iPhone 17 Series: దుమ్మురేపే ఫీచర్లతో ఐఫోన్ 17 సిరీస్.. స్టైలిష్ లుక్.. 8K వీడియో.. 20 నిమిషాల్లోనే ఛార్జ్..
టెక్ దిగ్గజం యాపిల్.. ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ను కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ఆవిష్కరించారు. వీటితో పాటు ఎయిర్‌పాడ్స్ ప్రో3, స్మార్ట్ వాచ్ సిరీస్ 11, ఎస్‌ఈ3 వాచ్‌ను కూడా లాంచ్ చేశారు. ఈనెల 19 నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి.

ఐఫోన్ ఎయిర్ తర్వాత.. యాపిల్ తమ ఫ్లాగ్‌షిప్ మోడల్స్ అయిన ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ప్రో లైనప్ ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్‌లలో అత్యంత శక్తివంతమైనవిగా నిలుస్తున్నాయి. వీటిలో కొత్తగా రూపొందించిన కెమెరా వ్యవస్థ, అత్యంత వేగవంతమైన A19 Pro చిప్, ఐఫోన్‌లోనే అత్యధిక బ్యాటరీ లైఫ్ వంటివి ప్రధాన ఆకర్షణలు. 20 నిమిషాల్లోనే 50 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ అవుతుందని యాపిల్ స్పష్టం చేసింది. ఇవి గతంలో వచ్చిన ఫోన్‌ల కంటే బలమైన ఫీచర్లతో వచ్చాయి.
ఫీచర్స్
ఐఫోన్ 17 ప్రో, ప్రో మ్యాక్స్ శక్తివంతమైన 3-నానోమీటర్ A19 ప్రో మొబైల్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఐఫోన్ 17, ఐఫోన్ 17 Air మోడల్స్‌లోని 8జీబీ RAMతో పోలిస్తే.. ఈ ప్రో మోడల్స్‌లో 12జీబీ ర్యామ్ లభిస్తుంది. ఇది భవిష్యత్తులో రాబోయే హై-ఎండ్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు, ముఖ్యంగా వచ్చే ఏడాది రాబోయే ఏఐ అప్‌డేట్‌కు సపోర్ట్ ఇస్తుంది.
కెమెరా వ్యవస్థ
ఈ రెండు ప్రో మోడల్స్‌లో కెమెరా వ్యవస్థ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. వీటిలో కొత్త, పెద్ద 48-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్ ఉంది. దీనివల్ల తక్కువ వెలుతురులో కూడా మంచి ఫోటోలు వస్తాయి. ఈ కెమెరా 8K వీడియోలు కూడా తీయగలదు. ఇది క్రియేటర్లకు ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ సాధనంగా ఉపయోగపడుతుంది.
డిజైన్ – డిస్‌ప్లే:
టైటానియంకు బదులుగా యాపిల్ కొత్త డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌ను ఉపయోగించింది. ఇది గ్లాస్, సిరామిక్ షీల్డ్ 2, మెటల్ మిశ్రమంతో కూడిన యూనిబాడీ ఛాసిస్‌ను కలిగి ఉంది. ఐఫోన్ 17 ప్రో స్క్రీన్ 6.3 అంగుళాలు కాగా, ప్రో మ్యాక్స్ ఏకంగా 6.9 అంగుళాల పెద్ద స్క్రీన్‌తో వస్తుంది.
ధర – లభ్యత
ఐఫోన్ 17 ప్రో ధర రూ.1,34,900 నుండి మొదలవుతుండగా.. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర రూ.1,49,900 నుండి మొదలవుతుంది. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉన్నాయి. అవి కాస్మిక్ ఆరెంజ్, డీప్ బ్లూ, సిల్వర్ రంగులలో లభిస్తాయి. సెప్టెంబర్ 19 నుండి ఇవి షాపుల్లో అందుబాటులో ఉంటాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




