AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iPhone 17 Pro Vs Google Pixel 10 Pro : రెండు ఫోన్లలో ఏది బెస్ట్..? ఫీచర్లు ఎలా ఉన్నాయి..? కొనేముందు తప్పక తెలుసుకోండి..

ఐఫోన్ 17 ప్రో vs గూగుల్ పిక్సెల్ 10 ప్రో.. రెండు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు సూపర్ ఫీచర్లతో లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్‌లలో ఏది బెటర్..? ఎందులో శక్తివంతమైన ఫీచర్లు ఉన్నాయి..? ఏ ఫోన్‌లో ఎన్ని మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

iPhone 17 Pro Vs Google Pixel 10 Pro : రెండు ఫోన్లలో ఏది బెస్ట్..? ఫీచర్లు ఎలా ఉన్నాయి..? కొనేముందు తప్పక తెలుసుకోండి..
Iphone 17 Pro Vs Google Pixel 10 Pro
Krishna S
|

Updated on: Sep 10, 2025 | 1:06 PM

Share

ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయింది. ఈ కొత్త సిరీస్‌లో లాంచ్ అయిన ఐఫోన్ 17 ప్రోలో చాలా గొప్ప ఫీచర్లు ఉన్నాయి. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్ అయిన ఈ కొత్త ఐఫోన్ మోడల్ గూగుల్ పిక్సెల్ 10 ప్రోతో నేరుగా పోటీపడుతుంది. ఈ రెండు మోడళ్లలో ఏది శక్తివంతమైన ఫీచర్లతో వస్తుందో తెలుసుకుందాం..

డిస్‌ప్లే

ఐఫోన్ 17 ప్రోలో 6.3 ఇంచెస్ LTPO OLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10, డాల్బీ విజన్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని బ్రైట్‌నెస్ 3000 నిట్స్ వరకు ఉంటుంది. స్క్రీన్ రక్షణ కోసం సిరామిక్ షీల్డ్ 2 గ్లాస్ ఉపయోగించారు. మరోవైపు పిక్సెల్ 10 ప్రోలో కూడా 6.3 ఇంచెస్ LTPO OLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10 ప్లస్ సపోర్ట్‌తో వస్తుంది. అయితే పిక్సెల్ 10 ప్రోలో పీక్ బ్రైట్‌నెస్ 3300 నిట్స్ వరకు ఉంటుంది. ఇది ఐఫోన్ కంటే ఎక్కువ.

పనితీరు

ఐఫోన్ 17 ప్రోలో కొత్తగా వచ్చిన A19 ప్రో చిప్‌సెట్ ఉంది. ఆపిల్ మొదటిసారిగా 2 TB స్టోరేజ్ వేరియంట్‌ను పరిచయం చేసింది. ఇది 256 GB, 512 GB, 1 TB వేరియంట్‌లలో కూడా అందుబాటులో ఉంది. గూగుల్ పిక్సెల్ 10 ప్రోలో టెన్సర్ G5 చిప్‌సెట్ ఉంది. ఇది స్సీడ్, మల్టీటాస్కింగ్ కోసం రూపొందించబడింది. ఇది 16 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది.

ఆపరేటింగ్ సిస్టమ్

ఐఫోన్ 17 ప్రో కొత్త, మెరుగైన ఆపిల్ ఇంటెలిజెన్స్‌తో iOS 26పై పనిచేస్తుంది. పిక్సెల్ 10 ప్రో ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. గూగుల్ జెమిని ఆధారిత AIని ఉపయోగిస్తుంది.

బ్యాటరీ – కెమెరా

ఐఫోన్ 17 ప్రో బ్యాటరీ సామర్థ్యాన్ని ఆపిల్ వెల్లడించనప్పటికీ.. ఇది ఒకే ఛార్జ్‌పై 33 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ ఇస్తుందని తెలుస్తోంది. పిక్సెల్ 10 ప్రో 4870 mAh బ్యాటరీతో వస్తుంది. ఒకే ఛార్జ్‌పై 24 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

కెమెరా విషయానికొస్తే.. ఐఫోన్ 17 ప్రోలో మూడు 48-మెగాపిక్సెల్ కెమెరాలు, 8x ఆప్టికల్ జూమ్ ఉన్నాయి. పిక్సెల్ 10 ప్రోలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ, 48-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 48మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌తో 5x ఆప్టికల్ జూమ్ ఉంది.

ధరలు

ఐఫోన్ 17 ప్రో మూడు వేరియంట్‌లలో లభిస్తుంది:

256 GB: రూ. 1,34,900

512 GB: రూ. 1,54,900

1 TB: రూ. 1,74,900

పిక్సెల్ 10 ప్రో ఒకే వేరియంట్‌లో లభిస్తుంది:

16 GB / 256 GB: రూ. 1,09,999

రెండు ఫోన్‌ల ఫీచర్లు బలంగా ఉన్నప్పటికీ, వాటి వాస్తవ పనితీరు, బ్యాటరీ లైఫ్, ముఖ్యంగా కెమెరా ఎలా ఉంటాయో పరీక్షించిన తర్వాతే తెలుస్తుంది. ఈ రెండు ఫోన్‌ల మధ్య పోటీ గతంలో ఎన్నడూ లేనంత దగ్గరగా ఉంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..