Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final: టెస్ట్ ఫైనల్ వదులుకోవాలా..? అదేనా విరాట్ కోహ్లీ క్రిప్టిక్ పోస్ట్‌కి అర్థం..? వైరల్ అవుతున్న విరాట్ స్టోరీ..

WTC Final 2023: లండన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా ఎదురీత ఈదుతోంది. 444 పరుగుల టార్గెట్‌తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియాకు ఇప్పుడు అసలు పరీక్ష మొదలైంది. నాలుగో రోజు ఆట..

WTC Final: టెస్ట్ ఫైనల్ వదులుకోవాలా..? అదేనా విరాట్ కోహ్లీ క్రిప్టిక్ పోస్ట్‌కి అర్థం..? వైరల్ అవుతున్న విరాట్ స్టోరీ..
Virat Kohli; WTC Final 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 11, 2023 | 1:11 PM

WTC Final 2023: లండన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా ఎదురీత ఈదుతోంది. 444 పరుగుల టార్గెట్‌తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియాకు ఇప్పుడు అసలు పరీక్ష మొదలైంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఫలితంగా ఐదో రోజు టీమిండియా విజయం కోసం 280 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(44), అజింక్యా రహానే(20) ఉన్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు, వరల్డ్ క్రికెట్ ఫ్యాన్స్ చూపులు అంతా కోహ్లీ, రహానే జోడీని టెన్షన్‌తో చూస్తున్నాయి.

అయితే అందరిలోనూ ఇంత టెన్షన్ ఉన్న ఈ తరుణంలో.. నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టా ఖాతాలో ఓ క్రిప్టిక్ స్టోరీ పెట్టాడు. ‘మనకు బాధలు, భయాలు, అనుమానాలు ఎక్కువగా ఉన్నట్లయితే బతకడానికి, ప్రేమించడానికి సమయం ఉండదు. కాబట్టి కఅన్నీ వదిలేసి ముందుకు సాగిపోవడానికి ప్రయత్నించాలి’ అని అర్థం వచ్చేలా తన స్టోరీని షేర్ చేశాడు. ఇక దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైలర్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

Kohli 1

కోహ్లీ పెట్టిన క్రిప్టిక్ పోస్ట్

కాగా, కోహ్లీ పోస్ట్‌ అర్థం తెలియక నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. ‘డబ్య్లూటీసీ ట్రోఫీ వదిలేయమంటున్నావా..?’, ‘టెన్షన్ టైమ్‌లో ఇంకా టెన్షన్ పెంచకు కోహ్లీ మామా’, ‘నీ పోస్ట్ అర్థం కాకపోయినా పర్వాలేదు కానీ నువ్వే ప్రపంచ క్రికెట్‌కి కింగ్’, ‘ఇన్నాళ్లూ నువ్వు మా కింగ్ మాత్రమే.. ఈ రోజు మ్యాచ్ గెలిపిస్తే నువ్వు దేవుడి మా గుండెల్లో నిలిచిపోతావు’ అంటూ రాసుకొస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..