Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5G Smartphone: దేశంలోనే చవకైన 5జీ ఫోన్ ఇదే.. 8జీబీ ర్యామ్, 128జీబీ మెమరీ, 50ఎంపీ కెమెరా..

మన దేశంలో ఐటెల్ పీ55 పేరుతో ఓ 5జీ ఫోన్ల లాంచ్ అయ్యింది. ఇది దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ గా కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ డైమెన్సిటీ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఏఐ పవర్డ్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. రెండు రంగు ఎంపికలతో పాటు ఒకే స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తోంది.

5G Smartphone: దేశంలోనే చవకైన 5జీ ఫోన్ ఇదే.. 8జీబీ ర్యామ్, 128జీబీ మెమరీ, 50ఎంపీ కెమెరా..
Itel P55 Smartphone
Follow us
Madhu

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 28, 2023 | 10:17 PM

మార్కెట్లో 5జీ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రధాన టెలికాం సంస్థలు ఎయిర్ టెల్, జియో లు ఇప్పటికే ప్రధాన నగరాలతో పాటు టైర్ టూ నగరాల్లోనూ 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. దీంతో అందరూ 5జీ ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. టాప్ బ్రాండ్ల నుంచి పెద్ద ఎత్తున 5జీ ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. ఈ క్రమంలో మన దేశంలో ఐటెల్ పీ55 పేరుతో ఓ 5జీ ఫోన్ల లాంచ్ అయ్యింది. ఇది దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ గా కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ డైమెన్సిటీ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఏఐ పవర్డ్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. రెండు రంగు ఎంపికలతో పాటు ఒకే స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తోంది. ఐటెల్ ఇండియా దీంతో పాటు మరో ఫోన్ ఐటెల్ ఎస్ 23ప్లస్ ని కూడా పరిచయం చేసింది. ఇది కర్వడ్ అమోల్డ్ డిస్ ప్లే తో వస్తుంది.ఇప్పుడు ఐటెల్ పీ 55 5జీ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వివరాలు తెలుసుకుందాం..

ఐటెల్ పీ55 5జీ ఫోన్ ధర, లభ్యత.. ఈ స్మార్ట్ ఫోన్ బ్లూ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది. 8జీబీ+ 128జీబీ వేరియంట్ లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 9,999గా ఉంది. ఈ ఫోన్ అక్టోబర్ 4 నుంచి అమెజాన్ ఇండియా సైట్లో అమ్మకానికి వస్తుంది.

ఐటెల్ పీ55 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు.. ఈ 5జీ స్మార్ట్ ఫోన్ 6.6-అంగుళాల హెచ్ డీ ప్లస్(1600 x 700 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. డ్యూయల్ నానో సిమ్ స్లాట్స్ ఉంటాయి. 90హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 8జీబీ ర్యామ్,128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఏఆర్ఏం మాలి జీ 57 ఎంసీ2 జీపీయూతో కూడిని ఆక్టా కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 6080 ఎస్ఓసీ ద్వారా అందించబడుతుంది. ఇది మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 256జీబీ వరకు విస్తరించవచ్చు. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ ఫోన్లో వెనుక వైపు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా యూనిట్‌తో పాటు ఎల్ఈడీ ఫ్లాష్‌ ఉంటుంది. సెకండరీ ఏఐ కెమెరాను కలిగి ఉంటుంది. ముందు కెమెరా 8-మెగాపిక్సెల్ సెన్సార్‌ ఉంటుంది. ఫోన్ 18వాట్ల వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.

ఐటెల్ పీ55 5జీ స్మార్ట్ ఫోన్ కు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఉంటుంది. 3.5ఎంఎం ఆడియో జాక్‌ కలిగి ఉంది. ఇది 5జీ, 4జీ వోల్ట్, వైఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్బీ టైప్-సి కనెక్టివిటీని అందిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..