ISRO: ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో మరో వైలురాయి.. ప్రయోగానికి సిద్ధమైన ఆర్‌ఎల్‌వి టిడి..
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సరికొత్త ప్రయోగానికి సిద్దమైంది. ఇస్రో రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమోన్‌స్ట్రేటర్ మొదటి రన్‌వే..
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సరికొత్త ప్రయోగానికి సిద్దమైంది. ఇస్రో రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమోన్‌స్ట్రేటర్ మొదటి రన్‌వే ల్యాండింగ్ ప్రయోగానికి సిద్ధమైంది. చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి దీన్ని ప్రయోగించబోతున్నారు. ఇప్పటి వరకూ ఉపగ్రహాలను అంతరిక్షంలోని కక్ష్యల్లో ప్రవేశ పెట్టేందుకు పిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌వి వాహక నౌకలను మాత్రమే ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే, ఇవి పునర్వియోగానికి ఉపయోగపడవు. మళ్లీ తయారు చేయాలంటే భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చారు. దీంతోఉపయోగించిన వాహక నౌకను మళ్లీ మళ్లీ ఉపయోగించుకునే అవకాశం ఏర్పడింది.
2016లో తొలిసారి జరిపిన ప్రయోగం విజయవంతమైన తర్వాత, ఇప్పుడు రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమోన్‌స్ట్రేటర్ మొదటి రన్‌వే ల్యాండింగ్ ప్రయోగానికి ప్రయోగానికి సిద్ధం చేశారు. కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్‌లో దీన్ని ప్రయోగించేందుకు అనువైన వాతావరణం కోసం ఎదురు చూస్తున్నామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు.
ఈ ప్రయోగంలో భాగంగా రీయూజబుల్ లాంచ్ వెహికల్ వింగ్ బాడీని హెలిక్యాప్టర్ ద్వారా మూడు నుండి ఐదు కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువెళతారు. రన్‌వే నుండి నాలుగు నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో సమాంతర వేగంతో విడుదల చేస్తారు. చిత్రదుర్గ సమీపంలోని డిఫెన్స్ ఎయిర్‌ఫీల్డ్‌లో అది ల్యాండ్ అవుతుంది. ఇస్రో చరిత్రలో ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ మరో మైలు రాయి అని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని సైన్స్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..