Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ‘లైక్స్ కోసం ఇంతలా దిగజారాలా?’.. గౌనులో మార్కెట్‌కి వెళ్లిన యువకుడు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?

Watch Video: ప్రస్తుత కాలంలో చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఎలా అయిన ఫేమస్ అయిపోవాలనే కోరికతో నానా తంటాలు పడుతున్నారు. ఫేమస్ కావడమే లక్ష్యంగా.. ఏం చేస్తున్నామో కూడా తెలియకుండానే వివిధ ప్రయత్నాలు..

Watch Video: ‘లైక్స్ కోసం ఇంతలా దిగజారాలా?’.. గౌనులో మార్కెట్‌కి వెళ్లిన యువకుడు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Youngster In Female Outfit
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 11, 2023 | 11:53 AM

Watch Video: ప్రస్తుత కాలంలో చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఎలా అయిన ఫేమస్ అయిపోవాలనే కోరికతో నానా తంటాలు పడుతున్నారు. ఫేమస్ కావడమే లక్ష్యంగా.. ఏం చేస్తున్నామో కూడా తెలియకుండానే వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆపై తమ విన్యాసాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్‌గా మారుతున్నారు. అయితే ఈ క్రమంలో వారి ప్రయత్నాలు కొందరికీ స్ఫూర్తినిస్తుంటే.. మరి కొందరికీ నవ్వుతెప్పించేలా, తలనొప్పిగా ఉంటున్నాయి. అలాంటి వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ యువకుడు అమ్మాయిలా గౌన్ వేసుకొని మార్కెట్ ఏరియాలో తిరుగుతున్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో మీరు ఓ యువకుడు అమ్మాయిలు ధరించే గౌనును ధరించి మార్కెట్‌లోకి రావడం, టీషర్ట్ కొనడానికి బర్గెయినింగ్ చేయడం, ఇతరులను ఆటపట్టించడం వంటి దృశ్యాలను మీరు చూడవచ్చు. అయితే ఈ వీడియోలోని వ్యక్తి ఎవరు, అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయాలు తెలియరాలేదు కానీ ‘ilovepatna’ అనే ఇన్‌స్టా ఖాతా నుంచి వీడియో షేర్ అయింది.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియోపై నెటిజన్లు విస్తృత స్థాయిలో స్పందిస్తున్నారు. రకరకాల కామెంట్లతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘వీడెవడో కానీ వాడి కాన్ఫిడెన్స్ అద్భుతం’, ‘ఆంటీకి కూతుర్లు లేరేమో.. తన కొడుకును ఇలా పెంచింది’, ‘వాళ్ల అమ్మకు తెలిస్తే వీడిని చెప్పు తెగేలా కొడుతుంది’, ‘నీ ధైర్యానికి జోహార్లు’, ‘లైక్స్ కోసం మరీ ఇంతలా దిగజారాలా..?’ అంటూ పలువురు కామెంట్ చేశారు. మరోవైపు ఈ వీడియోకు ఇప్పటివరకు  2 లక్షలకు పైగా లైకులు, 42 లక్షల వీక్షణలు లభించాయి.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..