NASA: నక్షత్రం నిర్మాణం చూశారా..? కళ్లుచెదిరే అంతరిక్ష దృశ్యాన్ని పంచుకున్న నాసా..
NASA’s Hubble Telescope Captures: అంతరిక్షంలో జరిగే ప్రతి చిన్న సంఘటనలపై ఖగోళ శాస్త్రవేత్తలు నిఘా వేసి ఉంచుతారు. రోదసిలో జరిగే ప్రతి సంఘటన
NASA’s Hubble Telescope Captures: అంతరిక్షంలో జరిగే ప్రతి చిన్న సంఘటనలపై ఖగోళ శాస్త్రవేత్తలు నిఘా వేసి ఉంచుతారు. రోదసిలో జరిగే ప్రతి సంఘటన అద్భుతంగా కనిపిస్తుంది. వాటిని చూసేందుకు రెండు కళ్లు కూడా చాలవు. ఎందుకంటే.. ఖగోళ శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఇప్పటికే ఎన్నో ఆవిష్కరణలు, అద్భుత సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) శాస్త్రవేత్తలు అలాంటి ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటో చూస్తే కళ్లు చెదిరిపోవడం ఖాయమని పలువురు పేర్కొంటున్నారు. తాజాగా నాసా శాస్త్రవేత్తలు అంతరిక్షంలో కొత్త నక్షత్రాలు ఏర్పడుతున్న దృశ్యాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. పాలపుంత గెలాక్సీ వెలుపల ఒక నక్షత్రాన్ని తరలిస్తున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిలో ఓ గ్రహాన్ని సైతం శాస్త్రవేత్తలు గుర్తించారు. నాసా మూన్ ఎక్స్-రే అబ్జర్వేటరీ ద్వారా ఈ ప్రత్యేకమైన ఆవిష్కరణ వెలుగులోకి వచ్చినట్లు నాసా తెలిపింది. ఇది వర్ల్‌పూల్ గెలాక్సీ అని కూడా పిలిచే స్పైరల్ గెలాక్సీ మెస్సియర్ 51 (M51)లోకి చేరుకుంటున్నట్లు వెల్లడించారు.
View this post on Instagram
ఈ ఫొటోల్లో అంతరిక్షంలో నక్షత్రాలు జన్మించే ప్రాంతాన్ని హబుల్ టెలిస్కోప్ కెమెరాలో బంధించింది. నక్షత్రాలు రూపుదిద్దుకునే ఈ ప్రాంతంలో ఎరుపు, పసుపు కలిసిన రంగుల్లో నక్షత్రాలు వజ్రాల్లా మెరిసిపోతూ కనిపిస్తున్నాయి. వీటిని హబుల్ టెలిస్కోప్ కెమెరాలో బంధించినట్లు నాసా తెలిపింది. ఈ అధ్యయనం క్రమంలో ఈ అత్యద్భుత సంఘటన జరిగినట్లు నాసా తెలిపింది. ఖగోళ శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా 4,000 కంటే ఎక్కువ అటువంటి ఎక్సోప్లానెట్‌లను కనుగొన్నట్లు తెలిపింది. సౌర వ్యవస్థ వెలుపల ఎక్సోప్లానెట్‌ల గురించి వివరించింది.
1990లో అంతరిక్షంలోకి పంపిన ఈ టెలిస్కోప్ 20 ఏళ్లుగా 13 లక్షలపైగా అంతరిక్ష అద్భుతాలను మనకు అందించింది. ఇటీవల రెండు గెలాక్సీలో ఒకదాని ఆకర్షణకు లోబడి షేక్ అవుతూ కదులుతున్న ఫొటోను కూడా నాసా షేర్ చేసింది. ఇప్పుడు పాలపుంత వద్ద కొత్తగా జన్మించిన నక్షత్రాలు రూపుదిద్దుకుంటున్న ఫొటోను పంచుకుంది.
Also Read: