలో మార్పులు తీసుకువచ్చేందుకు, సాగులో అధునాత పరిజ్ఞాన్ని వినియోగించడంపై అవగాహన కల్పించాలని తలంచినట్లు ఇనాహో మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. ఈ క్రమంలోనే టమాటా హార్విస్టింగ్‌లో రోబోట్ ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించామన్నారు. అంతేకాదు.. ఫీల్డ్ ట్రయల్స్‌ని నిర్వహించగిలిగే ఔత్సాహిక వ్యవసాయ సాగుదారుల భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

జపాన్‌కు చెందిన ఇనాహో అగ్రికల్చర్‌లో రోబోట్‌ను ప్రయోగించడం ఇదే తొలిసారి కాదు. 2019లోనే AI-టెక్నాలజీతో రూపొందించిన ఆస్పరాగస్ హార్వెస్టింగ్ రోబోట్‌ను ప్రారంభించింది. ఈ రోబోట్‌ల వినియోగం వల్ల రైతులకు శ్రమ తగ్గడమే కాకుండా, ఖర్చు కూడా తగ్గి లాభాలు ఆర్జిస్తారని ఇనాహో యాజమాన్యం తెలిపింది.

Also read:

Anushka Sharma: ఆటగాళ్ల భార్యలనూ వదలని ట్రోలర్స్.. అనుష్క శర్మను తాకిన టీమిండియా ఓటమి సెగ

Travel influencer: ఏడాది బుడ్డోడు.. నెలకు రూ. 75 వేలు సంపాదిస్తున్నాడు..! వైరల్‌ అవుతున్న వీడియో..

Nagashaurya-Ritu varma: రీతూతో లవ్‌లో పడ్డా.. నాగశౌర్య బోల్డ్‌ స్టేట్‌మెంట్‌.. చిన్న నవ్వుతో షాక్ లో రీతూ..(వీడియో)