AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Smartphone: రూ.9 వేలకే 16జీబీ స్మార్ట్‌ఫోన్.. బుధవారమే ఫస్ట్ సేల్.. పాత మొబైల్‌ రీలాంచ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే..

New Smartphone: ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోని నిత్యం అనేక రకాల మొబైల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఐటెల్ కంపెనీ కూడా తన కొత్త ఎస్23 మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను మనదేశంలో శుక్రవారం లాంచ్ అయింది. అయితే దీని ధర ఎంతో తెలిస్తే ఎవరైనా..

New Smartphone: రూ.9 వేలకే 16జీబీ స్మార్ట్‌ఫోన్.. బుధవారమే ఫస్ట్ సేల్.. పాత మొబైల్‌ రీలాంచ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే..
Itel S23
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 11, 2023 | 1:59 PM

Share

New Smartphone: ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోని నిత్యం అనేక రకాల మొబైల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఐటెల్ కంపెనీ కూడా తన కొత్త ఎస్23 మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను మనదేశంలో శుక్రవారం లాంచ్ అయింది. అయితే దీని ధర ఎంతో తెలిస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. అవును, 16జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర కేవలం రూ.8,799 మాత్రమే. యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ కూడా ఉండడం మరో ప్రత్యేకత.

శుక్రవారమే భారత్‌లో లాంచ్ అయిన ఈ ఐటెల్ ఎస్23 స్మార్ట్‌ఫోన్ సేల్ జూన్ 14వ తేదీ నుంచి అమెజాన్‌లో ప్రారంభమవుతుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్‌లో 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా అందుబాటులో ఉన్నప్పటికీ ఈ వేరియంట్ ధరను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు.

Itel S23 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్  మిస్టరీ వైట్, స్టారీ బ్లాక్ రంగుల్లో రానుంది. ఇంకా ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లే, 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌, కలర్ ఛేంజింగ్ ప్యానెల్‌, అల్ట్రా వైలెట్ కిరణాల్లో ఫోన్ బ్యాక్ ప్యానెల్ రంగులు మారేలా అద్భుత ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ అక్టాకోర్ 12 నానో మీటర్ యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌తో లాంచ్ అయింది.

ఇవి కూడా చదవండి

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఫోన్ వెనకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరా సహా రెండు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 ఎంపీ కెమెరా ఉంది. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, ఫేషియల్ రికగ్నిషన్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంకా 10W వైర్డ్ ఛార్జింగ్‌ సప్పోర్ట్‌తో ఈ ఫోన్ వస్తుంది. కాగా, ఐటెల్ మనదేశంలో ఇటీవలే తన మొట్టమొదటి ట్యాబ్లెట్‌ ఐటెల్ ప్యాడ్ వన్‌ను లాంచ్ చేసింది. ఇంకా ఏ ఏడాది ప్రారంభంలో ఐటెల్ ఎల్ సిరీస్ స్మార్ట్ టీవీలను కూడా లాంచ్ చేసింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..